ETV Bharat / opinion

అటవీ విస్తీర్ణం పెంచలేని 'వనోత్సవాలు'

భారత్​లో 1950 నుంచి ఏటా జులై ఒకటో తేదీ నుంచి వారం రోజుల పాటు జాతీయ వన మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నాటి నుంచి 71 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నా.. ఆశించిన ప్రయోజనం మాత్రం చేకూరలేదు. ఐరాస నిబంధనల మేరకు భూభాగంలో 33శాతం అడవులు ఉండాలి. కానీ భారత్‌ 21శాతం అటవీ ప్రాంతాన్ని మాత్రమే కలిగి ఉంది. ఏడు దశాబ్దాల వన ఉత్సవాలు అటవీ విస్తీర్ణాన్ని ఏమాత్రం పెంచలేని డొల్లతనం ఇక్కడ కనిపిస్తోంది.

author img

By

Published : Jul 2, 2021, 7:40 AM IST

Forest Festival
వన మహోత్సవాలు

మనుషులకే కాదు.. భూగోళంమీద సమస్త జీవజాలానికి ప్రాణాధారం చెట్లే. భూమ్మీద నానాటికీ తరిగిపోతున్న 'పచ్చ'లహారం భవిష్యత్‌ మానవ మనుగడను ప్రశ్నిస్తోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణ కర్తవ్యంగా మొక్కలు నాటాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రపంచదేశాలకు పదే పదే పిలుపిస్తోంది. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2020 ప్రకారం గాలిలో విషగాఢత అంటే- పార్టిక్యులేట్‌ మేటర్‌ అధికంగా ఉన్న మొదటి 30 నగరాల్లో 22 భారత్‌లోనే ఉండటం బాధాకరం. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడంతో పాటు, పెద్దయెత్తున మొక్కలు నాటాలని పర్యావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

అమలు కాని చట్టాలు

భారత్‌లో ఏటా జులై ఒకటో తేదీ నుంచి వారం రోజులపాటు జాతీయ వన మహోత్సవం జరుగుతోంది. 1950లో అప్పటి భారత వ్యవసాయ, ఆహార శాఖా మంత్రి కె.ఎం.మున్షీ దీనికి శ్రీకారం చుట్టారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ పాల్గొని అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాటినుంచి 71 ఏళ్లుగా దేశంలో వన మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నా ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. ఏటా కోట్లలో మొక్కలు నాటుతున్నా సరైన ఆలనా పాలనా లేకపోవడంతో చాలా చోట్ల పదోవంతు మాత్రమే నిలదొక్కుకుంటున్నాయి. దశాబ్దాలుగా మొక్కుబడిగా జరుగుతున్న ఈ కార్యక్రమాల వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో- దేశంలోని నగరాలు కాలుష్యానికి నిలయాలవుతున్నాయి. ఐరాస నిబంధనల మేరకు భూభాగంలో 33శాతం అడవులు ఉండాలి. కానీ భారత్‌ 21శాతం అటవీ ప్రాంతాన్ని మాత్రమే కలిగి ఉంది. ఏడు దశాబ్దాల వన ఉత్సవాలు అటవీ విస్తీర్ణాన్ని ఏమాత్రం పెంచలేని డొల్లతనం ఇక్కడ కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ చట్టం (1986), అటవీ పరిరక్షణ చట్టం (1980), వాయు కాలుష్య నియంత్రణ (1981), జలకాలుష్య నియంత్రణ (1974), వన్యప్రాణుల సంరక్షణ (1972), జీవవైవిధ్యం (2005) వంటి కట్టుదిట్ట చట్టాలు మనదేశంలో ఉన్నా- అడ్డూ ఆపూ లేకుండా వన విధ్వంసం జరుగుతూనే ఉంది. కొవిడ్‌ సంక్షోభం సృష్టించిన భయంకర వర్తమాన పరిణామాలను గమనించైనా ప్రతిఒక్కరూ వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించి, ఆక్సిజన్‌ను విడుదల చేసే వృక్షాల ప్రాధాన్యాన్ని గుర్తించి, వాటిని సంరక్షించే స్పృహను పెంపొందించుకోవాలి.

భారతదేశం ఏటా సమారు 13 వేల చ.కి.మీ. అటవీ భూమిని కోల్పోతోంది. నేడు మనదేశంలో సుమారు ఆరు కోట్ల 49 లక్షల హెక్టార్ల భూమి అటవీ ప్రాంతం కింద ఉన్నట్లు అంచనా. ఇటీవల కేంద్రప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానం, గ్రీన్‌ఇండియా మిషన్‌ పథకాల ద్వారా సామాజిక వనాల పెంపకం కార్యక్రమానికి పెద్దయెత్తున నడుంకట్టింది. 46వేల కోట్ల రూపాయలతో 50వేల హెక్టార్లలో సామాజిక అడవులు పెంచాలని, మరో 50 వేలహెక్టార్లలో అడవుల సాంద్రత పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలో 2015 నుంచి 2017 వరకు పచ్చదనం ఒకశాతం మాత్రమే పెరిగిందని 2018లో ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌(ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో...

జాతీయ స్థాయితో పోలిస్తే ఉభయ తెలుగురాష్ట్రాల్లో అటవీవిస్తీర్ణం కాస్త మెరుగ్గానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 29శాతం, తెలంగాణలో 26శాతం అటవీ విస్తీర్ణం ఉంది. దేశంలో మిజోరాం 85శాతం అటవీ విస్తీర్ణంతో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం 'హరితహారం' కార్యక్రమం కింద పెద్దయెత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'జగనన్న పచ్చ తోరణం' పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా దివంగత ఎన్‌.టి.రామారావు నేతృత్వంలో 1986లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన చెట్టు-పట్టా పథకం ఎంతో విజయవంతమైంది. దానివల్ల లబ్ధిదారులు నేటికీ ఫలసాయం, ఉపాధి పొందుతున్నారు. నదులు, కాలువలు, జలాశయాల గట్లు, తీరప్రాంతాల్లో ఫలసాయాన్నిచ్చే మొక్కలు దండిగా పెంచే పథకమది. ప్రతీ వంద మీటర్ల స్థలాన్ని ఒక పేద కుటుంబానికి పట్టాగా ఇచ్చి, మొక్కలు పెంచే బాధ్యత కల్పించారు. దానివల్ల ఫలసాయం వస్తుంది. హరితం పల్లవిస్తుంది. పర్యావరణ సమతౌల్యం పరిఢవిల్లుతుంది.

జాతీయస్థాయిలో ఈ తరహా పథకం అమలుచేస్తే సుమారు 30 లక్షల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. నీటి వనరులు పెరుగుతాయి. మొక్కలు పెంచే అవసరాన్ని ప్రజలందరూ గుర్తించేలా ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. విద్యార్థిదశ నుంచి మొక్కలు పెంచాలన్న అవగాహన కల్పించాలి. మొక్కలు నాటడం, పరిరక్షించడం అందరి దినచర్యల్లో భాగం కావాలి. మొక్కలను దత్తత తీసుకొనే సంస్కృతి విస్తరించాలి. 'ఇంటింటా మొక్క... ఊరంతా వనం' నినాదం సాకారం కావాలి. మొక్కలు నాటే దిశగా ప్రభుత్వాలు రూపొందించే పథకాలు ప్రజల్లో స్ఫూర్తి రగిలించేలా ఉండాలి. అప్పుడే దేశం హరితశోభతో కళకళలాడుతుంది.

- చిలుకూరి శ్రీనివాసరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.