ETV Bharat / opinion

భారతీయుల ఆకాంక్షలు గాలికి.. ఐరాసలో దక్కని చోటు - ఐరాస సంస్కరణలు

ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో రెండోస్థానంతో ఆర్థిక శక్తిని ఇనుమడింపజేసుకుంటున్న భారత్‌ వంటి కొత్త శక్తులు అంతర్జాతీయ యవనికపై బలంగా ఆవిర్భవించాయి. అయితే, సంస్కరణలకు మాత్రం ఐరాస ససేమిరా అంటోంది. జనాభాపరంగా రెండో పెద్ద దేశమైన భారత్‌ భద్రతామండలిలో సభ్యత్వం పొందలేనప్పుడు- సమానత్వ భావన అమలయ్యేదెలా?

UNO INDIA
ఐరాస
author img

By

Published : Nov 13, 2020, 8:42 AM IST

ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించి డెబ్భైఅయిదేళ్లయింది. ఈ ఏడున్నర దశాబ్దాల్లో ప్రపంచంలో చాలా పరిణామాలు జరిగాయి. ఇంతకుముందు సూపర్‌ పవర్‌ దేశాలుగా పేరొందినవి ప్రాధాన్యాన్ని, ప్రాబల్యాన్ని కోల్పోయాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో రెండోస్థానంతో ఆర్థిక శక్తిని ఇనుమడింపజేసుకుంటున్న భారత్‌ వంటి కొత్త శక్తులు అంతర్జాతీయ యవనికపై బలంగా ఆవిర్భవించాయి. వీటికితోడు, సాధారణ జీవితానికి అవాంతరాలు సృష్టించే ఉగ్రవాదం, వాతావరణ మార్పులు వంటి కొత్త ప్రపంచ సమస్యలు కూడా వచ్చి చేరాయి.

అయినా, ఐరాస ఇప్పటికీ సంస్కరణల బాటలో నడిచేందుకు, భారత్‌కు భద్రతా మండలిలో స్థానం కల్పించేందుకు ససేమిరా అంటోంది. ఐరాస సాధారణ సభ చరిత్రాత్మక 75వ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఐరాస భద్రతా మండలిని సమతుల భావనతో తీర్చిదిద్దుతూ, మరికొందరు ప్రతినిధులకు అవకాశం కల్పించాలని గొంతెత్తారు.

సమానత్వ భావన ఎలా?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశ పౌరులుగా- ఐరాస తన ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేసే హక్కు భారతీయులకు ఉంది. స్త్రీపురుషులు, చిన్నాపెద్దా దేశాలకు సమాన హక్కులు ఉన్నాయని ఐరాస ఛార్టర్‌ పీఠిక స్పష్టం చేస్తోందని మరవకూడదు. ఐరాస ఛార్టర్‌లోని అధికరణ రెండు ప్రకారం- అన్ని సభ్య దేశాల సార్వభౌమాధికార సమానత్వం ఆధారంగా ఐరాస పని చేయాల్సి ఉంది. జనాభాపరంగా రెండో పెద్ద దేశమైన భారత్‌ భద్రతామండలిలో సభ్యత్వం పొందలేనప్పుడు- సమానత్వ భావన అమలయ్యేదెలా?

భారత్‌లోని 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర జనాభా మేర మాత్రమే ఉన్న ఐరోపాలోని బ్రిటన్‌ (6.7 కోట్లు), ఫ్రాన్స్‌ (6.5 కోట్లు)లకు సైతం సభ్యత్వం ఉండి, ఒక పెద్దదేశానికి లేకపోవడం సమానత్వమెలా అవుతుంది? ఐరాస ఛార్టర్‌లోని 108, 109 అధికరణలే అప్రజాస్వామికం. ఎందుకంటే, ఐరాసలోని మూడింట రెండొంతుల దేశాలు ఛార్టర్‌లోని సవరణకు అంగీకారం తెలిపినా, మండలిలోని అయిదు శాశ్వత సభ్యదేశాల్లో ఒక్కటైనా తన వీటో శక్తితో సవరణను అడ్డుకునే అవకాశం ఉంది. ఇదెంతమాత్రం ప్రజాస్వామిక ప్రక్రియ కాదు. ప్రజాస్వామిక ప్రపంచంలోని ఏ పౌరసంస్థకూ ఇది సమంజసం అనిపించుకోదు.

ఇప్పుడున్న భారత్‌ అదికాదు...

ఇలాంటి అధికరణలు- శాశ్వత సభ్యదేశాలు రాజకీయాలకు పాల్పడేందుకు, సంస్కరణల్ని అడ్డుకునేందుకే ఉపయోగపడుతున్నాయి. ఈ కారణంగానే భారత్‌, బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీ జీ4 దేశాలుగా కూటమి కట్టి శాశ్వత సభ్యత్వ సాధన కోసం ఒకదానికొకటి సహకరించుకునేందుకు యత్నించినా ఫలితం దక్కడం లేదు. భారత్‌ సహనాన్ని అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆశావాద, ఆత్మవిశ్వాస, ఆత్మనిర్భరతతో కూడిన కొత్త భారత్‌ ఆవిర్భవిస్తోందన్న సంగతిని గుర్తెరగాలి. ఏడు దశాబ్దాల క్రితం- వందల ఏళ్ల వలస పాలనతో ఆర్థికంగా కునారిల్లిన పరిస్థితిలో తన హక్కుభుక్తమైన సభ్యత్వ స్థానం కోసం భారత్‌ డిమాండ్‌ చేసి ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడున్న భారత్‌ అదికాదు.

ఇలాంటి అసమానతలు తమ కర్మఫలమని సరిపెట్టుకుని సంతృప్తి చెందే పరిస్థితిలో దేశ ప్రజలు లేరు. భారత్‌ గతంలో ఏర్పరచుకున్న భ్రమలను వీడింది. హిందీ చీనీ భాయ్‌భాయ్‌ రోజుల్లో ప్రదర్శించిన అమాయకత్వం లేదు. ఇరుగు పొరుగుతో, ప్రపంచంలో శాంతిని కాపాడాలన్నా- బలీయంగా ఎదగాలన్న సంగతిని అర్థం చేసుకుంది. ఇది చైనీయులకు ఇప్పటికే బోధపడింది. ఇతర దేశాలూ ఇదంతా ఆకళించుకునే రోజులు మరెంతో దూరం లేవు. 2022లో భారత్‌ తన 75వ స్వాతంత్య్ర సంబరాల్ని జరుపుకోనుంది. అప్పటికైనా ఐరాస తీరు మారాలి. ఇప్పటిదాకా మనిషి కనిపెట్టిన అత్యంత నాగరిక రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యమే అన్న సంగతిని గుర్తించాలి. భారత్‌ను భద్రతా మండలిలోకి ఆహ్వానించి గౌరవించాలి!

ఈ కారణాలు చాలవా?

భారత్‌ 91.1 కోట్ల మంది ఓటర్లతో కూడిన ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. 2019లో 60 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. జాతి, సాంస్కృతిక, భాషాపరమైన వైవిధ్యంతో, ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాల ప్రజలకు స్థానం కల్పించడం ఈ దేశం ప్రత్యేకత. భారతీయులు 121 భాషలు, 270 మాండలికాలు మాట్లాడతారు.

ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా 18శాతం. 2027 నాటికి చైనానూ అధిగమించి అత్యధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటంతోపాటు, ప్రపంచంలోని అయిదు అగ్రశ్రేణి సైనిక శక్తుల్లో ఒకటి. ఐరాస వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటి. 1942లో జరిగిన తొలి సదస్సులో సంతకాలు చేసిన 26 దేశాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఐరాస చేపట్టిన శాంతి పరిరక్షక కార్యక్రమాల్లోనూ గణనీయ కృషి జరిపింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు ఈ కారణాలు సరిపోవా అనే ప్రశ్న తలెత్తుతోంది.

(రచయిత- ఎ.సూర్యప్రకాశ్‌, ప్రసార భారతి మాజీ ఛైర్మన్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.