ETV Bharat / opinion

చిరుప్రాయంలోనే వ్యాపార బీజం- పాఠశాలలోనే కామర్స్​

దశాబ్దకాలంగా అధిక శాతం ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో మొదటిది వ్యాపార రంగం. ప్రపంచ గమనాన్ని శాసిస్తోందీ ఈ రంగమే. వ్యాపార పద్ధతుల్లో పలు మార్పులూ జరిగాయి. ఆన్‌లైన్‌ వ్యాపారం, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వంటివి వీటిలో ముఖ్యమైనవి. అందుకే వాణిజ్యశాస్త్రం(కామర్స్​) చదివేందుకు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. అయితే దీనికోసం ఇంటర్మీడియెట్​ వరకు వేచి చూడాల్సి వస్తుంది. మరి 'నూతన జాతీయ విద్యా విధానం-2020' దీని నుంచి బయటపడేట్టు చేస్తుందా!

Special story on Commerce degree and opportunities with commerce course
చిరుప్రాయంలోనే వ్యాపార బీజం-పాఠశాలలోనే కామర్స్​
author img

By

Published : Sep 17, 2020, 7:29 AM IST

ఒకప్పుడు విద్య లక్ష్యం జ్ఞానసముపార్జన! ఇప్పుడు ఉపాధి కల్పనే లక్ష్యంగా మారింది. ఉపాధి కల్పించలేని విద్య కొరగానిదవుతోంది. అందువల్లే 'నూతన జాతీయ విద్యా విధానం-2020' సైతం ఉపాధి కల్పించే విద్యకే పెద్దపీట వేసింది. దశాబ్దకాలంగా అధిక శాతం ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో మొదటిది, వ్యాపార రంగం. ప్రపంచ గమనాన్ని శాసిస్తోందీ ఈ రంగమే. వ్యాపార పద్ధతుల్లో అనేక మార్పులూ చోటుచేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ వ్యాపారం, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ అకౌంటింగ్‌ (టాలీ), టాక్సేషన్‌, ఫిన్‌టెక్‌ వంటివి వీటిలో ప్రముఖమైనవి. అనేక ఉపాధి అవకాశాలు వీటిలో ఉన్నాయి.అందువల్లే ఇటీవలి కాలంలో బి.కామ్‌ చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

పరిస్థితులు మారాలి!

డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నవారిలో 40 నుంచి 50 శాతం కామర్స్‌ కోర్సులనే ఎంచుకుంటున్నారు. అయిదేళ్ల వ్యవధిలో ప్రత్యేక కామర్స్‌ కళాశాలలు అనేకం ఆవిర్భవించాయి. అయితే, మన దేశంలో వ్యాపార, వాణిజ్య, అకౌంటింగ్‌ పరిజ్ఞానం కోసం విద్యార్థి ఇంటర్మీడియెట్‌ వరకు వేచిచూడాల్సి వస్తోంది. ఇంటర్‌లో సీఈసీ చేసి, డిగ్రీలో బి.కామ్‌ చదివినవారికే వాణిజ్య శాస్త్రంపై అవగాహన ఉంటోంది. అంటే అపార అవకాశాలుగల కామర్స్‌ పరిజ్ఞానం కోసం ఉన్నతవిద్య దశ వరకు వేచిచూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా వాణిజ్య శాస్త్రాన్ని పాఠశాల స్థాయినుంచే బోధించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలి.

అప్పుడే విద్యార్థికి అవగాహన!

పాఠశాల విద్యలో విధిగా ఆరు పాఠ్యాంశాలను చదివే విద్యార్థికి ఇంటర్మీడియెట్‌లోనే నచ్చిన సబ్జెక్టు ఎంచుకొనే అవకాశం దక్కుతోంది. పది వరకు చదివిన విద్య ఎమ్‌పీసీ, బైపీసీ విద్యార్థులకు ఉపకరిస్తుంది కానీ, సీఈసీ తీసుకున్నవారికి పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ప్రాథమికోన్నత దశలో వాణిజ్య శాస్త్రం ఉండకపోవడమే దీనికి కారణం. నూతన విద్యావిధానంలో ఇంటర్మీడియట్‌ ఉండదు. కనుక వాణిజ్య శాస్త్రాన్ని తొమ్మిదో తరగతి నుంచి తప్పని సరిగా ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తద్వారా విద్యార్థికి వ్యాపారం, అకౌంటింగ్‌ ప్రక్రియలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన ఏర్పడే అవకాశం లభిస్తుంది. ఆపై నాలుగేళ్ల డిగ్రీ కామర్స్‌ కోర్సును స్పష్టమైన అవగాహనతో ఎంచుకునే అవకాశం విద్యార్థికి దక్కుతుంది.

ఎన్నో అవకాశాలు

విద్యార్థి సంపూర్ణ వికాసానికి విద్య దోహదపడాలని మహాత్మా గాంధీ అభిలషించారు. పాఠశాల దశ నుంచే వాణిజ్య శాస్త్రాన్ని బోధించినట్లైతే వ్యాపారానికి సంబంధించిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. వ్యాపారం ఎలా చేస్తారు, దాని లాభనష్టాలు ఎలా లెక్కిస్తామన్న అంశాలపై ప్రాథమిక అవగాహన కలుగుతుంది. వ్యాపార దృక్పథం కొందరిలో మొగ్గతొడుగుతుంది. అది దేశానికి ఎంతో మేలు చేస్తుంది. ఉపాధి కోసం ఎదురుచూసేవారిగా కాకుండా అవకాశాలు కల్పించేవారిగా వారు రూపొందుతారు. ప్రస్తుతం ఇతర విద్యార్థులకన్నా మిన్నగా కామర్స్‌ విద్యార్థులనే అనేక అవకాశాలు పలకరిస్తున్నాయి. స్వయంఉపాధి కామర్స్‌ కోర్సుల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఆడిటర్‌గా, టాక్స్‌ కన్సల్టెంట్‌గా, అకౌంటెంట్‌గా, వ్యాపార సలహాదారుడిగా, స్టాక్‌మార్కెట్‌ విశ్లేషకుడిగా, మర్చంట్‌ బ్యాంకర్‌గా... ఇలా రకరకాలుగా ఇతరుల సహాయం లేకుండా సొంతంగా ఎదగవచ్చు. ఇలాంటి ఉపాధి మార్గాలపై విద్యార్థికి పాఠశాల దశ నుంచే అవగాహన ఏర్పడటం వల్ల భావి జీవితానికి సంబంధించి తగిన ఆలోచనలు, లక్ష్యాలను విద్యార్థి ఏర్పరచుకుంటాడు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటివే కాకుండా అభిరుచికి తగ్గ- భవిష్యత్‌ నిర్మించుకునేందుకు తగిన ప్రత్యామ్నాయాలు విద్యార్థి ముంగిట ఆవిష్కృతమవుతాయి. నేటి స్మార్ట్‌ఫోన్‌ కాలంలో విద్యార్థుల ఆలోచనా సరళిలో భిన్నమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు 20 ఏళ్ల విద్యార్థి ఆలోచనా సరళిని నేటితరం విద్యార్థి 15 సంవత్సరాలకే అందిపుచ్చుకొంటున్నాడు. కనుక పాఠశాల స్థాయిలో సాంఘిక, సామాన్య, గణిత శాస్త్రాలతోపాటే వాణిజ్య శాస్త్రాన్నీ ప్రవేశ పెట్టడం ఎంతైనా సమంజసం!

ఒక్క వాణిజ్య శాస్త్రమే కాదు, భవిష్యత్తులో వివిధ రంగాల్లో అవసరమైన ఉపాధి కల్పనకు కావలసిన నైపుణ్యాలను పాఠశాల దశనుంచే విద్యార్థికి అందించగలగాలి. అప్పుడు జ్ఞాన సముపార్జనతోపాటు ఉపాధి కల్పన ఆశలనూ నెరవేర్చుకోవచ్చు. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలుసుకుంటూ, నేర్చుకుంటూ విద్యార్థులు భావిజీవితానికి మార్గాలు పరచుకోవచ్చు. నూతన విద్యా విధానం నిర్దేశిత లక్ష్యమూ అదే!

రచయిత- డాక్టర్‌ రామకృష్ణ బండారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.