ETV Bharat / opinion

డోక్లాం కోసం చైనా ఆరాటం- భూటాన్​తో 'దౌత్య' పోరాటం!

author img

By

Published : Jul 24, 2020, 2:46 PM IST

భారత్​తో పరోక్ష దౌత్య యుద్ధానికి చైనా తెరతీసింది. భారత్​తో సన్నిహిత సంబంధాలున్న దేశాలను మభ్యపెడుతోంది. తాజాగా తన దృష్టిని భూటాన్​పైకి మళ్లించింది. దౌత్యపరమైన సంబంధాలు ఏర్పర్చుకునేలా భూటాన్​పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా భారత్​-భూటాన్ సంబంధాలను పరీక్షించనుంది.

Sakteng: China's bid to establish diplomatic ties with BhutanSakteng: China's bid to establish diplomatic ties with Bhutan
డోక్లాం కోసం చైనా ఆరాటం- భూటాన్​తో 'దౌత్య' పోరాటం!

విస్తరణ కాంక్షకు అంతులేదని చైనా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది. భారత్​ సరిహద్దులో వివాదాలు సృష్టించిన చైనా.. ప్రస్తుతం పరోక్షంగా కుట్రలు పన్నుతోంది. భారత్​తో సన్నిహిత సంబంధాలున్న భూటాన్​ను తనతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పర్చుకునేలా ఒత్తిడి తీసుకొస్తోంది. ఇటీవల సాక్టెంగ్ వన్యప్రాణి అభయారణ్యాన్ని వివాదాస్పద ప్రాంతంగా పేర్కొనడం సైతం భూటాన్​పై ఒత్తిడి తీసుకురావడానికేనని నిపుణులు చెబుతున్నారు. తద్వారా భారత్​-భూటాన్ మైత్రిని పరీక్షించనున్నట్లు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి- భూటాన్ మాదేనంటూ చైనా కొత్త కుట్రలు

ఈ నేపథ్యంలోనే భూటాన్​తో సరిహద్దు సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​విన్ మంగళవారం(జులై 21న) పేర్కొన్నారు. దీనికోసం భూటాన్​కు ప్యాకేజ్ డీల్ ఆఫర్ చేసినట్లు తెలిపారు.

"చైనా స్థానం స్పష్టంగా, స్థిరంగా ఉంది. చైనా, భూటాన్​ మధ్య సరిహద్దును ఇంకా నిర్ణయించలేదు. తూర్పు, పశ్చిమ సరిహద్దులు వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ వివాదాలకు చైనా పరిష్కారాన్ని ప్రతిపాదించింది. బహుపాక్షిక వేదికలపై ఇలాంటి వివాదాల ప్రస్తావనను చైనా వ్యతిరేకిస్తోంది. సమస్యపై సంబంధిత పక్షాలతో చైనా సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది."

-వాంగ్ వెన్​విన్, చైనా విదేశాంగ ప్రతినిధి

సాక్టెంగ్ వన్యప్రాణి అభయారణ్య అభివృద్ధికి చైనా ఎందుకు అభ్యంతరం చెబుతోందన్న ప్రశ్నకు వాంగ్ ఈ విధంగా సమాధానమిచ్చారు.

గ్లోబల్ ఎన్విరాన్​మెంట్ ఫెసిలిటీ(జీఈఎఫ్) నిధులతో అభయారణ్యం అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. 183 దేశాల భాగస్వామ్యంతో అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజాలు, ప్రైవేట్ సెక్టార్ సమన్వయంతో పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ఈ నిధి ఏర్పాటు చేశారు. కానీ వివాదాస్పద ప్రదేశమని చెబుతూ ఈ అభివృద్ధి పనులకు మోకాలడ్డింది డ్రాగన్.

అసలు సరిహద్దులోనే లేదు

అసలు చైనా అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గర్లో కూడా లేని ఈ ప్రాంతంపై ఆ దేశం హక్కులు ప్రకటించుకునేందుకు ప్రయత్నించడమే ఇప్పుడు పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఈ ప్రాంతం భారత్​, భూటాన్ సరిహద్దులో ఉంది. వాస్తవాదీన రేఖ వద్ద భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరగడం కూడా అనుమానాస్పదంగా మారింది. భారత్​కు వ్యతిరేకంగానే ఇవన్నీ చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

సమస్య ఏంటి?

భూటాన్ తూర్పు సరిహద్దు సమీపంలో సాక్టెంగ్ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇది భారత్​లోని అరుణాచల్​ప్రదేశ్​ రాష్ట్రానికి దగ్గర్లో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చైనా తన భూభాగంలో భాగమని చెప్పుకుంటోంది. దీన్ని దక్షిణ టిబెట్​గా పరిగణిస్తోంది.

భూటాన్, చైనా మధ్య అధికారిక దౌత్యపరమైన సంబంధాలేవీ లేవు. 1951లో టిబెట్​ను చైనా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇరువురు పొరుగుదేశాలుగా మారాయి. 1984 నుంచి సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య 24 దఫాల చర్చలు జరిగాయి.

ఇదీ చదవండి- చైనా 'ఇరాన్‌' తంత్రం.. ఎందుకీ దోస్తీ?

మరోవైపు భారత్, భూటాన్​ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు ఉన్నాయి. భూటాన్ అభివృద్ధిలో భారత్​ భాగస్వామ్యం ఎనలేనిది. భూటాన్​కు భారత్​ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా.

డోక్లాం తర్వాతే

2017లో డోక్లాం వివాదం తర్వాత ఈ కొత్తపాట అందుకుంది చైనా. భారత్, భూటాన్, చైనా ట్రైజంక్షన్​లో ప్రతిష్టంభన తర్వాత భూటాన్ ప్రాదేశిక భూభాగంపై హక్కులను ప్రకటించుకుంది. డోక్లాం ఘటన తర్వాత సరిహద్దు సమస్యపై భూటాన్ చైనాతో ఎలాంటి చర్చలు జరపలేదు. అప్పటి నుంచి భారత్​కు మద్దతుగానే ఉంది.

బంధం కోసం బలవంతం

తాజాగా చైనా విదేశాంగ శాఖ ప్రకటనను బట్టి చూస్తే.. భూటాన్​తో బలవంతంగా దౌత్యపరమైన బంధం నెలకొల్పి డోక్లాం ప్రాంతాన్ని తనదిగా ప్రకటించుకోవడానికి ఆ దేశం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.

"చైనా చెబుతున్న ఒప్పందం ప్రకారం మధ్య, తూర్పు భూటాన్​పై హక్కులను వదులుకొని డోక్లాంపై హక్కులు ప్రకటించుకునే అవకాశం ఉంది. వ్యూహాత్మక ప్రదేశమైన చుంబి లోయను ఆనుకొని ఉన్నందున డోక్లాంను చైనా కోరుకుంటోంది. చైనాతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పర్చుకునేలా భూటాన్​పై ఒత్తిడి తీసుకొచ్చి భారత్​-భూటాన్ సంబంధాలను పరీక్షించాలనుకుంటోంది. చైనాతో దౌత్యపరమైన సంబంధాలు లేని ఏకైక దక్షిణాసియా దేశం భూటాన్."

-డా. ఎస్​డీ ముని, జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీ గౌరవ ప్రొఫెసర్

ఈ పరిణామాలు భారత్​కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే భారత్​లోని సిక్కిం, భూటాన్​కు మధ్య ఈ చుంబి లోయ ఉంది. ఈశాన్యాన్ని భారత్​తో కలిపే సిలిగుడి కారిడార్​ వైపు ఈ ప్రాంతం పొడుచుకొని ఉంటుంది. 'చికెన్​ నెక్​'గా పిలుచుకునే ఈ ప్రాంతానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ చుంబి లోయ ఉంది.

అయితే సరిహద్దు సమస్యను చైనాతో పరిష్కరించుకున్నప్పటికీ.. భారత్-చైనా ఘర్షణలో భూటాన్​ తలదూర్చబోదని ప్రొఫెసర్ ముని స్పష్టం చేశారు. డోక్లాం సహా తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టుసాధించే విధంగా భూటాన్​ను బలవంతపెట్టేందుకే చైనా ప్రయత్నిస్తోందని డిప్లమాటిక్ రిస్క్​ ఇంటెలిజెన్స్​ డైరెక్టర్​ ఆఫ్ రీసెర్చ్​ అంకిత్ పాండా పేర్కొన్నారు.

భూటాన్ పరిష్కరించుకుంటేనే మేలు!

భూటాన్​లోని ప్రాంతాలపై ప్రాదేశిక హక్కులు ప్రకటించడం చైనా విస్తరణవాద విధానంలో భాగమే. భారత్​ సహా దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతతలు, తూర్పు చైనా సముద్రంలో జపాన్​ సరిహద్దులో ఉన్న సెంకకు ద్వీపాలపై వివాదాలు ఈ కోవకు చెందినవే.

చైనా ప్రణాళికలపై అమెరికా వంటి అంతర్జాతీయ శక్తులు గుర్రుగా ఉన్నప్పటికీ... చైనాతో తన సమస్యను ఇతరుల జోక్యం లేకుండానే భూటాన్ పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని ముని పేర్కొన్నారు.

(రచయిత-అరూనిమ్ భూయాన్)

ఇదీ చదవండి- భారత్,​ నేపాల్​ మధ్యలో చైనా- నిలిచేది ఎవరి బంధం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.