ETV Bharat / opinion

పేదరికంలో కూరుకుపోయిన 135 కోట్ల మంది బాలలు! - బాల్యంపై కరోనా ప్రభావం

నేటి బాలలే రేపటి పౌరులు. వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. ప్రస్తుతం కరోనా విపత్తు కారణంగా మూతబడిన పాఠశాలలు, ఊడిన ఉద్యోగాలు, స్తంభించిన జీవనం, తగ్గిన ఆదాయం పెద్దలతో పాటు పిల్లల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దిగువ, మధ్యతరగతి బాలలు ప్రాథమిక అవసరాలకు నోచుకోక పేదరికంలోకి కూరుకుపోయారని ఇటీవల యునిసెఫ్‌ వెలువరించిన అధ్యయనం పేర్కొంది.

childhood
బాల్యాన్ని హరిస్తున్న పేదరికం
author img

By

Published : Oct 5, 2020, 8:09 AM IST

బాలలు భవిష్యత్‌ మానవ వనరులు. వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. అందుకే నేటి బాలలే రేపటి పౌరులన్నారు పెద్దలు. వీరిపై పెట్టుబడి దేశాభివృద్ధికి సూచిక. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతి బిడ్డ జన్మ హక్కు. సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలంటే చిరు ప్రాయమే కీలకమైనది. పిల్లల మనసులు సున్నితమైనవి. ఈ వయసులో ఎదుర్కొనే ఇక్కట్లు వాళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెరగడానికి కావలసిన వనరులను సమకూర్చి అభివృద్ధికి దోహదపడటం మన బాధ్యత. కానీ, ప్రస్తుతం కరోనా విపత్తు కారణంగా మూతబడిన పాఠశాలలు, ఊడిన ఉద్యోగాలు, స్తంభించిన జీవనం, తగ్గిన ఆదాయం పెద్దలతో పాటు పిల్లల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దిగువ, మధ్యతరగతి బాలలు ప్రాథమిక అవసరాలకు నోచుకోక పేదరికంలోకి కూరుకుపోయారని ఇటీవల యునిసెఫ్‌ వెలువరించిన అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయనం ప్రకారం ఇప్పటికే కొవిడ్‌ కారణంగా విద్య, ఆరోగ్యం, గృహవసతి, పోషకాహారం, పారిశుద్ధ్యం, నీరు అందుబాటులో లేని పిల్లల సంఖ్య 120 కోట్లు ఉండగా, వీరికి అదనంగా మరో 15 కోట్ల మంది చేరారని, దీనివల్ల పేదరికం మరింత పెరిగిందని వెల్లడించింది. దీని ప్రభావం పేద, మధ్య తరగతి దేశాలపై అధికంగా ఉందని విశ్లేషించింది.

రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారి వాళ్ల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ప్రపంచ దేశాలతో పాటు బాలల జనాభా అత్యధికంగా గల వర్ధమాన భారతదేశం కూడా బాలల సంరక్షణ పట్ల మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.

కరోనాతో మరింతగా...

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో బాలల జీవనం ఇబ్బందుల పాలవుతోంది. ముఖ్యంగా కుటుంబ ఆదాయం పడిపోవడం వల్ల సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీని ప్రభావం పిల్లలపై పడింది. ఫలితంగా విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు నోచుకోని, వారి శారీరక, మానసిక వికాసాభివృద్ధి కుంటుపడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితికి, బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది.

కరోనా తెచ్చిన మార్పులతో బాలల్లో లింగపరమైన అసమానతలతో పాటు విద్యాపరమైన అంతరాలు పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 'బాలల జీవనంపై మహమ్మారి ప్రభావం'పై ఇటీవల 'సేవ్‌ ది చిల్డ్రన్‌' అనే సంస్థ ప్రత్యేక అధ్యయనాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మహమ్మారి కారణంగా 93శాతం కుటుంబాలు సగానికి పైగా ఆదాయం కోల్పోవడంతో ఆరోగ్య సేవలను పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, 62శాతం గృహాలు తమ కుటుంబానికి నాణ్యమైన పోషకాహారాన్ని అందించలేకపోతున్నాయని, 37శాతం పేద కుటుంబాలు పిల్లల అభ్యసన సామగ్రిని కొనలేకపోతున్నాయని ఈ సర్వే పేర్కొంది.

పాఠశాలలు మూసివేయడం వల్ల ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడి ప్రతి పదిమందిలో ఎనిమిది మంది పిల్లలు ఏమీ నేర్చుకోవడం లేదని, ఇంట్లో హింస రెట్టింపు అయిందని వెల్లడించింది. బాలికలపై ఇంటి పని, పిల్లల సంరక్షణ ఒత్తిడి పెరిగిందని, విద్యార్థుల్లో ప్రతికూల భావనలు ఎక్కువవుతున్నాయని పేర్కొంది. ఈ మహమ్మారి విద్యపరంగా ఆత్యయిక పరిస్థితి సృష్టించిన నేపథ్యంలో ఈ సంవత్సరం దాదాపు ఒక కోటి మంది పిల్లలు పాఠశాలకు తిరిగి రాకపోవచ్చనే అంచనా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం భారతదేశంలో మహమ్మారి ప్రభావంవల్ల 1.2 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన చేరే అవకాశం ఉందని పేర్కొనడం పిల్లల భద్రతకు పెను సవాళ్లు విసురుతోంది.

నేటి సంక్షోభ పరిస్థితుల్లో బాలల అవసరాలను తీర్చి, వారి వికాసానికి కృషి చేయడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలి. దీనికై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో బాలల హక్కుల రక్షణకు సంబంధించిన 1989 నాటి అంతర్జాతీయ ఒడంబడికను ప్రపంచ దేశాలు క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలి. భారత్‌లోనూ పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ఆరోగ్యం, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలి. ఆరోగ్య బీమా, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి.

పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి మధ్యాహ్న భోజన సదుపాయం అవసరం. హింస, దుర్విచక్షణల నుంచి పిల్లలను విముక్తి చేయడానికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కృషి చేయాలి. పిల్లల హక్కులను ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాలి.

డిజిటల్‌ అంతరాలను రూపుమాపడానికి బలహీన వర్గాల పిల్లలకు సాంకేతిక సాధనాలను అందించాలి. బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తూ, చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అప్పుడే మధురానుభూతుల బాల్యం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

- సంపతి రమేష్‌ మహారాజ్‌

ఇదీ చూడండి: ఎవరికో కొమ్ము కాస్తూ.. సంస్కారానికి నిప్పు పెట్టేశారే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.