ETV Bharat / opinion

12 రాష్ట్రాల్లో బీజేపీ- 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్​- పొలిటికల్ మ్యాప్​ను మార్చేసిన సెమీఫైనల్! - ఛత్తీస్​గఢ్ శాసనసభ ఎన్నికలు 2023

Political Map Of India With States In Telugu : తాజాగా వెలువడ్డ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో జోష్‌ను నింపాయి. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యను పన్నెండుకు పెంచాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కమలదళం కొనసాగిస్తోంది. మరోవైపు తెలంగాణలో అధికారం దక్కించుకున్నా.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ను కోల్పోవడం వల్ల కాంగ్రెస్‌ చేతిలో ఇప్పుడు మూడు రాష్ట్రాలే మిగిలాయి. ఉత్తర భారత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో అతిపెద్ద జాతీయ పార్టీగా అవతరించింది.

Political Map Of India With States In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 7:06 PM IST

Updated : Dec 3, 2023, 7:32 PM IST

Political Map Of India With States In Telugu : మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజృంభించింది. ఆదివారం వెలువడ్డ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడింట విజయం సాధించింది. దీంతో మొత్తం 12 రాష్ట్రాలకు బీజేపీ.. తన అధికారాన్ని విస్తరించింది. మరో నాలుగు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉండటం వల్ల దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు బీజేపీ తన బలాన్ని పెంచుకుంది.

Political Map Of India With States In Telugu
ఇండియా పొలిటికల్ మ్యాప్

దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు..
BJP Ruling States In Map : భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, గోవా, అసోం, త్రిపుర, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తాజా ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం సొంతం చేసుకోగా.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నుంచి కమలదళం అధికారాన్ని చేజిక్కించుకుంది. మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కొనసాగుతోంది.

బీజేపీ పాలిత రాష్ట్రాలు

దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు..
Congress Ruling States In Map : మరోవైపు దేశంలో.. రెండో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాగా.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో సీఎం పీఠాన్ని కోల్పోయింది. ప్రస్తుతం కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో విజయంతో 3 రాష్ట్రాలకు తన బలాన్ని కాంగ్రెస్‌ విస్తరించింది. అటు బిహార్, ఝార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కాంగ్రెస్‌ కొనసాగుతోంది. తమిళనాడులో అధికార DMKతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా లేదు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు

కాంగ్రెస్​, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు..
ప్రస్తుతం దేశంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌, BSP, CPM, NPP జాతీయ పార్టీ హోదా కలిగి ఉన్నాయి. దేశంలో మూడో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఉత్తర భారత్‌లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం దిల్లీ, పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉంది. ఇదే విషయాన్ని ఆప్ నేత జాస్మిన్ షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2024లో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

బీజేపీ, కాంగ్రెసేతర రాష్ట్రాలు

Last Updated : Dec 3, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.