ETV Bharat / opinion

దయనీయ స్థితిలో పాక్​​​.. అయినా ఐరాసలో కశ్మీర్​ టాపిక్​..​ వేర్పాటువాదులపై ప్రభావం పడిందా? - పాకిస్థాన్​ బిలాల్​ భట్​

పాకిస్థాన్‌ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. మునుపెన్నడూ లేనంత సంక్లిష్ట స్థితికి చేరింది. ఆర్థిక వ్యవస్థ పతనం అంచున వేలాడుతోంది. ఇలాంటి దారుణమైన స్థితిలోనూ దాయాది దేశం.. కశ్మీర్​పై చర్చించేందుకు తన ఆసక్తిని వ్యక్తం చేసింది. ఐక్యరాజసమితి జనరల్​ అసెంబ్లీ సమావేశంలో కశ్మీర్​ సమస్యను పాక్​ లేవనెత్తడాన్ని భారత్​ తప్పుపట్టింది. ఈ సందర్భంగా పాకిస్థాన్​ పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక విశ్లేషణ.

Pakistan economic crisis
Pakistan economic crisis
author img

By

Published : Feb 24, 2023, 6:22 PM IST

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత విధంగా పతనం అంచున వేలాడుతోంది. ఈ సంక్షోభ సుడిగుండం నుంచి దాయాది దేశం ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయ అస్థిరత ఆ దేశాన్ని మరింత దయనీయ పరిస్థితుల్లోకి నెడుతోంది. తాము దివాలా స్థితిలో బతుకుతున్నామంటూ పాక్​ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. ఆ దేశ రాజకీయ నాయకత్వ బేలతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇంత దారుణ పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్​.. గురువారం జరిగిన ఐక్యారాజ సమితి జనరల్​ అసెంబ్లీ సమావేశంలో కశ్మీర్​ సమస్యను మరోసారి లేవనెత్తింది. దీన్ని భారత్ తప్పుపట్టింది.

వేర్పాటువాదం.. కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమానికి​ మద్దతు ఇస్తున్న పాకిస్థాన్​కు సరిహద్దు ప్రాంతాల్లో మరో వేర్పాటువాద సమస్య ఎదురైంది. సరిహద్దు ప్రాంతాల నుంచి గిరిజనులు వస్తున్న కారణంగా అక్కడ వేర్పాటువాద నినాదం వినిపిస్తోంది. 1971లో బంగ్లాదేశ్ కోసం, ఆ తర్వాత తూర్పు పాకిస్థాన్​ కోసం వేర్పాటువాద ఉద్యమానికి మద్దతు ఇచ్చిన భారత్​పై పాకిస్థాన్​ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. 1980లో జరిగిన ఖలిస్థాన్​ ఉద్యమానికి దాయాది దేశం మద్దతు పలికింది. సిక్కులు తమకు సొంత దేశం కావాలని చేసిన డిమాండ్​ ఆధారంగా భారత్​ను విభజించేందుకు విఫలయత్నం చేసింది పాక్​. ఆ తర్వాత కశ్మీర్​పై దృష్టి పెట్టింది. అంతకుముందు పలుమార్లు కశ్మీర్‌ను తమ దేశంలో విలీనం చేయడానికి యత్నించింది.

కశ్మీర్​ సమస్యపై ఆధారపడే పార్టీలు.. అంతర్గత, బాహ్య వైరుధ్యాల వల్లే తమ దేశ ఆర్థిక వనరులు హరించుకపోయాయనే విషయాన్ని పాకిస్థాన్ పూర్తిగా మరిచిపోయింది. పాక్​ ప్రభుత్వం.. తన బడ్జెట్​లో ఎక్కువ భాగాన్ని సైన్యానికి ఖర్చు చేస్తోంది. ఎందుకంటే.. అఫ్ఘనిస్థాన్​ వల్ల తమ సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా దాయాది దేశంలో ఏ పార్టీ అయినా కశ్మీర్​ వేర్పాటువాదులపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ఏ నాయకుడూ కశ్మీర్​ సమస్యపై వ్యతిరేకంగా మాట్లాడలేరు.

నిధుల కొరత.. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా.. ఇస్లామాబాద్​తో పాటు ఇతర ప్రాంతాల్లో రహస్యంగా పనిచేస్తున్న కశ్మీర్​ వేర్పాటువాద శిబిరాలను నిర్వహించడం పాకిస్థాన్​కు సవాలుగా మారింది. ఉగ్రవాద శిబిరాల ప్రధాన కమాండర్లతో సహా వేర్పాటువాద గ్రూపుల నాయకులకు పెంచి పోషించేందుకు దాయాది దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ద్రవ్యోల్బణం.. పాకిస్థాన్​లో నిత్యావసర ధరలు.. ఆకాశాన్నంటాయి. ప్రతి వస్తువు ధర సుమారు 30 శాతం పెరిగింది. దీంతో ఆ దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఇప్పటికే పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. అనేక మంది యాచించే స్థాయికి కూడా చేరుకున్నారు. పాక్​లోని ద్రవ్యోల్బణం ధనికులు, పేదల మధ్య విభజనను మరింత విస్తృతం చేస్తోంది.

ఐఎంఎఫ్​ రుణం.. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి ఆర్థిక ప్యాకేజీ కోసం పాకిస్థాన్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 1980 నుంచి ఇటువంటి ప్యాకేజీ కోరడం ఇది పదమూడోసారి. అయితే ఐఎంఎఫ్​, పాకిస్థాన్​ ప్రభుత్వం మధ్య ఒప్పందం ఖరారు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే పాకిస్థాన్‌ ఒక దేశంలా పని చేయాలని, పేదలకు రాయితీలు ఇచ్చినా, సంపన్నులు పన్నులు చెల్లించేలా చేయాలని ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టిలీనా జార్జీవా తెలిపారు. ఐఎంఎఫ్​ ప్రతిపాదనలను అంగీకరిస్తే పాలకపక్షపై దీర్ఘకాల ప్రభావం పడనుంది. ముఖ్యంగా పేద ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసిన ధరల పెరుగుదలపై ఐఎంఎఫ్​ తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. ఇలాంటి కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​.. ఇప్పటికీ తమ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టకుండా కశ్మీర్​ సమస్యపై చర్చించేందుకు ఆసక్తి చూపడం చాలా దురదృష్టకరం!

-- బిలాల్​ భట్​, ఈటీవీ భారత్​ నెట్​వర్క్​ ఎడిటర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.