ETV Bharat / opinion

దేశమంతటా 'ఒక జిల్లా- ఒక ఉత్పత్తి' పథకం

ఉత్తర్​ప్రదేశ్‌లో ప్రారంభమైన 'ఒక జిల్లా- ఒక ఉత్పత్తి' పథకం ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, దేశీయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని తెలియజెప్పడం, భారీగా ఉపాధి అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, జిల్లాల్లో తయారీ, సేవల పరిశ్రమల అభివృద్ధి వంటి బృహత్తర లక్ష్యాలతో ఈ పథకం రూపుదిద్దుకుంది.

one district one product scheme to expand across in india
జిల్లాలే ప్రగతికి పట్టుగొమ్మలు
author img

By

Published : Mar 3, 2021, 6:35 AM IST

దేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో, 'ఒక జిల్లా- ఒక ఉత్పత్తి' పథకం పేరుతో అన్ని రాష్ట్రాల్లో కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, దేశీయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని తెలియజెప్పడం, భారీగా ఉపాధి అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, జిల్లాల్లో తయారీ, సేవల పరిశ్రమల అభివృద్ధి వంటి బృహత్తర లక్ష్యాలతో ఈ పథకం రూపుదిద్దుకుంది. ఇది దేశంలోని అపార వనరులను సద్వినియోగం చేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని నీతిఆయోగ్‌ అంచనా.

ఆశించిన అభివృద్ధి కరవు

భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ దేశం. ఇది విభిన్న భూభాగాలు, వాటిలో వివిధ రకాల పంటలు, ఆహారాలు, వేర్వేరు వాతావరణాల సమాహారం. ఇక్కడ 12 వందల రకాలకు పైగా పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల ఉత్పత్తులు జరుగుతున్నాయి. వ్యవసాయమే ప్రధాన రంగమైనా ఇందులో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు. ఆహార ఉత్పత్తుల మార్కెట్లో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. ఆహార మార్కెట్లో 65శాతం వాటా మాత్రమే సాధించింది. 35 శాతం ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. మరోవైపు దేశంలోని మొత్తం ఎగుమతుల్లో 10.7 శాతమే ఆహారశుద్ధి రంగం నుంచి జరుగుతున్నాయి. ఈ రంగంలో 19.3 లక్షల మందే భాగస్వామ్యం పొందారు. ఇందులో రైతుల సంఖ్య అయిదు లక్షలు దాటలేదు. అసంఘటిత ఆహార శుద్ధి రంగంలో దాదాపు 25 లక్షల యూనిట్లు (గ్రామీణ ప్రాంతాల్లో 66శాతం) ఉన్నాయి. ఇవి ఈ రంగంలో మొత్తం ఉపాధిలో 74శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇంకోవైపు చేతివృత్తులకు నిలయమైన మనదేశంలో- చేనేత, మట్టిపాత్రలు, బంగారం, వెండి, రాగి, కంచు లోహాలతో పాటు కలప ఉత్పత్తులతో కూడిన 1,915 వృత్తులు, హస్తకళలు ఉన్నాయి. వీటికి ప్రోత్సాహం కరవై అధికశాతం అవసాన దశకు చేరుతున్నాయి. చేతివృత్తులకు ఆలంబనగా కుటీర పరిశ్రమలు ఏర్పాటైనా వాటికీ గడ్డుకాలం దాపురించింది. ప్రస్తుతం దేశీయ హస్తకళల ఉత్పత్తుల ఎగుమతులు కేవలం మూడు శాతమే; చేనేత ఎగుమతులు ఒక్క శాతంగా మిగిలాయి.

స్థానిక వనరులను సద్వినియోగ పరుస్తూ ఉపాధి, అభివృద్ధికి వాటిని ఎలా మార్గదర్శకంగా మార్చవచ్చో జపాన్‌ నిరూపించింది. 1979లో ఆ దేశం ‘ఒక గ్రామం... ఒక ఉత్పత్తి’ అనే పథకాన్ని ప్రారంభించింది. భారీ పెట్టుబడుల అవసరం లేకుండా స్థానికులకు శిక్షణ ఇచ్చి, యంత్రాలు, మౌలిక సదుపాయాలను కల్పించింది. ఉత్పత్తులను పెద్ద యెత్తున ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు సాధించింది. ప్రస్తుతం జపాన్‌లోని ప్రతి ఊరూ ఒక ఎగుమతి కేంద్రంగా తయారైంది. ప్రతి వనరును ఒక ఉత్పత్తిగా మార్చి, దానికి విలువను జోడించి, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నమూనాను క్రమేపీ ఇండొనేసియా, కంబోడియాతో పాటు చైనా తదితర దేశాలు అందిపుచ్చుకొని అమలు చేస్తున్నాయి. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2018లో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ పేరిట దీన్ని చేపట్టింది. ప్రతి జిల్లాలోని ఉత్పత్తులను గుర్తించి, వాటిని ప్రోత్సహించే కార్యక్రమాలు ఆరంభించింది. ప్రతి జిల్లాలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రం ఏర్పాటు, మార్కెటింగ్‌ అభివృద్ధి పథకం కింద జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొనేందుకు అవకాశం, మార్జిన్‌ మనీ అందజేతతో పాటు నైపుణ్య అభివృద్ధి పథకాన్ని చేపట్టింది. గత రెండేళ్ల వ్యవధిలోనే ఈ పథకం మంచి ఫలితాలను సాధించింది. యూపీలోని యువతకు నైపుణ్య శిక్షణకు తోడు ఉపాధి అవకాశాలు లభించాయి. ఉత్పత్తులకు నాణ్యతను అద్దడంతో వాటి విలువ పెరిగింది. ఆర్థిక ప్రయోజనాలు సమకూరాయి. దీనిద్వారా యూపీ ఎగుమతులు 30 శాతం పెరిగాయి. భదోహి తివాచీల ఎగుమతి రూ.4,000 కోట్ల నుంచి రూ.8,000 కోట్లకు చేరింది. హస్తకళలు, ఆహారశుద్ధి, వస్త్రాల తయారీ వంటి పరిశ్రమలూ విదేశ మారక ద్రవ్యాన్ని మరింత ఆర్జిస్తున్నాయి. ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు తేవడం ద్వారా ఎగుమతులకు డిమాండు ఏర్పడింది. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులకు స్థానికంగానే కాకుండా, దేశీయంగా మార్కెటింగ్‌ పెరిగింది.

దేశమంతటికీ విస్తరణ

ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే ఉత్తర్‌ ప్రదేశ్‌లో చేపట్టిన ఈ పథకానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని స్వయంగా పథకం కార్యక్రమాల్లో పాల్గొని, దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. అయిదేళ్లలో భారత్‌లో తయారీ రంగంలో రూ.20 లక్షల కోట్ల ఉత్పత్తుల సాధనను కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వశాఖ లక్ష్యంగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలూ ఈ పథకాన్ని స్వాగతించాయి. తమ రాష్ట్రంలోని జిల్లాల్లో ప్రధాన ఉత్పత్తులను గుర్తించి, వాటి వివరాలను కేంద్రానికి అందించాయి. ఈ పథకం కింద వ్యవసాయ, ఉద్యానవనాలు, పశు ఆధారిత ఉత్పత్తులు, చేపలు, ఆక్వా వంటి 22 ఉత్పత్తులను ప్రాథమికంగా గుర్తించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌ కోసం కేంద్రం రూ.10,000 కోట్ల ఎంఎస్‌ఎంఈ నిధిని ప్రారంభించింది. అయిదేళ్లలో రెండు లక్షల సూక్ష్మ సంస్థలకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరళతర వ్యాపార నిర్వహణపై దృష్టి సారించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఉత్పత్తి, విలువ ఆధారిత ఎగుమతులకు ఊతమిచ్చే పథకాన్ని ప్రోత్సహించాలి.ఈ పథకాన్ని కేవలం ఎంపిక ప్రక్రియతోనే ముగించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృఢమైన కార్యాచరణ చేపట్టాలి. రాష్ట్రాలకు నీతి ఆయోగ్‌ సూచీ మాదిరే జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సూచీలను రూపొందించాలి. ఈ పథకానికి సంబంధించి జిల్లాలకు స్ఫూర్తిదాయక పోటీని కేంద్రం నిర్వహించాలి. కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న పరిస్థితుల్లో- ఈ పథకాన్ని సమర్థంగా నిర్వహిస్తే గుణాత్మక పరివర్తన సాధ్యపడగల వీలుంది.

తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం

ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పథకంలో తెలుగు రాష్ట్రాలూ భాగస్వాములుగా చేరాయి. ఏపీలోని వ్యవసాయ ఉత్పత్తులు వేరుసెనగ (అనంతపురం), టమాటా (చిత్తూరు), కొబ్బరి (తూర్పు గోదావరి), అరటి (కడప), ఉల్లి (కర్నూలు), నిమ్మజాతి పండ్లు (నెల్లూరు), జీడిమామిడి (శ్రీకాకుళం), చెరకు (విశాఖపట్నం), ఆక్వా (పశ్చిమ గోదావరి), మామిడి (కృష్ణా, విజయనగరం), మిర్చి, పసుపు (గుంటూరు, ప్రకాశం) కేంద్ర పథకం కింద గుర్తింపు పొందాయి. తెలంగాణలో పసుపు (నిజామాబాద్‌), సోయాబీన్‌ ఆధారిత ఉత్పత్తులు (ఆదిలాబాద్‌, కామారెడ్డి), మిర్చి (వరంగల్‌, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం), జొన్నలు (మహబూబ్‌నగర్‌) వేరుసెనగ (నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల), బత్తాయి (నల్గొండ), బియ్యం (పెద్దపల్లి), చేపలు (రాజన్న సిరిసిల్ల), కూరగాయలు (రంగారెడ్డి, సిద్దిపేట), పాలు (సూర్యాపేట, యాదాద్రి భువనగిరి), మామిడి (జగిత్యాల, మంచిర్యాల) ఉత్పత్తులను గుర్తించారు.

- ఆకారపు మల్లేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.