ETV Bharat / opinion

భవితకు చదువుల దిక్చూచి! - నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020

భారత్‌లాంటి మదపుటేనుగును భవిష్యత్తులోకి నడిపించాలన్న నూతన విద్యా విధాన రూపకర్తల యత్నం నిజంగా ఒక సాహసకృత్యం. దీని విజయం భారీ నిధుల కేటాయింపుపై అందరి సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించి, ఎన్‌ఈపీ 2020లో విశేషమైన ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. మూస నుంచి విముక్తి కల్పించేలా పటిష్ఠంగా విధానాన్ని రూపుదిద్దారు.

national education polocy 2020 a Study compass for the future!
భవితకు చదువుల దిక్చూచి!
author img

By

Published : Aug 15, 2020, 7:00 AM IST

ఎన్నో ఆకాంక్షలు మోసుకొని, భవిష్యత్తు పట్ల గొప్ప ఆశలు రేకెత్తిస్తూ మన ముందుకు వచ్చిన తేజోభరితమైన విధానం ఎన్‌ఈపీ-2020. జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన వారిలో కొందరితో నేను గతంలోనే సమావేశమై నా అభిప్రాయాలు పంచుకున్నాను. దాంతో ఎన్‌ఈపీ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో నాకు ముందుగానే కొంత అంచనా ఉంది. అందుకే దేశ భావి విద్యాగతిని శాసించే ఆ పత్రం నన్ను ఆశ్చర్యపరచలేదు. అది ఊహించినట్లుగానే ఉందనిపించింది. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.కస్తూరి రంగన్‌, బెంగళూరు ఉన్నత విద్యా విధాన పరిశోధన సంస్థ అధిపతి, వ్యాపార నిర్వహణ నేపథ్యం ఉన్న విద్యావేత్త డాక్టర్‌ ఎం.కె.శ్రీధర్‌ మాకమ్‌ వంటివారితో నేను అభిప్రాయాలు పంచుకున్నాను. కమిటీ సభ్యుల్లో ఒకరైన మంజుల్‌ భార్గవ్‌- సృజనాత్మకతకు, వినూత్న ఆలోచనా ధోరణికి ప్రభావశీల ప్రతినిధిగా కనిపించారు. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్న మంజుల్‌- తన గణిత ప్రతిభకు చాలావరకు భారతీయ నృత్యశాస్త్రమే కారణమని సగర్వంగా ప్రకటించారు.

మూసనుంచి విముక్తి

భారత్‌లాంటి మదపుటేనుగును భవిష్యత్తులోకి నడిపించాలన్న నూతన విద్యా విధాన రూపకర్తల యత్నం నిజంగా ఒక సాహసకృత్యం. దీని విజయం భారీ నిధుల కేటాయింపుపై అందరి సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఒక విధానం ఎంత మంచిదో దాని అమలూ అంతే మంచిగా ఉండాలన్నది అక్షరసత్యం. ఉన్నత విద్యకు సంబంధించి, ఎన్‌ఈపీ 2020లో విశేషమైన ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అధ్యయన శాస్త్రాల మూసల నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం! ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ విభాగాలను వేరు చేసి, విద్యార్థులను వాటిలోకి మూస పోసే ప్రక్రియ- మన చదువుల వ్యవస్థలో హైస్కూలు నుంచే ఆరంభమవుతుంది. విద్యానంతర వృత్తి, ఆమాటకొస్తే భావిజీవితం సైతం ఈ మూస ప్రకారం రూపుదిద్దుకొంటాయి... తప్పించుకునే వీల్లేదు. గోధుమ వర్ణ భారతీయులను మాంచి గుమస్తాలుగా తయారు చేయడానికి బ్రిటిష్‌ వలస పాలకులు రూపొందించిన ఈ విధానం నేటికీ మన నెత్తిన కూర్చుని మన తలరాతలు రాస్తోంది. ఒక వంక మనం ఈ మూసలో బిగుసుకుపోయి ఉండగా, మరోవంక ప్రపంచం మున్ముందుకు సాగింది.

ఆశలు రేకెత్తిస్తోంది

ఎవరైనా ఏ పాఠ్యాంశాలనైనా అభ్యసించవచ్చు(ఇంటర్‌ డిసిప్లినారిటీ) అనే కీలకాంశంపై దృష్టి సారించిన తాజా విధానపత్రం- భారతీయ ఉన్నత విద్యావ్యవస్థను ఇకమీదట 21వ శతాబ్దపు ఆవిష్కరణాత్మక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెడుతుందన్న ఆశలు రేకెత్తిస్తోంది. బోధనను పరిశోధనను సమైక్యపరచే 'మల్టీడిసిప్లినరీ' విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రతిపాదన ఈ ఆలోచనల పర్యవసానమే. బోధన శాస్త్రాల వేర్పాటు ఒక్కటే కాదు, బోధనలూ పరిశోధనలు కూడా భిన్న ధ్రువాలుగా ఉండటం అనేది సైతం 19వ శతాబ్దపు వలస పాలకుల మూస విధాన వ్యవస్థాగత వారసత్వమే. పరిశోధనలను కేవలం పరిశోధన సంస్థలకో, ప్రత్యేక శాస్త్రీయ వ్యవస్థలకో పరిమితం చేసి, బోధనను పూర్తిగా కళాశాలలకు విడిచిపెట్టారు. బోధన, పరిశోధనలను ఒకే ప్రాంగణంలోకి తెస్తూ అలెగ్జాండర్‌ వాన్‌ హంబోల్ట్‌ రూపొందించిన జర్మన్‌ నమూనా 20వ శతాబ్దపు అత్యున్నతాధికార యూఎస్‌ విశ్వవిద్యాలయాలకు స్ఫూర్తిదాయకమైంది. మన దేశంలో పరిమిత సంఖ్యలోనే విశ్వవిద్యాలయాల్లో మినహాయిస్తే ఈ తరహా ధోరణి కొరవడటం బాధాకరం. ఎన్‌ఈపీ 2020 ఈ అవసరాన్ని గుర్తించింది. మానవీయ శాస్త్రాలనుంచి, సైన్సు, ఇంజినీరింగు, గణిత అంశాల వరకు అన్ని విద్యావిభాగాల్లో పరిశోధన బోధనల ఏకీకరణకు ప్రాధాన్యం ఇచ్చింది.

మస్తిష్కాన్ని పునర్నిర్మించాలి

ఇంటర్‌ డిసిప్లినరీ పరిశోధన బోధనలు ఏకీకృతం కావాలన్న ఆలోచనను తలకెక్కించేందుకు, అధ్యాపకీయ మస్తిష్కాన్ని ఆసాంతం పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అత్యున్నత స్థాయిలో పరిశోధన వ్యవస్థను ప్రక్షాళించడం ద్వారా దీనికి ప్రయత్నించాలి. అప్పుడే భవిష్యత్‌ అధ్యాపకులకు ఇది తగు శిక్షణ ఇవ్వగలుగుతుంది. ప్రతిపాదిత జాతీయ పరిశోధన సంస్థ (నేషనల్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌) అత్యుత్తమంగా పనిచేసినట్లయితే, ఈ కీలక లక్ష్యం నెరవేరుతుంది. ఈ సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుంటే, పరిశోధన, అధ్యాపక అభివృద్ధికి గణనీయంగా పెట్టుబడి అవసరమవుతుంది. ఎన్‌ఈపీ ఏ విషయంలోనూ మనల్ని నిరుత్సాహపరచదు. విధాన పత్రంలో ప్రతిదీ చాలా స్పష్టంగా ఉంది.

ఏక సంవత్సర నిష్క్రమణ మాత్రం చోద్యం!

అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్రాం నుంచి నిష్క్రమించడానికి విద్యార్థికి బహుళ ఐచ్ఛికాలు కల్పించడం నూతన ఉన్నత విద్యావ్యవస్థలోని అత్యంత విశేషాంశం. అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యకు నాలుగేళ్ల కాలవ్యవధిలోనే సంపూర్ణత సిద్ధిస్తుందని నేను భావించేవాడిని. ఇప్పుడు ఈ నూతన విధాన పత్రం నా భావనను వాస్తవం చేసింది. అయితే, నాలుగేళ్లలో ప్రతి ఏడాదీ ఒక నిష్క్రమణ అవకాశం ఉండటం- డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, మూడేళ్ల, నాలుగేళ్ల బి.ఎ. డిగ్రీలు- మాత్రం చోద్యంగా ఉంది. ఇది సమస్యలతో కూడిన ప్రతిపాదన. కళాశాలలో ఒక ఏడాది చదివిన విద్యార్థి డిగ్రీ విద్య నుంచి ఏం తీసుకుపోతాడు? మా రోజుల్లోనూ బి.ఏ./బి.ఎస్సీ/బి.కామ్‌ పాస్‌, ఆనర్స్‌ ఉండేవి. రెండేళ్లు చదివితే పాస్‌, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్‌. రెండేళ్లు కళాశాలలో గడిపి 'ఆనర్స్‌' సబ్జెక్టు చదవకుండానే పొందే పాస్‌ డిగ్రీని కేవలం బొమికల గూడుగా భావించేవారు. ఇప్పుడు ప్రతిపాదించిన ఏక సంవత్సర నిష్క్రమణ వెసులుబాటుతో కళాశాల విద్య నగుబాటు పాలవుతుంది. ఏడాది చదువు అవకాశం దుర్వినియోగం అవబోదని ఆశిద్దాం.

ఆశాజనకం

చివరిగా ప్రస్తావించాల్సిన అంశం- 100లోపు ప్రామాణిక ర్యాంకింగు ఉండే అంతర్జాతీయ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ విద్యాప్రాంగణాలు ప్రారంభించడానికి నూతన విద్యావిధానం వీలు కల్పించడం. ఈ సంస్కరణ భారత ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ పరివర్తనకు గేట్లు తెరిచింది. మంచైనా చెడైనా, దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఊహించలేనిది. ఒకటైతే వాస్తవం. ఆదాయాల్లో క్షీణత, కుదించుకుపోతున్న బడ్జెట్లు, పడిపోతున్న ప్రవేశాలు, ప్రభుత్వ ప్రతికూల విధానాలు- ఇత్యాది దురవస్థల వలయంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న పశ్చిమ దేశాల విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా యూఎస్‌, యూకే దేశాల వాటికి, ఇది గొప్పఊరట కలిగిస్తుంది. వీటి ఆదాయాలలో చాలా భాగం విదేశీ విద్యార్థుల ప్రవేశాల ద్వారా లభిస్తున్నదే. ఇప్పుడు భారీస్థాయి భారతీయ విద్యావిపణిలో గణనీయంగా పెట్టుబడులు పెట్టి, ఇక్కడి సంస్థలతో సహకార ఒప్పందాలు కుదుర్చుకుని, తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వాటికి ఇదొక చక్కటి అవకాశం. యేల్‌- ఎన్‌యూఎస్‌ సింగపూర్‌లో, న్యూయార్క్‌ యూనివర్సిటీ పశ్చిమాసియాలో విజయవంతంగా అనేక విద్యాప్రాంగణాలు తెరచిన దృష్టాంతాలు ఇప్పటికే ఉన్నాయి. ఇంతటి ప్రభావం కనబరచేది కాబట్టే, 'టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌' పత్రిక భారత్‌ ఉన్నత విద్యారంగ సరళీకరణపై అప్పుడే పతాక శీర్షికతో ఒక ప్రధాన కథనాన్ని ప్రచురించింది.

కాలమే సమాధానం

అంతిమంగా దేశీయ విద్యాక్షేత్రంలో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? స్థానిక విశ్వవిద్యాలయాల ప్రమాణాలను పెంచుతుందా? అనారోగ్యకర పోటీకి ఇవి గురి కానున్నాయా? విద్యార్థుల మద్దతును కోల్పోతాయా? ఉన్నత విద్యపై ప్రజల దృక్పథం మారుతుందా? మార్పు ప్రభావం ఎవరిపై ఉంటుంది? పలుకుబడి గల ఒక చిన్న వర్గానికే పరిమితమవుతుందా? భారీ సంఖ్యలో ఉన్న దేశ యువతకు మొత్తం మీద ఇదేమైనా లాభం చేకూర్చుతుందా? కాలం మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు. భవిష్యత్తు ఎంత ఆశాజనకంగానైనా కనిపిస్తూ ఉండవచ్ఛు.. కార్యాచరణే కీలకం!

- ప్రొఫెసర్‌ సైకత్‌ మజుందార్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.