ETV Bharat / opinion

MP Election Ayodhya Ram Mandir : బీజేపీ X కాంగ్రెస్​.. అయోధ్య రాముడి చుట్టూ మధ్యప్రదేశ్​ ఎన్నికల ప్రచారం! - మధ్య ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు

MP Election Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర నిర్మాణం మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాక పుట్టిస్తోంది. బీజేపీ నేతలు తమ ఫ్లెక్సీలు, హోర్డింగులపై రామాలయం ఫొటోలు ముద్రించటంపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. అధికార పార్టీ నేతలు ప్రచారంలో మతపరమైన చిహ్నాలు వాడుతున్నారని పేర్కొంది. అయితే కమలనాథులు ఈ విషయాన్ని కూడా ప్రచారాస్త్రంగా చేసుకోవటం వల్ల.. కాంగ్రెస్‌ నేతలు వ్యూహం మార్చారు. రామ మందిరం బీజేపీకే సొంతం కాదని, దేశ ప్రజలందరికీ చెందుతుందంటూ హస్తం నేతలు ప్రచారం మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది.

MP Election Ayodhya Ram Mandir
మధ్యప్రదేశ్​లో రామమందిరంపై బీజేపీ vs కాంగ్రెస్
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 12:37 PM IST

MP Election Ayodhya Ram Mandir : మధ్యప్రదేశ్‌ శానససభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశం రెండు పార్టీల మధ్య రాజకీయ రగడకు దారితీస్తోంది. అయోధ్య అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌లో రామమందిరం ఫొటోను ముద్రిస్తోంది కమలం పార్టీ. దీనిపై హస్తం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఆలయ నిర్మాణం తుదిదశకు చేరుకోవటం.. కాంగ్రెస్‌కు కష్టంగా మారిందంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ మతపరమైన చిహ్నాలను వాడుతోందని ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అధికార పార్టీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. బీజేపీ ఏర్పాటు చేస్తున్న కటౌట్లు, హోర్డింగ్స్‌పై అయోధ్య రామమందిరం, ఉజ్జయిని మహాకాల్‌ ఆలయాల చిత్రాలను ముద్రించటాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది కాంగ్రెస్‌ పార్టీ.

ఈ అంశాన్ని కూడా బీజేపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవటంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసిన పత్రాలను బీజేపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ.. ప్రతిపక్ష పార్టీ రామాలయానికి వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్నారు. హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్‌ నైజమని కమలం నేతలు విమర్శిస్తున్నారు. తమ పార్టీ ఫ్లెక్సీలు, హోర్డింగులపై వేసిన రాముడి చిత్రాలను తొలగించాలని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయటంపై కమలనాథులు మండిపడుతున్నారు. రామ మందిరం రాష్ట్రంలోని 9.5కోట్లమంది ప్రజల విశ్వాసమని, రాముడిపై విశ్వాసముంటే కాంగ్రెస్‌ కూడా తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ల్లో రామమందిరం ఫొటోలు ముద్రించుకోవచ్చని బీజేపీ నేతలు చురకలు వేస్తున్నారు.

అయోధ్య ఆలయంపై బీజేపీ రాజకీయం చేస్తోందని మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ మండిపడ్డారు. రామమందిరం కేవలం బీజేపీకే సొంతం కాదనీ, దేశ ప్రజలందరికీ చెందుతుందని వ్యాఖ్యానించారు. రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమని, దేవున్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సూర్జేవాలా అన్నారు. మొత్తంగా చూస్తే అయోధ్య రామాలయ నిర్మాణ అంశం.. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారంలో కీలకంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

MP CM Constituency Budhni : సొంతగడ్డపై సత్తాచాటేందుకు శివరాజ్​ రెడీ.. VIP నియోజకవర్గంలో విజయం ఎవరిదో?

Bastar Maoist Affected Areas : 'బస్తర్​' మే సవాల్​.. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి పోలింగ్ కేంద్రాలు.. భారీ భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.