MP CM Constituency Budhni : వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పుడు అందరీ దృష్టి.. సెహోర్ జిల్లాలోని నర్మదా నది ఒడ్డున ఉన్న బుధ్ని అనే ఓ చిన్నపట్టణంపై పడింది. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలప్పుడు ఇది వార్తల్లో నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడ నుంచి పోటీ చేయడమే. తన కంచుకోట అయిన ఈ నియోజకవర్గం నుంచి సీఎం శివరాజ్‌సింగ్ మరోసారి బరిలోకి దిగారు.
బుధ్ని నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఐదుసార్లు గెలిచిన శివరాజ్ సింగ్.. ఆరోసారి విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక్కడ రెండు ముఖ్యమైన టెక్స్‌టైల్స్ పరిశ్రమలను నెలకొల్పి.. వందలాది యువతకు ఉపాధి కల్పించినట్లు అధికార పార్టీ చెబుతోంది.
-
मुझे ये कहते हुए गर्व है कि आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में दो-दो स्वदेशी वैक्सीन भारत ने बनाईं भी और भारत के साथ-साथ दुनिया के सौ से अधिक देशों में पहुंचा कर लोगों की जान बचाई।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
प्रधानमंत्री जी के मार्गदर्शन में मध्यप्रदेश भी तेजी से आगे बढ़ रहा है...… pic.twitter.com/efdgACC3Wq
">मुझे ये कहते हुए गर्व है कि आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में दो-दो स्वदेशी वैक्सीन भारत ने बनाईं भी और भारत के साथ-साथ दुनिया के सौ से अधिक देशों में पहुंचा कर लोगों की जान बचाई।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 27, 2023
प्रधानमंत्री जी के मार्गदर्शन में मध्यप्रदेश भी तेजी से आगे बढ़ रहा है...… pic.twitter.com/efdgACC3Wqमुझे ये कहते हुए गर्व है कि आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में दो-दो स्वदेशी वैक्सीन भारत ने बनाईं भी और भारत के साथ-साथ दुनिया के सौ से अधिक देशों में पहुंचा कर लोगों की जान बचाई।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 27, 2023
प्रधानमंत्री जी के मार्गदर्शन में मध्यप्रदेश भी तेजी से आगे बढ़ रहा है...… pic.twitter.com/efdgACC3Wq
"ముఖ్యమంత్రి(శివరాజ్ సింగ్ చౌహాన్) వల్లే బర్ధమాన్ ఫ్యాబ్రిక్స్, ట్రైడెంట్ గ్రూప్ రెండు ఫ్యాక్టరీలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది యువకులు అక్కడికి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. యువతలో కొంత ప్రతిభ కూడా ఉండాలి. అందుకే నేర్చుకుని పని చేసేందుకు సీఎం 8 వేల రూపాయలను ఇస్తున్నారు"
-- బుధ్ని నియోజకవర్గం ఓటరు
Shivraj Singh Chouhan Political Career : బుధ్ని నియోజకవర్గంలో 1990లో మొదటిసారి గెలిచిన శివరాజ్ సింగ్ చౌహాన్.. 2006లో జరిగిన బైఎలక్షన్‌లో రెండోసారి గెలుపొందారు. అక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు ఇక్కడ తన ఆధిపత్యాన్ని చూపించారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఇక్కడి ఓటర్ల మద్దతు ఆయనకు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కానీ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలు.. ఆయన గెలుపునకు అడ్డంకిగా మారాయి.
-
जनता जानती है,
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
भाजपा ही विकास करती है...
हमने प्रत्येक व्यक्ति और प्रत्येक वर्ग के कल्याण हेतु काम किया है। विकास और जनकल्याण की यह धारा आगे भी निरंतर बहती रहे, इसके लिए भाजपा की सरकार को फिर अपना आशीर्वाद दीजिए।
आज छतरपुर जिले की राजनगर विधानसभा में भाजपा प्रत्याशी श्री… pic.twitter.com/6C3SeAkIdT
">जनता जानती है,
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 27, 2023
भाजपा ही विकास करती है...
हमने प्रत्येक व्यक्ति और प्रत्येक वर्ग के कल्याण हेतु काम किया है। विकास और जनकल्याण की यह धारा आगे भी निरंतर बहती रहे, इसके लिए भाजपा की सरकार को फिर अपना आशीर्वाद दीजिए।
आज छतरपुर जिले की राजनगर विधानसभा में भाजपा प्रत्याशी श्री… pic.twitter.com/6C3SeAkIdTजनता जानती है,
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 27, 2023
भाजपा ही विकास करती है...
हमने प्रत्येक व्यक्ति और प्रत्येक वर्ग के कल्याण हेतु काम किया है। विकास और जनकल्याण की यह धारा आगे भी निरंतर बहती रहे, इसके लिए भाजपा की सरकार को फिर अपना आशीर्वाद दीजिए।
आज छतरपुर जिले की राजनगर विधानसभा में भाजपा प्रत्याशी श्री… pic.twitter.com/6C3SeAkIdT
ఈ ప్రాంతంలో రోడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని బీజేపీ చెబుతుండగా.. జంతువులు నిత్యం రోడ్లపైకి వచ్చి భీభత్సం సృష్టిస్తుండడం వల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని విపక్షాలు అంటున్నాయి. నల్-జల్ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇస్తామని వాగ్దానం చేసినప్పటికీ, చాలా గ్రామాల్లో నీటి కొరత సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యలను ప్రధాన అస్త్రాలుగా చేసుకొని... ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
"రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారి సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంతవరకు రైతులకు ఎలాంటి పరిహారం రాలేదు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం, ఆవులు, నీటి సమస్యలు ఉన్నాయి. గత 18 ఏళ్లలో ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసినట్లు సీఎం చెబుతున్నారు. అలాంటివేమీ సీఎం చేయలేదు"
-- విక్రమ్ మస్తాల్, కాంగ్రెస్ అభ్యర్థి
Shivraj Singh Chouhan Budhni Constituency : శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యాక.. బుధ్ని నియోజకవర్గ బాధ్యతలను ఆయన కుమారుడు కార్తికేయ్ చౌహాన్ చేపట్టారు. బుధ్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎంకే కాదని.. ఈ నగర ప్రజలకు దక్కుతుందని కార్తికేయ్ పేర్కొన్నారు. దాదాపు మొత్తం 2 లక్షల 69వేల 713 మంది ఓటర్లు ఉన్న బుధ్ని అసెంబ్లీ నియోజకవర్గంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపుపై మరోసారి ధీమాగా ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">