ETV Bharat / opinion

మోయలేని భారంగా గ్యాస్‌ బండ!

ఇంధనంపై విధించే పన్నుల్లో ఇండియా ఇప్పటికే ప్రపంచ రికార్డు సాధించేసింది. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలే కాదు, వంట గ్యాస్‌ సిలిండర్‌ రేట్లూ సామాన్య జనం మోయలేని భారంగా మారుతున్నాాయి. కేవలం నెలల వ్యవధిలో ఒక్కో సిలిండరుపై రూ.225 పెంచడం దేశవ్యాప్తంగా గృహిణులందరి గుండెల్నీ మండేలా చేసింది. వంటగ్యాస్‌ ధరల దూకుడు నుంచి సామాన్య నడిమి తరగతి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపేణా కేంద్రం ఇస్తూ వచ్చిన రాయితీ క్రమంగా తగ్గిపోతోంది.

lpg cylinder price increase to all time hike in india
మోయలేని భారంగా గ్యాస్‌ బండ!
author img

By

Published : Mar 3, 2021, 6:27 AM IST

ఇళ్లల్లో వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) వినియోగంలో ఇండియా 2030 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలుస్తుందని ఉడ్‌ మెకంజీ నివేదిక నాలుగు నెలల క్రితం వెల్లడించింది. బహిరంగంగా అంగీకరించడానికి ప్రభుత్వాలు ఇబ్బంది పడే 'ఘనత' ఏమిటంటే- ఇంధనంపై విధించే పన్నుల్లో ఇండియా ఇప్పటికే ప్రపంచ రికార్డు సాధించేసింది. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలే కాదు, వంట గ్యాస్‌ సిలిండర్‌ రేట్లూ జన సామాన్యం గూబలదరగొడుతున్నాయి. పట్టుమని మూడు నెలల వ్యవధిలో ఒక్కో సిలిండరుపై రూ.225 వడ్డన దేశవ్యాప్తంగా గృహిణులందరి గుండెల్నీ మండించేదే. ఏప్రిల్‌ తరవాతే చమురు ధరలు దిగివస్తాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో- ఆలోగా గ్యాస్‌ బండ వెయ్యి రూపాయలకు చేరుతుందన్న అంచనాలు భీతిల్లజేసేవే! 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర సైతం రూ.1800కు చేరువ కావడం దిగ్భ్రాంతపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కోటీ 42 లక్షలు, తెలంగాణ వ్యాప్తంగా కోటీ 20 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా- గ్యాస్‌ బండ ధరాభారం ఇంటింటి బడ్జెట్లను తలకిందులు చేస్తోంది. వంటగ్యాస్‌ ధరల దూకుడు నుంచి సామాన్య నడిమి తరగతి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపేణా కేంద్రం ఇస్తూ వచ్చిన రాయితీ క్రమంగా కోసుకుపోతోంది. 2017లో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలుగా ఉన్నప్పుడు డీబీటీ ద్వారా కేంద్రం అందించిన రాయితీ అత్యధికంగా రూ.535గా నమోదైంది. ఫిబ్రవరి నుంచి రాయితీ రూ.41లోపే ఉంటుండగా, వారం వారం పెరుగుతున్న ధరలతో వంట గ్యాస్‌ మంట జనం జేబుల్ని కాల్చేస్తోంది. గ్యాస్‌ భర్తీ కేంద్రాలకు సుదూరంగా ఉన్న ప్రాంతాల వారికే కొద్దిపాటి రాయితీ వర్తిస్తోంది గానీ తక్కిన చోట్ల మార్కెట్‌ ధరలే అమలవుతున్నాయని చమురు సంస్థలు చెబుతున్నాయి. నిరుపేద వర్గాల పట్ల క్రూర పరిహాసమిది!

ఆర్థిక స్థోమత కలవారు గ్యాస్‌ సబ్సిడీని వదులుకోవాలంటూ 2015లో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తొలి 14 నెలల్లోనే కోటీ 13 లక్షల మంది రాయితీ చట్రం నుంచి బయటకు రాగా- అలా కేంద్ర బడ్జెట్లో మిగులు తేలిన మొత్తం దాదాపు రూ.5,000 కోట్లు! సాధారణ పొయ్యిపై చేసిన వంట గంటకు నాలుగొందల సిగరెట్లు కాల్చినంత విషధూమంతో సమానమని- దానివల్ల కోట్లాది గృహిణుల ఆరోగ్యం పొగచూరిపోతున్నదంటూ మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజనను పట్టాలకెక్కించింది. మూడేళ్ల కాలావధిలో రూ.8,000 కోట్ల వ్యయంతో దారిద్య్రరేఖ దిగువన ఉన్న అయిదు కోట్ల మందికి ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చే బృహత్‌ పథకమది. స్త్రీ సాధికారత, స్వచ్ఛ ఇంధనం, స్వస్థత వంటి లక్ష్యాలతో నాలుగేళ్ల వ్యవధిలోనే ఎనిమిది కోట్ల మంది పేదలకు వంటగ్యాస్‌ను అందుబాటులోకి తెచ్చామని, నేడు దేశవ్యాప్తంగా 29 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని చమురు శాఖ కార్యదర్శి మూణ్నాళ్ల క్రితం ప్రకటించారు. ఆ పథకాన్ని మరింత సరళతరం చేసి వచ్చే రెండేళ్లలో మరో కోటి కనెక్షన్లు అందిస్తామంటున్న ప్రభుత్వం- గ్యాస్‌ బండల భారాన్ని నిరుపేద వర్గాలు ఎలా మోయగలవని ఆలోచించడమే లేదు. డీబీటీ లబ్ధిదారులుగా ఉన్న 20 కోట్ల మంది వినియోగదారుల నడ్డి విరిచేలా పెట్రోలియం రాయితీ మొత్తాన్ని అంతక్రితం ఉన్న రూ.40,915 కోట్ల నుంచి తాజా బడ్జెట్లో రూ.12,995 కోట్లకు కేంద్రం కుదించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రాయితీలో కోత కారణంగా కేంద్రం రూ.20 వేల కోట్లు మిగుల్చుకోగలిగినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. ఒకవైపు రాయితీల్లో అనుచిత కోత, మరోవైపు పన్నులు, సుంకాల్లో అమానుషంగా ఎడాపెడా వాత! కట్టెలు, బొగ్గు, కిరోసిన్‌కు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా వంటగ్యాస్‌ను ఇంటింటికీ ఉజ్జ్వలంగా చేర్చి, వ్యూహాత్మకంగా సబ్సిడీని కోసేస్తే- పేదజనం బతుకులు ఏమైపోవాలి? కట్లు తెంచుకొనే ద్రవ్యోల్బణం నుంచి జీవితాల్ని ఎలా కాచుకోవాలి?

ఇదీ చూడండి: తగ్గుతోన్న రాయితీ... భారీగా పెరుగుతోన్న సిలిండర్ రేట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.