ETV Bharat / opinion

కేంద్రం వెన్నుదన్నుతోనే కరోనాపై విజయం సాధ్యం - భారతదేశంలో లాక్​డౌన్​

ఉద్యోగుల జీతాలకు కోతపెట్టి మరీ కొవిడ్‌పై పోరుకు శక్తియుక్తుల్ని కూడగట్టుకొంటున్న రాష్ట్రాలకు విత్తపరంగా కొంతైనా సాంత్వన దక్కాలంటే కేంద్రం చేయూత అందించక తప్పదు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కొంత మొత్తాల్ని కేంద్రం బదలాయించినా.. అవి ఏ మూలకూ చాలవు. కేంద్రం చేయూత లేనిదే కరోనాపై రాష్ట్రాలు విజయం సాధించలేదన్నది విశ్లేషకుల మాట. ఈ విషయంలో రాష్ట్రాలకు కేంద్రం వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది.

lock down states
రాష్ట్రాలకు వెన్నుదన్నుతోనే కరోనాపై విజయం
author img

By

Published : Apr 29, 2020, 8:58 AM IST

దేశవ్యాప్తంగా ఆరోగ్య ఆత్యయిక స్థితే కాదు, రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని ఆర్థిక అనిశ్చితీ కరోనా మహమ్మారి పుణ్యమే. 5 వారాల లాక్‌డౌన్‌ కాలంలో వర్తక వాణిజ్యాలతోపాటు పారిశ్రామిక ఉత్పత్తీ దాదాపు స్తంభించిపోవడం వల్ల రాష్ట్రాల రాబడి పద్దు దారుణంగా పడిపోవడం తీవ్రాందోళనకరమే. ఏప్రిల్‌ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వానికి వివిధ పద్దుల కింద జమ కావలసింది రూ.5,000 కోట్లు. వాస్తవానికి వచ్చింది అందులో పదోవంతు! ఈ విషయంలో ఏపీ సహా ఏ రాష్ట్రానికీ మినహాయింపు లేదు.

ఉద్యోగుల జీతనాతాలకు కోతపెట్టి మరీ కొవిడ్‌పై పోరుకు శక్తియుక్తుల్ని కూడగట్టుకొంటున్న రాష్ట్రాలకు విత్తపరంగా కొంతైనా సాంత్వన దక్కాలంటే కేంద్రం చేయూత అందించక తప్పదు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి తొలి వాయిదా నిధులు, కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలవాటా, విపత్తు సహాయ నిధులు, పెండింగులో ఉన్న వస్తుసేవల పన్నులో కొంత మొత్తాల్ని కేంద్రం బదలాయించినా- అవి ఏ మూలకూ చాలేవి కావు.

పరిహారం కోరుతున్న రాష్ట్రాలు..

కాబట్టే లాక్‌డౌన్‌ కారణంగా తాము నష్టపోయిన రాబడులకు తక్షణ పరిహారంగా మహారాష్ట్ర రూ.50వేల కోట్లు, ఛత్తీస్‌గఢ్‌ రూ.30వేల కోట్లు, కేరళ రూ.80వేల కోట్లు, రాజస్థాన్‌ రూ.40వేల కోట్లు, పశ్చిమ్‌ బంగ రూ.25వేల కోట్లు కోరుతున్నాయి. ఎక్సైజ్‌, స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, రాష్ట్ర జీఎస్‌టీ, వాహనాల పన్ను, ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు- ఇవే రాష్ట్రాలకు కీలక ఆదాయ వనరులు.

లాక్‌డౌన్‌ కారణంగా అవన్నీ అడుగంటినా, కరోనాపై పోరును ఒకవంక, బడుగు జీవుల బాగోగుల్ని మరోవంక సమర్థంగా కాచుకోవాల్సిన సంక్లిష్ట స్థితిలో- కావవే వరదా... అంటూ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరడంలో ఏ మాత్రం తప్పులేదు. అసాధారణ సమస్యలకు అసాధారణ పరిష్కారాలు అనివార్యమన్న తలంపుతో తక్కిన దేశాలు స్పందిస్తున్న తీరుగానే- సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలకు కేంద్రం చేయూత అందించక తప్పదు!

మోదీ బాగానే ఉందని చెప్పినా..

‘భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది... దాని గురించి చింతించాల్సిన పనిలే’దని ప్రధాని మోదీ ధీమా వ్యక్తీకరిస్తున్నా, లాక్‌డౌన్‌ కారణంగా ద్రవ్యలభ్యత కుంగి రాష్ట్రాలు దిగాలు పడుతున్నాయి. రాష్ట్రాల ఆర్థికావసరాలు తీర్చేందుకు ‘వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌’ పరిమితి పెంచామన్న ఆర్‌బీఐ అవసరమైతే ‘స్టాండింగ్‌ డిపాజిట్‌’ సదుపాయాన్ని తీసుకొస్తామని చెబుతోంది.

ఏప్రిల్‌ నుంచి డిసెంబరు దాకా అన్ని రాష్ట్రాలూ కలిసి మార్కెట్‌ నుంచి రూ.3.20లక్షల కోట్ల సేకరణకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల తొలివారంలో అనుమతించింది. రూ.6,000కోట్ల రాష్ట్రాభివృద్ధి రుణాన్ని పదిహేనేళ్ల కాలావధికి మార్కెట్‌ నుంచి సేకరించాలంటే 8.96శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్న కేరళ- అభివృద్ధి నేలచూపులు చూస్తున్న వేళ, అంతంత వడ్డీలు కట్టేదెలాగని ప్రశ్నిస్తోంది.

ముఖ్యమంత్రుల సూచనలకూ..

ద్రవ్య విధానాన్ని సరళీకరించి, మరింత కరెన్సీ ముద్రించి, నేరుగా రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచే రాష్ట్రాలు రుణాలు గ్రహించేలా చూడాలని కేరళ సూచిస్తోంది. భారతావని స్థూల దేశీయోత్పత్తి రూ.203.85లక్షల కోట్లలో అయిదు శాతం- అంటే రూ.10.15లక్షల కోట్లను ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ ద్వారా అందుబాటులోకి తెచ్చి, దేశం మాంద్యంలోకి జారిపోకుండా కాచుకోవాలన్న కేసీఆర్‌ సూచనకూ మన్నన కొరవడింది.

ఈ పరిస్థితుల్లో ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని రాష్ట్రాలు కోరినట్లు మూడు నుంచి అయిదు శాతానికి పెంచితే- వాటి నెత్తిన పాలు పోసినట్లవుతుంది. ఆర్‌బీఐ ఆర్థిక సాయంపై వడ్డీ విధించరాదని, కేంద్ర సంస్థల నుంచి తీసుకున్న రుణాలను రీషెడ్యూలు చేసి, ఆ తరవాత కూడా వడ్డీ లేకుండా అసలే కట్టించుకోవాలని రాష్ట్రాలు అడుగుతున్నాయి. అవి కోరుతున్నట్లుగా పంటల కనీస మద్దతు ధరలను 50శాతం పెంచడం, పెండింగులో ఉన్న జీఎస్‌టీ పరిహారం చెల్లింపువంటివి- అవసరానికి అక్కరకొచ్చేవే. కొవిడ్‌పై విజయం సాధించగలిగేది, రాష్ట్రాలను శక్తిసంపన్నం చేసినప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.