ETV Bharat / opinion

కర్ణాటకలో బీజేపీ 'గుజరాత్ ఫార్ములా'.. అందుకే వారిపై వేటు! కమలం హిట్టు కొడుతుందా?

సినీ పరిశ్రమలో ఒక ఫార్ములా సూపర్ హిట్ అయితే.. అదే బాటలో అనేక చిత్రాలు వస్తుంటాయి! రాజకీయాలకూ ఇది వర్తిస్తుందని అంటోంది బీజేపీ. గుజరాత్​లో బ్లాక్​బస్టర్ అయిన ప్లాన్​తో కర్ణాటక ఎన్నికలకు సై అంటోంది. మరి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా? బెడిసి కొడుతుందా? అసలు ఆ ప్లాన్ ఏంటి?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 12, 2023, 7:07 PM IST

కర్ణాటకలో అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే కాబట్టి.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తమకు తిరుగులేని విజయం కట్టబెట్టిన గుజరాత్ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. గుజరాత్ మోడల్​తో కర్ణాటక ప్రజలను గెలవాలని భావిస్తోంది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూస్తే బీజేపీ వ్యూహం అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఏంటా గుజరాత్ మోడల్? కర్ణాటక ఎన్నికల్లో అది ఎంత వరకు ప్రభావం చూపుతుంది? అన్న విషయాలను పరిశీలిద్దాం.

అభ్యర్థుల ఎంపికలో భాగంగా 189 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి సహా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. బీజేపీ బలంగా ఉన్న దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోనూ సమూల మార్పులు చేసింది. ఉడుపిలో ఐదుగురు, దక్షిణ కన్నడలో ఇద్దరు సిట్టింగులకు హ్యాండ్ ఇచ్చింది. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. కొందరు సీనియర్ నేతలను సైతం పక్కన బెట్టింది. రెండో జాబితాలో ప్రకటించే అభ్యర్థుల విషయంలోనూ బీజేపీ ఇదే ఫార్ములాను పాటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో 16 చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కొందరిపై వేటు తప్పదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

గుజరాత్ ఎన్నికల సమయంలోనూ అధికార బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునేందుకు అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది. 'మార్పు వ్యూహం' ఆ ఎన్నికల్లో ఫలించింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా సాధించని తిరుగులేని మెజార్టీతో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోనూ ఇదే పంథాను అనుసరిస్తోంది బీజేపీ. టికెట్లు నిరాకరించిన వారిలో చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉందని బీజేపీ భావిస్తోంది. సుదీర్ఘకాలంగా ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. అభివృద్ధి విషయంలో ఆ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయన్న వాదనలను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవారికి అవకాశం ఇస్తే.. యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని బీజేపీ చెబుతోంది.

జంపింగ్ జపాంగ్​లకు జాక్​పాట్
వలస పక్షులకు ప్రాధాన్యం ఇవ్వడం టికెట్ల కేటాయింపులో మరో ఆసక్తికరమైన అంశం. 2019లో ఆపరేషన్ లోటస్ సందర్భంగా పదవులకు రాజీనామా చేసి.. బీజేపీలో చేరినవారిలో దాదాపు అందరికీ టికెట్లు కేటాయించింది బీజేపీ. రమేశ్ జార్ఖిహోళి, మహేశ్ కుమతల్లి, శ్రీమంత్ పాటిల్, ప్రతాప్ గౌడ పాటిల్, ముందగోడు హెబ్బర్, బీసీ పాటిల్, కే సుధాకర్, భైరాతి బసవరాజ, ఎస్టీ సోమశేఖర్, మునిరత్న, గోపాలయ్య, ఎంటీబీ నాగరాజ్, నారాయణ గౌడకు టికెట్లు ఇచ్చింది.

కాంగ్రెస్ నేతలు టార్గెట్
మరోవైపు, తమ గెలుపు కోసం కృషి చేస్తూనే ప్రత్యర్థి విజయావకాశాలపై దెబ్బ కొట్టే సూత్రాన్ని అమలు చేస్తోంది బీజేపీ. దీన్ని అనుసరించే.. కర్ణాటకలో దిగ్గజ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసింది. కాంగ్రెస్​లో కీలకంగా వ్యవహరిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్​పై ఇద్దరు మంత్రులను పోటీకి దింపింది బీజేపీ. ప్రస్తుతం విపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి మంత్రి వీ సోమన్నను బరిలోకి దింపింది బీజేపీ. కాంగ్రెస్ అధ్యక్షుడైన డీకే శివకుమార్ శికారిపుర నుంచి పోటీ చేస్తుండగా.. మరో మంత్రి ఆర్ అశోకను ఆ స్థానానికి ఎంపిక చేసింది. అయితే, సోమన్న, అశోక చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటం గమనార్హం.

karnataka assembly election 2023
ఓ కార్యక్రమంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య

రాష్ట్రంలో కాంగ్రెస్​కు సిద్ధరామయ్య, శివకుమార్​ కీలకంగా ఉన్నారు. వీరిద్దరిపై బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా.. వారిని సొంత నియోజకవర్గానికి పరిమితం చేయొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకుల రాష్ట్రవ్యాప్త పర్యటనలపై ఈ నిర్ణయం కొంతైనా ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. నామినేషన్ వేసేందుకే తమ నియోజకవర్గాలకు వెళ్తామని కాంగ్రెస్ అధిష్ఠానానికి గతంలో వీరిద్దరూ చెప్పినట్లు సమాచారం. పార్టీలోని ఇతర అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకే తమ సమయాన్ని వెచ్చిస్తామని అన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీజేపీ తాజా నిర్ణయం నేపథ్యంలో వీరిరువురు తమ నియోజకవర్గాన్ని తేలికగా తీసుకునే అవకాశం పోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తమపై మంత్రులు పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తనపై ఎవరు పోటీ చేసిన ఫర్వాలేదని మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. శికారిపుర నుంచి పోటీ చేస్తున్న మంత్రి అశోకకు శివకుమార్ 'గుడ్​లక్' చెప్పారు. 1985లో దేవెగౌడపైనే పోటీ చేశానని, ఆ తర్వాత కుమారస్వామికి వ్యతిరేకంగానూ పోరాడానని గుర్తు చేశారు. బీజేపీ నేతలు సైతం తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. గతంలో ఇందిరా గాంధీ, దేవెగౌడ లాంటి దిగ్గజ నేతలే ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు తమను తప్పక గెలిపిస్తారని అంటున్నారు.

గుజరాతీ 'అమూల్'తో ఎన్నికల్లో లాభం ఎవరికి?
మరోవైపు, అమూల్ పాల వ్యవహారం కర్ణాటకలో దుమారం రేపుతోంది. కర్ణాటకకు చెందిన నందిని మిల్క్ బ్రాండ్​ను అణచివేసేందుకే.. అమూల్​ను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. అమూల్ గుజరాత్​కు చెందిన బ్రాండ్ కావడం.. విపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారింది. మరి ఈ పాల రాజకీయం వల్ల లాభం ఎవరికి? ఈ వివాదం ఎలా, ఎందుకు మొదలైంది వంటి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.