ETV Bharat / opinion

సామాజిక మాధ్యమాలు- పుక్కిటి పురాణాల కార్ఖానాలు - సామాజిక మాధ్యామాల్లో లోపించిన బవాబుదారీతనం

గణనీయమైన సంఖ్యలోని వెబ్‌పోర్టళ్లు, యూట్యూబ్‌ ఛానళ్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడం కలవరపరుస్తోంది. వీటి నియంత్రణకు పటుతర నిబంధనలు లేకపోవడం, ఆయా సంస్థల్లోనూ జవాబుదారీతనం లోపించడం ఇందుకు ప్రధాన కారణాలు. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తంచేసింది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రతి అంశాన్నీ మతం కోణంలోనే చూస్తున్నారని, దీంతో దేశానికి చెడ్డపేరు వస్తున్నదని ఆవేదన చెందింది.

social media
సామాజిక మాధ్యమాలు
author img

By

Published : Sep 4, 2021, 4:38 AM IST

Updated : Sep 4, 2021, 6:06 AM IST

అసత్య వార్తలకు, విద్వేషపూరిత కథనాలకు సామాజిక మాధ్యమాలు వేదికలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గణనీయమైన సంఖ్యలోని వెబ్‌పోర్టళ్లు, యూట్యూబ్‌ ఛానళ్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడం కలవరపరుస్తోంది. వీటి నియంత్రణకు పటుతర నిబంధనలు లేకపోవడం, ఆయా సంస్థల్లోనూ జవాబుదారీతనం లోపించడం ఇందుకు ప్రధాన కారణాలు. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తంచేసింది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రతి అంశాన్నీ మతం కోణంలోనే చూస్తున్నారని, దీంతో దేశానికి చెడ్డపేరు వస్తున్నదని ఆవేదన చెందింది. దేశంలో తొలి దశ కరోనా వ్యాప్తికి దిల్లీలో జరిగిన ఓ మత పరమైన సమావేశాలే కారణమని సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. వాటికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

జవాబుదారీతనం ఏదీ?

సామాజిక మాధ్యమాలు, వెబ్‌ పోర్టళ్లపై సరైన నియంత్రణలేవీ లేవు. యూట్యూబ్‌ ఛానళ్ల పరంగానైతే- వాటిని ఎవరైనా ప్రారంభించవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అసత్యాలు, విద్వేషపూరిత విధ్వంసకర సమాచార వ్యాప్తికి అవి కారణమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం నిరుడు 'సుదర్శన్‌ టీవీ' కేసులో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. సామాజిక మాధ్యమాలను నియంత్రించడం అత్యవసరమని పేర్కొంది. సామాజిక మాధ్యమ సంస్థలు ఎటువంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, ఆఖరికి న్యాయమూర్తులకు వ్యతిరేకంగానూ కథనాలను ప్రచారంలోకి తెస్తున్నాయని సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా అసంతృప్తి ప్రకటించారు. సామాన్యులకు గొంతుగా ఫేస్‌బుక్‌ కీలకపాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు గతంలో అభిప్రాయపడింది. అదే సమయంలో విధ్వంసాలకు అవకాశమిచ్చే సందేశాలు, భావజాలాలకు, వాటిని వ్యాప్తి చేసేవారికి ఈ మాధ్యమం వేదికగా మారుతోందనీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో దాదాపు 30 కోట్లకు పైగా వినియోగదారులున్న ఫేస్‌బుక్‌- పౌరుల అభిప్రాయాల్ని చాలా బలంగా ప్రభావితం చేసే మాధ్యమంగా మారిందని, అందువల్ల ఆ సంస్థ జవాబుదారీతనానికి కట్టుబడాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా నిర్దేశించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల వేళా సామాజిక మాధ్యమ వేదికలు గణనీయ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ మాధ్యమాలే వేదికగా మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న వారి సంఖ్య సైతం చాలా ఎక్కువగా ఉంది. భావప్రకటనా స్వేచ్ఛ పేరిట చాలామంది సామాజిక మాధ్యమాల్లో కట్టు దాటుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే, సెక్షన్‌ 66ఏ కింద ఇటువంటి వారిని నియంత్రించే నెపంతో పౌరహక్కులకు సంకెళ్లు బిగించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. అధికార పార్టీలు ఈ సెక్షన్‌ను రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న ఉదంతాలు వెలుగు చూడటంతో సుప్రీంకోర్టు 2015లోనే దాన్ని కొట్టివేసింది. అయితే ఇప్పటికీ ఆ సెక్షన్‌ 66ఏ కింద కేసులు నమోదవుతుండటంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భావప్రకటనా స్వేచ్ఛను కాపాడటం ఎంత అవసరమో... సామాజిక మాధ్యమాలు, వెబ్‌పోర్టళ్లలో సాగుతున్న అసత్య, విద్వేష ప్రచారాలను కట్టడి చేయడం అంతే కీలకం.

బలమైన చట్టాలతోనే నియంత్రణ!

సామాజిక మాధ్యమాల్లో వచ్చే కథనాలు, సమాచారాన్ని పరిశీలించి, అవసరమైతే చర్యలు తీసుకోవడానికి విదేశాల్లో బలమైన చట్టాలున్నాయి. జర్మనీ ఇందుకోసం 2018లో నెట్జ్‌డీజీ చట్టాన్ని తీసుకొచ్చింది. యూట్యూబ్‌ వంటి స్ట్రీమింగ్‌ సర్వీసుల్లో సమాచారానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా 24 గంటల్లోపు ఆ సంస్థలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే వ్యక్తులకు రూ.40 కోట్ల వరకు, సంస్థలకైతే రూ.360 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశముంది. ఈయూలో సాధారణ సమాచార భద్రతా చట్టం అమలులో ఉంది. ఆస్ట్రేలియా సైతం రెండేళ్ల క్రితం ఇటువంటి ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. మనదేశంలో దాదాపు 60 కోట్ల మంది ఏదో ఒక సామాజిక మాధ్యమంలో సభ్యులుగా ఉన్నారు. అయినా, ఆయా వేదికలను నియంత్రించే చట్టాలేవీ బలంగా లేవు. ఈ క్రమంలో సమాచార సాంకేతిక చట్టం 2021ను కేంద్రం తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర సమాచారం ఉందని ఫిర్యాదు అందిన 36 గంటల్లోగా దాన్ని తొలగించాలి. అలా తొలగించిన వాటిని ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణ కోసం ఆర్నెల్లపాటు భద్రపరచి ఉంచాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ఓ వ్యవస్థను, దాన్ని సమన్వయం చేయడానికి దేశంలోనే ఓ అధికారిని నియమించాలి. ఈ కొత్త నిబంధనలపై విమర్శలు రేగుతున్నాయి. హైకోర్టుల్లో వ్యాజ్యాలూ దాఖలయ్యాయి. ఆ కేసులన్నింటినీ సుప్రీంకోర్టులో విచారించాలన్న కేంద్ర విజ్ఞప్తిపైనా ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. సామాజిక మాధ్యమాలు, వెబ్‌పోర్టళ్లలో అభ్యంతరకరమైన పోస్టులు, వార్తల వ్యాప్తిని నియంత్రించేలా చట్టాన్ని పట్టాలెక్కించడం ప్రస్తుతావసరం. ఆ ముసుగులో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు సాగితే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం!

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

ఇదీ చూడండి: మరణించిన ఉద్యోగిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు

Last Updated : Sep 4, 2021, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.