ETV Bharat / opinion

జీవజాలానికి రక్షాకవచం.. ఓజోన్!

పరిమితికి మించి వాయు కాలుష్యం పెరగడం వల్ల భూమిని సంరక్షించే సహజ గొడుగు ఓజోన్ పొర దెబ్బతింటుంది. అనేక ఆరోగ్య సమస్యలతో పాటు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది. అనేకరకాలుగా మానవాళిని కాపాడుతున్న ఓజోన్ పొర క్రమంగా క్షీణించిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. దీనిని రక్షించేందుకు కృషి చేస్తున్న అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ సంస్థ.. సెప్టెంబరు 16ను ఓజోన్ దినోత్సవంగా జరుపుతోంది.

author img

By

Published : Sep 16, 2021, 5:54 AM IST

ఓజోన్
ఓజోన్

సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా భూమ్మీది సకల జీవరాశిని ఓజోన్‌ పొర సంరక్షిస్తుంది. ఇది భూతలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటో ఆవరణంలో భాగంగా ఉంటుంది. మానవ చర్యల మూలంగా ఓజోన్‌ పొర ప్రభావితమవుతోందన్న విషయంపై 1970ల నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్‌ పొర సన్నగిల్లినట్లు (ఇదే ‘రంధ్రం’గా వ్యాప్తిలోకి వచ్చింది) ఆ తరవాతి కాలంలో కనుగొన్నారు. వృక్ష, జీవజాతుల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఓజోన్‌ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం క్లోరోఫ్లూరో కార్బన్లు(సీఎఫ్‌సీ), బ్రోమోప్లూరో కార్బన్లు(బీఎఫ్‌సీ). వీటిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబరు 15న మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను ఆమోదించాయి. సెప్టెంబరు 16ను అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవంగా ఐరాస సర్వసభ్య సమావేశం 1994లో ప్రకటించింది. దీన్నే ప్రపంచ ఓజోన్‌ దినోత్సవంగానూ పేర్కొంటారు.

ప్రమాదకర కిరణాలు..

జీవజాలంతో పాటు మొక్కలకూ అతినీలలోహిత కిరణాలు తీవ్ర హాని కలిగిస్తాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ) సంస్థ మూడున్నర దశాబ్దాల క్రితమే దీనిపై ఓ నివేదిక ప్రచురించింది. ఓజోన్‌ పొర బాగా దెబ్బతింటే రాబోయే 88 సంవత్సరాల్లో ఒక్క అమెరికాలోనే నాలుగు కోట్ల క్యాన్సర్‌ కేసులు అధికంగా నమోదై, ఎనిమిది లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది. అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీదకు ప్రసరిస్తే మనుషులు పలు రకాల క్యాన్సర్ల బారిన పడతారు. వృద్ధాప్యం, కంటి సమస్యలు పెరుగుతాయి. రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతింటుంది. పలు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ధ్రువప్రాంతాల్లో ఓజోన్‌ పొర పలుచబడినట్లు వివిధ నివేదికలు వెల్లడించాయి. దీనివల్ల మంచు కరిగి సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతుంది. ఫలితంగా తీర ప్రాంతాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది. విపరీతమైన ఇంధన వినియోగం, ఏసీలు, ఫ్రిజ్‌లలో వాడే ప్రమాదకర రసాయనాలు ఓజోన్‌ పొరకు నష్టంచేస్తాయి. సీఎఫ్‌సీలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న హైడ్రోఫ్లూరో కార్బన్ల(హెచ్‌ఎఫ్‌సీ)తోనూ ఆ పొరకు ప్రమాదమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటికీ తోడు కార్చిచ్చులు సైతం ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి. అమెజాన్‌ అడవుల కార్చిచ్చు, ఈ మేరకు ఆ పొరపై ప్రభావం చూపినట్లు పర్యావరణ సంస్థలు గతంలోనే ఆందోళన వ్యక్తంచేశాయి. ఆస్ట్రేలియాలో అడవుల దహనమూ ఓజోన్‌ పొరకు నష్టం కలిగించినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి.

నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఓజోన్‌ పొర స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి ఓ నివేదికను విడుదల చేస్తుంది. గతంతో పోలిస్తే ఓజోన్‌ పొర క్రమేణా కోలుకుంటున్నట్లు 2018లో విడుదలైన నివేదిక వెల్లడించింది. ఓజోన్‌ పొర క్షీణతకు దారితీసే పదార్థాల సాంద్రత వాతావరణంలో తగ్గుతున్నట్లు తేలింది. కెనడా, స్వీడన్‌, డెన్మార్క్‌, నార్వే వంటి వాటితో పాటు మరికొన్ని దేశాలు క్లోరోఫ్లూరో కార్బన్ల(సీఎఫ్‌సీ)ను కట్టడి చేసేందుకు మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నాయి. అమెరికాలో ఈపీఏ ఆధ్వర్యంలో సీఎఫ్‌సీ ఉత్పత్తిదారులతో అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారు. ఓజోన్‌ పొర రక్షణ కోసం 1985లో 28 దేశాలు వియన్నా కన్వెన్షన్‌లో సంతకం చేశాయి. ఓజోన్‌ పొరకు హానికారకమవుతున్న రసాయనాలపై చర్చించేందుకు సంసిద్ధమయ్యాయి. అదే ఆ తరవాత మాంట్రియల్‌ ప్రొటోకాల్‌కు దారిదీపమైంది. అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా ఈ ప్రొటోకాల్‌ను అభివర్ణిస్తారు.

చైనా మొండితనం..

మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై సంతకాలు చేసినప్పటికీ ఫ్రాన్స్‌, యూకే ప్రభుత్వాలు మాత్రం తమ సీఎఫ్‌సీ పరిశ్రమలను కాపాడుకోవడానికి మొదట్లో ప్రయత్నించాయి. దానిపై పలు విమర్శలూ వ్యక్తమయ్యాయి. ఓజోన్‌ పొర దెబ్బతినడానికి మానవ తప్పిదాలే కారణమని బలమైన ఆధారాలు వెలుగు చూడటంతో 1990లో లండన్‌లో జరిగిన సమావేశంలో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను బలోపేతం చేశారు. దేశాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సీఎఫ్‌సీల ఉత్పత్తిని నిరోధించడానికి లక్ష్యాలను నిర్దేశించారు. చైనా మాత్రం వాటికి తలొగ్గకుండా ప్రమాదకర విధానాలను అనుసరిస్తూనే ఉంది. ప్రపంచ సీఎఫ్‌సీ-11 ఉద్గారాల్లో 40-60 శాతం చైనా నుంచే వెలువడుతున్నాయని రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తంచేసినా చైనా తన విధానాలను అలాగే కొనసాగిస్తోంది. మరోవైపు మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను బలోపేతం చేశాక సీఎఫ్‌సీ ఉద్గారాలు చాలామేరకు తగ్గుముఖం పట్టాయి. బ్రోమిన్‌ కలిగిన రసాయనాల వినియోగం క్షీణించడంతో ఓజోన్‌ పొరపై దుష్ప్రభావం చూపే హానికారక పదార్థాల తీవ్రత తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇటీవలి కాలంలో నైట్రస్‌ ఆక్సైడ్‌ ఓజోన్‌ పొరను ఎక్కువగా దెబ్బతీస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ పరిధిలోకి రాకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ రక్షాకవచాన్ని సంరక్షించుకోవడానికి ప్రపంచ దేశాల సమష్టి కృషి కొనసాగాలి. ఓజోన్‌ పొరపై దుష్ప్రభావం చూపే రసాయన సమ్మేళనాలన్నింటినీ కచ్చితంగా నియంత్రించాలి.

- నాదెళ్ల తిరుపతయ్య

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.