ETV Bharat / opinion

'అజేయ' భారతం.. 'సూపర్​ 50'తో సాధ్యం!

తరువాతి తరం సైనిక పరికరాల పరిశోధన, అభివృద్ధికి భారత్​ విశేష కృషి చేస్తోంది. ఆధునిక యుద్ధ సాంకేతికతను అందిపుచ్చుకొని దేశాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు డీఆర్​డీఓ ఓ మాస్టర్​ ప్లాన్​ వేసింది. దేశం కోసం సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతోన్న యువ శాస్త్రవేత్తలను రంగంలోకి దింపింది.

military
'అజేయ' భారతం- 'సూపర్​ 50'తో సాధ్యం
author img

By

Published : Jan 10, 2021, 4:18 PM IST

కత్తి, బల్లెం, బాకు, బాణం.. ఇవి ఒకప్పటి ఆయుధాలు.

తుపాకులు, ఫిరంగలు, యుద్ధ విమానాలు, డ్రోన్లు.. ఇవి నేటి ఆయుధాలు.

మరి భవిష్యత్తు యుద్ధాల్లో ఆయుధాలు ఏంటి? అసలు యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి? భారత్​ ఇందుకు సిద్ధంగా ఉందా?

నేటి యుద్ధంలో సైనిక సంఖ్యాబలం కన్నా సాంకేతిక నాణ్యతే మిన్న అని అనేక దేశాలు చాటుతున్నాయి. కానీ భారత్​ పరిస్థితి ఇందుకు భిన్నం. ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి ఆయుధోత్పత్తి సంస్థల్లో భారతీయ ఆయుధ కంపెనీ ఒక్కటీ లేదు. దీన్నిబట్టి సైనిక ఆధునికీకరణలో మనం ఎంతగా వెనుకబడ్డామో అర్థం అవుతుంది. భారత్‌ ఇప్పటికీ యుద్ధ విమానాలు, శతఘ్నులు, హెలికాప్టర్లు, డ్రోన్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. 2015-19 మధ్య ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో రెండో స్థానం భారత్‌దే. మరి భారత్​ స్వదేశీ సాంకేతికత కోసం ఏం చేస్తోంది?

సమీప భవిష్యత్తులోనే ఊహకందని స్వదేశీ సత్తాతో ప్రపంచ దేశాల దిమ్మ తిరిగేలా భారత్​ అధునాతన, సాంకేతిక పరికరాలను సిద్ధం చేసేందుకు 'సూపర్​ 50' ప్లాన్​ను తయారు చేసింది. అధునాతన ఆయుధాల్లో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, చైనా వంటి అగ్రదేశాల సరసన చేరేందుకు ఊవిళ్లూరుతోంది.

సూపర్​ 50 ఏంటి?

ప్రపంచంలోనే శక్తిమంతమైన యుద్ధ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు, అధునాతన ఆయుధాలను రూపకల్పన చేసేందుకు 50 మంది యువ శాస్త్రవేత్తలను నియమించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). వీరందరూ 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.

50 మంది.. 5 ల్యాబ్​లు..

50 మంది యువ శాస్త్రవేత్తలను దేశంలో ఉన్న ఐదు ప్రముఖ డీఆర్​డీఓ ప్రయోగశాలల్లో నియమించారు. ఒక్కొక్కరు ఒక్కో నిర్దిష్ట సాంకేతికత కలిగిన సైనిక పరికరాలపై పరిశోధనలు చేస్తున్నారు.

"ఈ యువ శాస్త్రవేత్తలందరికీ అన్ని అనుమతులు, అధికారాలు ఇచ్చాం. ఒక ల్యాబ్​ డైరక్టర్​కు ఉన్న అధికారాలు వీరికి ఉన్నాయి. సాధారణంగా శాస్త్రవేత్తగా 25 ఏళ్ల అనుభవం ఉంటేనే ఇన్ని అధికారాలు ఇస్తాం. డీఆర్​డీఓతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఏం లేవు. వీరు స్వేచ్ఛగా వారి పని చేసుకోవచ్చు."

- ఈటీవీ భారత్​తో డీఆర్​డీఓ ప్రతినిధి

అధునాతన ల్యాబ్​లు..

డీఆర్​డీఓ ఆధ్వర్యంలో ఏడాది క్రితం బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్​కతా, హైదరాబాద్​లో అధునాతన రక్షణ ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. కృత్రిమ మేథ (ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ, కాగ్నిటివ్ టెక్నాలజీ, అసిమ్మెట్రిక్ టెక్నాలజీ ఈ ల్యాబ్​లలో అందుబాటులో ఉన్నాయి. రక్షణ పరిశోధన రంగంలో ఉన్నత అనుభవం కలిగిన విద్యావేత్తలు ఈ యువ శాస్త్రవేత్తలకు దన్నుగా ఉన్నారు.

"ఈ ప్రయోగశాలల్లో పనిచేసే శాస్త్రవేత్తలు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఇంటర్నెట్ ఆఫ్ బ్యాటిల్ థింగ్స్ (ఐఒబీటీ), సాఫ్ట్ రోబోటిక్స్, విహంగ వాహనాలు, ఆధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేస్తున్నారు. ప్రతిరోజు వీరికి కావాల్సిన సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారు."

- డీఆర్​డీఓ ప్రతినిధి

ఈ శాస్త్రవేత్తలంతా వారికి 35 ఏళ్లు దాటే వరకు ఇక్కడ పనిచేయనున్నారు. ఐదేళ్ల పాటు అధునాతన సాంకేతికతలపై పనిచేసేందుకు గాను వీరిని తొలుత నియమించారు. తరువాత వీరిని కొనసాగించే విషయం సమీక్ష కమిటీ సూచనల ప్రకారం జరుగుతుందని డీఆర్​డీఓ ప్రతినిధి తెలిపారు.

డీఆర్​డీఓ శాస్త్రవేత్తలుగా ఉంటూనే అవకాశం, అనుభవం, సాంకేతికత, స్వయం ప్రతిపత్తిని వినియోగించుకుని దేశానికి సేవ చేసేందుకు వీరు తయారయ్యారని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. విదేశీ నైపుణ్యాలను స్వాగతించేందుకు కూడా డీఆర్​డీఓ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

"డీఆర్​డీఓలో స్వదేశీ శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. అయితే 25 శాతం నియామకాలను విదేశీ శాస్త్రవేత్తలతో భర్తీ చేస్తాం. నైపుణ్యం ఎక్కడ ఉన్నా డీఆర్​డీఓ ప్రోత్సహిస్తుంది."

- డీఆర్​డీఓ ప్రతినిధి

(రచయిత- సంజీవ్​ కుమార్ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.