ETV Bharat / opinion

పట్టపగ్గాల్లేని 'సైబర్'‌ నేరాలను అరికట్టేదెలా? - సైబర్ క్రైమ్​ వార్తలు

కంప్యూటర్లు, అంతర్జాలం, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లే లక్ష్యంగా సైబర్​ దాడులు పెరుగుతున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే నిరుడు సైబరాసురుల ఉరవడి 64 శాతం మేర విస్తరించిందన్నది ఎన్‌సీఆర్‌బీ నివేదిక సారాంశం. వాస్తవానికి, దేశంలో సైబర్‌ నేరాల ఉద్ధృతి ఏడాది కాలంలో అయిదింతలైందన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఇటీవలి విశ్లేషణ- చోరగణం ఎంతగా రెచ్చిపోతున్నదో కళ్లకు కడుతుంది.

increase in cyber crime cases in india
పట్టపగ్గాల్లేని సైబర్‌ నేరాలను అరికట్టేదెలా?
author img

By

Published : Oct 3, 2020, 7:06 AM IST

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా ప్రసిద్ధి చెందుతున్న ఇండియా.. సరైన సన్నద్ధత కొరవడి సైబర్‌ నేరగాళ్ల అభయారణ్యంగా దిగజారుతోందా? ఆ భయాందోళనలు అకారణం కాదనేందుకు, జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా గణాంకాల క్రోడీకరణే దాఖలా.

కొత్తగా వెలుగు చూసిన లెక్కల ప్రకారం- 2017లో 21,796గా, 2018లో 27,248గా నమోదైన దేశీయ సైబర్‌ నేరాల సంఖ్య 2019 సంవత్సరంలో 44,546కు ఎగబాకింది. కంప్యూటర్లు, అంతర్జాలం, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లే కార్యస్థలిగా- అంతకుముందు ఏడాదితో పోలిస్తే నిరుడు సైబరాసురుల ఉరవడి 64శాతం మేర విస్తరించిందన్నది ఎన్‌సీఆర్‌బీ నివేదిక సారాంశం.

డోభాల్​ హెచ్చరిక...!

వాస్తవానికి, దేశంలో సైబర్‌ నేరాల ఉద్ధృతి ఏడాది కాలంలో అయిదింతలైందన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఇటీవలి విశ్లేషణ- చోరగణం ఎంతగా రెచ్చిపోతున్నదో కళ్లకు కడుతుంది. నమోదైన నికర కేసుల ప్రాతిపదికన కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర ముందుండగా- నాలుగులో తెలంగాణ, ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ తెలుగు గడ్డపైనా వంచక ముఠాల విజృంభణను చాటుతున్నాయి. కొన్నేళ్లుగా ఇ-మెయిళ్ల మాయవలల రూపేణా రకరకాల ఫిషింగ్‌ స్కాములు వెలుగుచూడటం పరిపాటిగా మారింది. కొవిడ్‌ మహమ్మారి కోరసాచిన దరిమిలా సైబర్‌ దాడులు పెద్దయెత్తున పెచ్చరిల్లినట్లు క్షేత్రస్థాయి కథనాలు వెల్లడిస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగం రెక్కలు తొడుక్కుంటున్న స్థాయిలో సైబర్‌ నేరగాళ్ల పాలబడకుండా ఎలా జాగ్రత్తపడాలన్న జనచేతన లేకపోవడం- మాయగాళ్లకు అయాచిత వరమవుతోంది. అంతర్జాలంలో ఉంచిన ప్రతి సమాచారాన్ని, చరవాణుల ద్వారా చేరువైన ప్రతి సందేశాన్ని గుడ్డిగా నమ్మేసేవారి అమాయకత్వమే అలుసుగా సైబరాసుర సంతతి ఆడింది ఆటగా చలాయించుకుంటోంది!

అధికారికంగా రికార్డులకు ఎక్కిన కేసులే సైబర్‌ నేరాల తీవ్రతకు అద్దం పట్టవని, వెలుగులోకి రాకుండా మలిగిపోయేవి మరెన్నో ఉంటాయన్న వాదనకు ప్రబల సాక్ష్యాధారం- ఏపీ సీఐడీ, సైబర్‌ పీస్‌ ఫౌండేషన్‌ల సంయుక్త అధ్యయనం. ఆ సర్వేలో పాల్గొన్నవారిలో 61శాతం సైబర్‌ నేరాలపై ఎక్కడ ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో తమకు తెలియదనడం- మోసపోతున్నవారి దయనీయ దురవస్థకు నిలువెత్తు దర్పణం.

దేశమంతటా సైబర్‌ దాడులు, మోసాలు, వేధింపులపై విస్తృత అవగాహన సదస్సుల నిర్వహణ ఎండమావిని తలపిస్తుండగా- నేరగాళ్లు పోనుపోను కొత్త పోకడలతో రెచ్చిపోతున్నారు. ఉచిత యాప్‌ల గేలాలు విసిరి కొంతమంది, సామాజిక మాధ్యమాల్లో అధికారుల పేరిట దొంగ ఖాతాలు సృష్టించి వారి పరిచయస్తుల్ని బురిడీ కొట్టించి ఇంకొందరు, తప్పుడు సందేశాలతో కంప్యూటర్లలో మాల్‌వేర్‌ ప్రవేశపెట్టి కీలక సమాచారం తస్కరించి మరికొందరు... బాధితులూ వంచితుల సంఖ్యను ఇంతలంతలు చేస్తున్నారు.

అంతర్జాతీయంగా సైబర్‌ నేరాల ప్రాతిపదికన అమెరికా, యూకే, కెనడాల తరవాత అత్యంత బాధిత దేశం ఇండియాయేనని ఆ మధ్య అగ్రరాజ్య నిఘా విభాగం ఎఫ్‌బీఐలో అంతర్భాగమైన ఐసీ3 (అంతర్జాల నేర ఫిర్యాదు కేంద్రం) నిగ్గుతేల్చింది.

ఇటీవల పాకిస్థానీ హ్యాకర్లు నకిలీ ఇ-మెయిళ్ల కుహకానికి మళ్ళీ తెరతీయగా, సైబర్‌ యుద్ధానికి చైనా సన్నాహాలపైనా కొన్నాళ్లుగా కథనాలు వెలువడుతున్నాయి. పెనుముప్పు ముమ్మరిస్తున్న దశలో సైబర్‌ సామర్థ్యాల రీత్యా 30 దేశాల జాబితాలో భారత్‌ 21వ స్థానానికి పరిమితం కావడం అత్యంత ఆందోళనకరం.

దేశీయంగా వాణిజ్య, సైనిక సమాచారం చేజారకుండా కాచుకునే నిమిత్తం పది లక్షలమంది నిపుణులతో కూడిన సైబర్‌ సైనికదళం తక్షణావసరమని 'నాస్కామ్‌' (సాఫ్ట్‌వేర్‌ సేవాసంస్థల జాతీయ సంఘం) గతంలోనే సూచించింది. త్వరలో ఖరారు కానుందంటున్న జాతీయ సైబర్‌ భద్రతా వ్యూహం తదనుగుణంగా పరిపుష్టమై కార్యాచరణ సత్వరం పట్టాలకు ఎక్కాలి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.