ETV Bharat / opinion

కొండెక్కుతున్న విద్యాదీపాలు- గంటకో విద్యార్థి బలవన్మరణం - జాతీయ నేర గణాంకాల విభాగంలో ఆత్మహత్యల లోకం

ఉజ్జ్వల భవితకు బాటలు వేసుకుంటూ భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన విద్యా దివ్వెలు అర్ధాంతరంగా ఆరిపోతున్నాయి. కన్నవారి ఆశలను చిదిమేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

student forcible death
విద్యార్థి బలవన్మరణం
author img

By

Published : Sep 7, 2021, 5:22 AM IST

పిల్లలు... తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ కుటుంబంలో కాంతులు విరజిమ్మే ప్రమిదలవంటివారు. ఉజ్జ్వల భవితకు బాటలు వేసుకుంటూ భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన ఈ దివ్వెలు అర్ధాంతరంగా ఆరిపోతున్నాయి. కన్నవారి ఆశలను చిదిమేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి, జీవితంలో నిలదొక్కుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాల్సిన భావిపౌరులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం బాధాకరం. మానసిక ఒత్తిళ్లు, ఒంటరితనం, పేదరికం, అభద్రతాభావం, ఆత్మన్యూనత, విపరీత ప్రవర్తనలు, వేధింపులు, దుర్వ్యసనాలు... విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తోటివారితో సమానంగా చదవలేకపోతున్నామనో, మంచి మార్కులు ర్యాంకులు సాధించలేకపోతున్నామనో, తల్లిదండ్రులు మందలించారనో కుంగిపోతూ... క్షణికావేశానికి లోనై విలువైన జీవితాలను తృణప్రాయంగా అంతమొందించుకుంటున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు.

కలవరపరుస్తున్న ఆత్మహత్యలు

భారత్‌లో 1995-2019 మధ్యకాలంలో 1,72,060 మంది బాలలు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడ్డారన్న జాతీయ నేర గణాంకాల విభాగం (ఎన్‌సీఆర్‌బీ) లెక్కలు కలవరపరుస్తున్నాయి. దేశంలో ప్రతి గంటకు సగటున ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడుతున్నాడని జాతీయ నేర గణాంకాల విభాగం (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా పార్లమెంటుకు నివేదించింది. 14-18 ఏళ్ల మధ్య వయసున్నవారు 2017లో 8,029 మంది, 2018లో 8,162 మంది, 2019లో 8,377 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షల్లో రాణించలేకపోయామన్న ఒకేఒక్క కారణంతో ఈ మూడేళ్లలో 4,040 మంది తనువు చాలించారని పేర్కొంది. ప్రేమ విఫలమై 3,315 మంది, అనారోగ్యంతో 2,567 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపింది. 2007లో దేశంలో ప్రతి రోజూ సగటున 17 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే, 2016 నాటికి ఆ సంఖ్య 26కు చేరినట్లు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. పిల్లల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధమైన విధానాలు అవలంబించకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే ప్రమాదముందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఉభయ తెలుగురాష్ట్రాల్లో పరిస్థితిని పరిశీలిస్తే... 2019లో ఆంధ్రప్రదేశ్‌లో 319 మంది విద్యార్థులు, తెలంగాణలో 426 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఇటీవల జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) వెల్లడించింది. విద్యార్థుల బలవన్మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ- పిల్లల ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటో తెలపాలంటూ ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామన్న ఆందోళనతో రెండేళ్ల క్రితం తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు వెలువడిన వారంరోజుల్లోనే 19 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం కలకలం సృష్టించింది. ఏపీలో 2014-16 మధ్య ఏటా వరసగా 333, 360, 295 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే, అవే సంవత్సరాల్లో తెలంగాణలో వరసగా 363, 491, 349 మంది విద్యార్థుల చొప్పున ఆత్మహత్య చేసుకున్నారు.

తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ కొనివ్వడంలేదనో, చూడనివ్వడం లేదనో, ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడనివ్వడంలేదనో ఆత్మహత్య చేసుకుంటున్న ధోరణి పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఇటీవల పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో విహరించడంపై పెద్దలు ఆంక్షలు విధించడంపట్ల చిన్నారులు తీవ్ర ఉద్వేగాలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు ఏదైనా సమస్యతో తల్లడిల్లుతున్న సమయంలో వారికి నైతికంగా మద్దతుగా నిలిచి సహకరించేవారు లేకపోవడంవల్లే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు అంకురారోపణ జరుగుతోందని దిల్లీలోని 'సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌' పేర్కొంది.

ఆధునికతను వెన్నంటే విషాదం

సమస్యలు, ఒత్తిళ్లు, ఒంటరితనం, ఆత్మన్యూనతాభావాలను దూరం చేసి, పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపితేనే వారిని బలవన్మరణాల నుంచి కాపాడవచ్చని ఎన్నో అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పరీక్షలు, మార్కులు, ర్యాంకుల కంటే జీవితం ఎంతో విలువైనదనే విషయాన్ని విద్యార్థులకు వివరించాలి. తల్లిదండ్రులు, అధ్యాపకులు వారి పట్ల శ్రద్ధ చూపాలి. విద్యాసంస్థలు వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహించాలి. పిల్లల మానసిక ప్రవర్తన ఎలా ఉందో తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండాలి. ఒంటరితనాన్ని దూరం చేయడానికి వారికోసం నిత్యం సమయం కేటాయించాలి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సామాజిక మాధ్యమాల యాప్‌లను అవసరం మేరకే వినియోగించేలా చూడాలి. ఈ ఆధునిక యుగంలో విద్యాసంస్థల్లో మనోవిజ్ఞానశాస్త్ర నిపుణుల పర్యవేక్షణ ఎంతో అవసరం. తెలంగాణ ఇంటర్‌బోర్డు ఇప్పటికే హెల్ప్‌లైన్‌ నబర్లను ఏర్పాటుచేసి, మానసిక వైద్య నిపుణులనూ నియమించింది. విద్యార్థులు సామాజిక మాధ్యమాల ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకు, సైబర్‌ నేరాల నుంచి తప్పించుకొనేందుకు తెలంగాణ పోలీసు శాఖ పరిధిలోని మహిళా భద్రత విభాగం 'సైబర్‌ కాంగ్రెస్‌' కార్యక్రమాన్ని చేపట్టింది. సైబర్‌ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి కొందరు విద్యార్థులను 'సైబర్‌ అంబాసిడర్లు'గా ఎంపికచేసి వారికి ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. ఆత్మహత్యల కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రణాళిక మూణ్నాళ్ల ముచ్చట కాకూడదు.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

ఇదీ చూడండి: రాహుల్​ గాంధీ ఒక 'రాజకీయ కోకిల': భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.