ETV Bharat / opinion

అసోంలో భాజపాకు ప్రాంతీయ పార్టీల సెగ! - ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్

అసోంలో మరోసారి అధికారంలోకి రావాలన్న భాజపా ప్రణాళికలపై ప్రాంతీయ పార్టీలు దెబ్బ కొడతాయా? కాంగ్రెస్​ మహాకూటమి ప్రతిపాదనను పక్కనబెట్టి.. ప్రాంతీయ శక్తులే పీఠంపై కూర్చుంటాయా?.. ఇటీవల రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. జాతీయ పార్టీలకు సమదూరం పాటించి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారుతున్నాయి.

Growth of 'neo-regionalist' forces might impact BJP and Congress' prospect in Assam Polls
అసోంలో భాజపాకు ప్రాంతీయ పార్టీల సెగ!
author img

By

Published : Jan 7, 2021, 3:35 PM IST

అసోంలో ఈ ఏడాది ఏప్రిల్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రాంతీయ పార్టీల ప్రభావం గణనీయంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బలం పుంజుకున్న ప్రాంతీయ శక్తులు.. అధికార భాజపా, కాంగ్రెస్​కు కొత్త సవాళ్లు విసుతున్నట్లు కనిపిస్తోంది.

రాష్ట్రంలోని ప్రధాన విద్యార్థి సంఘాలైన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), అసోం జాతీయతావాది యువ ఛాత్ర పరిషత్(ఏజేవైసీపీ) కలిసి అసోం జాతీయ పరిషత్(ఏజేపీ) అనే రాజకీయ పార్టీకి పురుడుపోశాయి. మరోవైపు, ఆర్టీఐ కార్యకర్త, కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) అధినేత అఖిల్ గొగొయి స్థాపించిన 'రైజర్ దళ్' సైతం రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ విద్యార్థి సంఘాలకు రాష్ట్రంలో గట్టి పట్టు ఉంది. ఇవి ఏకమై రాజకీయ పార్టీని స్థాపించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది.

మరోవైపు, ప్రాంతీయ శక్తులన్నింటినీ ఏకం చేయాలని రాజ్యసభ ఎంపీ అజిత్ భుయాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. భాజపాను ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు కసరత్తులు ముమ్మరం చేశారు.

100 సీట్లకు ఎసరు!

రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుంటామని పదేపదే చెబుతోంది. అయితే మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో అధికారం చేపట్టాలంటే భాజపా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అసోంలోని ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఈ తీవ్రత మరీ అధికంగా ఉంది. ఈ కారణంగా సీనియర్ భాజపా నేతలు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు కాషాయ పార్టీకి వీడ్కోలు చెప్పారు. ఏజేపీ, రైజర్ దళ్​లోకి వెళ్తున్నారు.

లక్ష్యం.. సీఏఏ రద్దు

'ఆసు' మాజీ ప్రధాన కార్యదర్శి లురిన్​జ్యోతి గొగొయి అసోం జాతీయ పరిషత్​కు నేతృత్వం వహిస్తున్నారు. అసోంలో ఆయనకు ఫైర్​బ్రాండ్​గా పేరుంది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను ఇప్పటికే ప్రారంభించారు లురిన్. సీఏఏ నిరసనలు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దే లక్ష్యంగా బరిలోకి దిగిన ఏజేపీ.. అసోం ఎన్నికలపై గణనీయ ప్రభావం చూపనుంది. ఓటర్లను తనవైపు లాక్కునే సత్తా ఈ పార్టీకి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఏజేపీ, రైజర్ దళ్ మధ్య పొత్తు కుదురుతుందన్న ఊహాగానాలు వీరిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

'మా అభిప్రాయం స్పష్టంగా ఉంది. అన్ని ప్రాంతీయ శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తాం. అదే సమయంలో జాతీయ పార్టీలకు దూరం పాటిస్తాం. రైజర్ దళ్​తో పొత్తు విషయంపై ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం' అని ఏజేపీ చీఫ్, ఆసు మాజీ ప్రధాన కార్యదర్శి లురిన్​జ్యోతి గొగొయి పేర్కొన్నారు.

బెడిసికొట్టిన కాంగ్రెస్ 'మహాకూటమి'

మరోవైపు, సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో మహా కూటమి ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. భాజపాను ఓడించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని సూచిస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి మృతి తర్వాత నాయకత్వ సంక్షోభంలో పడ్డ అసోం కాంగ్రెస్​కు ఇవేవీ కలిసిరావడం లేదు. 'హస్తం' ప్రతిపాదనను ప్రాంతీయ పార్టీలు తోసిపుచ్చుతున్నాయి. కొత్తగా ఏర్పడ్డ రెండు పార్టీలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో పలువురు సీనియర్ నాయకులు సైతం పార్టీని వదిలి వెళ్తుండటం వల్ల కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతోంది.

మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్)తో కాంగ్రెస్ జట్టుకట్టినప్పటికీ.. ఇటీవల జరిగిన బోడోలాండ్ ప్రాంతీయ మండలి ఎన్నికల్లో కూటమి చతికిలపడింది. ఏఐయూడీఎఫ్​తో కూటమి విషయంలోనూ కాంగ్రెస్​లో అంతర్గత విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.

జోరు చూపేనా?

అసోం గణ పరిషత్(ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) పార్టీలతో కలిసి 2016లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భాజపా. ఇటీవల బీపీఎఫ్​తో తెగతెంపులు చేసుకుంది. నూతనంగా ఏర్పాటైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్​), ఏజీపీతో కలిసి ఈసారి ఎన్నికలకు వెళ్లనుంది. భాజపా, యూపీపీఎల్ కలిసి ఇటీవల బోడోలాండ్ ప్రాదేశిక మండలి పీఠాన్ని సొంతం చేసుకున్నాయి.

మరి.. ఈసారి కూటమి పార్టీలతో కలిసి కాషాయ పార్టీ మాయ చేస్తుందా?.. లేదంటే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీల హవాకు చతికిలపడుతుందా అన్నది తేలాల్సి ఉంది.

(అనూప్ శర్మ, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, ఈటీవీ భారత్)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.