ETV Bharat / opinion

Fact Check: మంకీపాక్స్​ 'బిల్​ గేట్స్​ కుట్ర' అంటూ దుష్ప్రచారం.. ఇదీ అసలు నిజం!

ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న 'మంకీపాక్స్​' వైరస్​.. వ్యాపార దిగ్గజం బిల్​ గేట్స్​ ఆదాయార్జన కోసం చేసిన కుట్ర అంటూ సోషల్​ మీడియాలో సాగుతున్న ప్రచారం అసత్యమని 'ఈటీవీ భారత్​ ఫ్యాక్ట్​ చెక్'​లో తేలింది. 1958లోనే తొలిసారి ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని, అప్పటి నుంచే అనేక దేశాలు మంకీపాక్స్​పై పోరు సాగిస్తున్నాయని అధికారిక పత్రాల పరిశీలన ద్వారా నిర్ధరణ అయింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు...

bill gates monkeypox fact check
మంకీపాక్స్​, బిల్​ గేట్స్​కు సంబంధం ఉందా?
author img

By

Published : Jul 24, 2022, 4:34 PM IST

Updated : Jul 29, 2022, 1:43 PM IST

"కరోనా.. ల్యాబ్​లో ఉద్దేశపూర్వకంగా సృష్టించిన వైరస్! వ్యాక్సిన్​ల ద్వారా ఆదాయార్జనకు సంపన్నులు చేస్తున్న ప్రయత్నం! ప్రపంచ జనాభాను ఒక్కసారిగా తగ్గించే కుట్ర! టీకా ద్వారా ప్రతి ఒక్కరి శరీరంలోకి మైక్రోచిప్​ పంపి.. అందరినీ ట్రాక్ చేసే ఎత్తుగడ!"... 2019 చివర్లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత.. కొవిడ్​పై విస్తృతంగా ప్రచారమైన కుట్ర సిద్ధాంతాలివి. అన్నింటిలో కామన్​ పాయింట్.. బిల్​ గేట్స్​. కరోనాకు, బిల్​ గేట్స్​కు ముడిపెడుతున్న సమాచారం 2020 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఏకంగా 12 లక్షల సార్లు(న్యూయార్క్ టైమ్స్​, జిగ్నల్ ల్యాబ్స్​ అధ్యయనం ప్రకారం) టీవీల్లో, సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టిందంటే.. ఎంతమంది ఈ దుష్ప్రచారాన్ని నమ్మారో అర్థం చేసుకోవచ్చు.

కరోనా వ్యాప్తి మొదలై రెండున్నరేళ్లు దాటింది. యావత్ ప్రపంచం ఒక్కటై.. టీకాలను అస్త్రంగా చేసుకుని మహమ్మారిపై పోరులో కీలక పురోగతి సాధించింది. సమూల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అదే సమయంలో.. వైరస్​కు, బిల్​ గేట్స్​కు ఏమాత్రం సంబంధం లేదంటూ అనేక మీడియా సంస్థలు ఫ్యాక్ట్​చెక్​ల ద్వారా నిజానిజాల్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేశాయి.
ఇంతలోనే మరో వైరస్​ కలకలం రేపింది. అదే మంకీపాక్స్. అసలు అదేంటో ప్రజలకు పూర్తిస్థాయిలో తెలిసే ముందే.. బిల్​ గేట్స్​కు ముడిపెడుతూ సోషల్​ మీడియాలో రకరకాల పోస్టులు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి.

ఆ పోస్టుల్లో ఏముంది?

బిల్​ గేట్స్ ఫొటోను అభ్యంతరకర రీతిలో మార్ఫ్​ చేసి.. "బ్రేకింగ్​.. మంకీపాక్స్ వ్యాప్తికి కారణం ఏంటో తెలిసిపోయింది" అనే హెడ్డింగ్​తో పోస్ట్ చేశారు. "నమ్మండి లేదా నమ్మకపోండి. మంకీపాక్స్​ అసలైన సృష్టికర్త బిల్​ గేట్స్​ వద్ద ఆ వ్యాధికి సంబంధించిన టీకా ఇప్పటికే సిద్ధంగా ఉంది" అనే క్యాప్షన్​ జోడించారు.

కరోనా తరహాలోనే మంకీపాక్స్​ను కూడా బిల్​ గేట్స్​ సృష్టించారని, వ్యాక్సిన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఇలా చేస్తున్నారని అర్థం వచ్చేలా అనేక మంది సోషల్ మీడియాలో ఈ పోస్టులు షేర్ చేస్తున్నారు. మరికొందరు న్యూమరాలజీకి, బిల్ గేట్స్​కు ముడిపెడుతూ తమ 'క్రియేటివిటీ' ప్రదర్శిస్తున్నారు.

bill gates monkeypox fact check
బిల్​ గేట్స్​కు, మంకీపాక్స్​కు ముడిపెడుతూ సోషల్ మీడియా పోస్ట్

భారత్​లో కొందరు మరో అడుగు ముందుకేశారు. దేశంలో తొలి మంకీపాక్స్​ కేసు కేరళలో వెలుగు చూడడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ రాష్ట్రంపై బురదజల్లే ప్రయత్నం చేశారు.

bill gates monkeypox fact check
కేరళపై బురదజల్లేలా సోషల్ మీడియా పోస్ట్

మంకీపాక్స్​-బిల్​ గేట్స్​ పోస్టుల్లో రెండు ప్రమాదకర అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది.. వ్యాక్సిన్ వ్యతిరేక ప్రచారం. మంకీపాక్స్​ టీకా హానికరమని అనేక పోస్టులు చెబుతున్నాయి. ఈ ప్రచారం ఇలానే కొనసాగితే.. ప్రజలు అదే నమ్మి, వ్యాక్సినేషన్​కు వెనకడుగు వేసే ప్రమాదముంది. కరోనా టీకా విషయంలోనూ కొంతమేర ఇదే జరిగింది.
రెండు.. మంకీపాక్స్​ కేరళలోనే ముందుగా వెలుగులోకి రావడంపై జరుగుతున్న ప్రచారంతోనూ ముప్పే. ప్రజల మధ్య దూరం, ముఖ్యంగా ఆ రాష్ట్రవాసుల పట్ల ద్వేషభావన ఏర్పడే ప్రమాదముంది. అందుకే.. మంకీపాక్స్​-బిల్​ గేట్స్​ పోస్టుల్లో నిజమెంతో తేల్చేందుకు ఫ్యాక్ట్​ చెక్​ అనివార్యమైంది.

నిజమా, కాదా? తెలుసుకునేదెలా?

మంకీపాక్స్​ ఎలా పుట్టింది? మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ వెలుగులోకి వచ్చింది? టీకా, చికిత్స అందుబాటులో ఉన్నాయా?.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకుంటే... మంకీపాక్స్​-బిల్ గేట్స్​ పోస్టుల్లోని సమాచారం నిజమో కాదో తేలిపోతుంది. ఈ జవాబుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ), అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) వెబ్​సైట్లను ఆశ్రయించాం. monkeypox who, monkeypox cdc అనే సింపుల్​ గూగుల్​ సెర్చ్​లతోనే ఈ సమాచారం పొందవచ్చు. ఆరోగ్య సంబంధిత సమాచారానికి అత్యంత ప్రామాణికమైన ఆ వెబ్​సైట్లలో మంకీపాక్స్​ గురించి ఉన్న కీలకాంశాలు చూస్తే...

  • మంకీపాక్స్​.. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్. ఇది.. స్మాల్​పాక్స్​కు కారణమయ్యే వేరియోలా వైరస్​ కుటుంబానికి చెందినదే. మంకీపాక్స్​ లక్షణాలు.. స్మాల్​పాక్స్​ లక్షణాల్లానే ఉన్నా.. తీవ్రత కాస్త తక్కువ. మరణావకాశాలు చాలా అరుదు. చికెన్​పాక్స్​కు, మంకీపాక్స్​కు సంబంధం లేదు.
  • మంకీపాక్స్​ను 1958లో తొలిసారి గుర్తించారు. పరిశోధనల కోసం పెంచుతున్న కోతుల్లో ఈ వైరస్ వ్యాప్తిని కనుగొన్నారు. మంకీపాక్స్​ అని పేరు పెట్టినప్పటికీ.. ఏ జంతువు వల్ల వ్యాపిస్తుందన్న అంశంపై స్పష్టత లేదు. ఆఫ్రికన్ ఎలుకలు, కోతులు.. ఈ వైరస్​కు ఆవాసాలై, ప్రజలకు వ్యాప్తి చేసే అవకాశముంది.
  • మనిషికి మంకీపాక్స్​​ వైరస్​ సోకినట్లు 1970లో తొలిసారి గుర్తించారు. డెమొక్రటిక్ రిపబ్లిక్​ ఆఫ్​ కాంగోలో 9 ఏళ్ల బాలుడు మొదటి బాధితుడు. ఆ తర్వాత మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో అనేక కేసులు వెలుగుచూశాయి. 1970 నుంచి మొత్తం 11 దేశాల్లో మంకీపాక్స్​ కేసులు నమోదయ్యాయి.
  • 2017లో నైజీరియాలో భారీస్థాయిలో మంకీపాక్స్ వ్యాప్తి మొదలైంది. 500 అనుమానిత కేసులు నమోదయ్యాయి. 200 కేసులు నిర్ధరణ అయ్యాయి. మరణాల రేటు 3శాతం. అప్పటి నుంచి ఇప్పటికీ అక్కడ మంకీపాక్స్ కేసులు వస్తూనే ఉన్నాయి. నైజీరియా నుంచి వచ్చినలో మంకీపాక్స్​ వైరస్​ గుర్తించినట్లు 2018-21 మధ్య బ్రిటన్, అమెరికా, సింగపూర్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ప్రకటించాయి. 2022 మేలో అనేక దేశాల్లో మంకీపాక్స్​ వ్యాప్తి మొదలైంది.
  • స్మాల్​పాక్స్ టీకా.. మంకీపాక్స్​ నివారణలో 85శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. స్మాల్​పాక్స్​ వ్యాక్సిన్ తీసుకుంటే.. మంకీపాక్స్​ వైరస్​ సోకినా స్వల్ప అనారోగ్యంతో బయటపడొచ్చు.

'మంకీపాక్స్​-బిల్ గేట్స్'​ క్లెయిమ్ వాస్తవమా?
మంకీపాక్స్​ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్​ సీడీసీ వెబ్​సైట్లలో ఉన్న వివరాలు, మెక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్​ జీవిత ప్రస్థానాన్ని పోల్చి చూస్తే.. ఈ క్లెయిమ్​లో వాస్తవమెంతో ఇట్టే అర్థమైపోతోంది. WHO, CDC ప్రకారం 1958లోనే మంకీపాక్స్​ వైరస్​ను తొలిసారి గుర్తించారు. అప్పటికి బిల్ గేట్స్ వయసు దాదాపు మూడేళ్లు(1955 అక్టోబరు 28న బిల్ గేట్స్ జన్మించారు). మూడేళ్ల బాలుడు వైరస్​ను సృష్టించి.. ఇన్నేళ్ల తర్వాత వ్యాపార ప్రయోజనాల కోసం వ్యాప్తి చేస్తున్నారని అనడం అసంబద్ధం. అంటే.. మంకీపాక్స్​కు, బిల్​ గేట్స్​కు ముడిపెడుతూ సోషల్​ మీడియాలో కనిపిస్తున్న పోస్టులన్నీ అసత్యాలే అని నిర్ధరించవచ్చు.

బిల్​ గేట్స్​పై ఎందుకు ఇన్ని కుట్ర 'సిద్ధాంతాలు'?

బిల్​ గేట్స్​.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. బిల్​ అండ్ మెలిండా గేట్స్​ ఫౌండేషన్​ ద్వారా మానవాళి సంక్షేమం కోసం బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్న మహాదాత. అయితే.. అవసరంలో ఉన్నవారికి తన వంతు సాయం చేసేందుకు డబ్బులు మాత్రమే ఇచ్చి సరిపెట్టడం లేదాయన. పాలకులు చేయాల్సిన, చేయలేని పనుల్ని దగ్గరుండి చేయిస్తున్నారు. వాటిలో ప్రధానమైంది.. పరిశోధన. మానవ చర్యలతో వాతావరణం ఎలా మారుతోంది? వాతావరణ మార్పులతో పొంచి ఉన్న సవాళ్లేంటి? కొత్తగా పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే వైరస్​లు ఏంటి? వాటిని ఎదుర్కోవడం ఎలా?.. ఇలా అనేక అంశాలపై విస్తృత అధ్యయనం చేస్తున్నారు బిల్​ గేట్స్. కొత్త వైరస్​లు, ఇతర వ్యాధికారకాలను గుర్తించేందుకు రోజుకు ఏకంగా లక్షన్నర సాంపిళ్లను అధ్యయనం చేయగల యంత్రాలు, టెక్నాలజీ గేట్స్​ ఫౌండేషన్​ దగ్గర ఉన్నాయంటే.. బిల్​ మాటల వెనుక ఎంతటి శాస్త్రీయ అధ్యయనం ఉందో అర్థం చేసుకోవచ్చు.

bill gates monkeypox fact check
తాను రాసిన పుస్తకంతో బిల్ గేట్స్

భవిష్యత్​ ముప్పులపై ఇలా గుర్తించిన విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియచేస్తూ, పాలకుల్ని అప్రమత్తం చేస్తున్నారు బిల్ గేట్స్​. "హౌ టు ప్రివెంట్​ ద నెక్స్ట్​ పాండెమిక్" వంటి పుస్తకాలు రాసి.. రాబోయే ముప్పుల్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఆర్థికంగా తనవంతు సాయం అందిస్తున్నారు. అయితే.. ఇదే ఆయనపై అనేక కుట్ర సిద్ధాంతాలకు కారణమైంది. కొందరు అదే పనిగా అసత్య సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. ఇవన్నీ చాలా ఆశ్చర్చకరంగా, కనీసం ఖండించడానికి కూడా మనసు రానంత అసంబద్ధంగా ఉన్నాయని ఓ సందర్భంలో అన్నారు బిల్​ గేట్స్.

bill gates monkeypox fact check
టీకా ద్వారా మైక్రోచిప్​ వాదనపై బిల్ వ్యంగ్యాస్త్రం

సోర్స్ లింక్స్​:

1.https://www.businesstoday.in/latest/economy-politics/story/bill-gates-created-coronavirus-in-secret-lab-historian-tells-why-such-conspiracy-theories-are-dangerous-280143-2020-12-01
2.https://www.bbc.com/news/52847648
3.https://twitter.com/ForTheRecord323/status/1547937619203371008
4.https://twitter.com/Alejandrina8107/status/1548054347606437889
5.https://twitter.com/Aldo94822596/status/1548359659995639808
6.https://twitter.com/CuriousMonk6/status/1547835179997151232
7.https://www.who.int/news-room/fact-sheets/detail/monkeypox
8.https://www.cdc.gov/poxvirus/monkeypox/about.html
9.https://www.theatlantic.com/science/archive/2022/05/bill-gatess-plan-save-world-next-pandemic/629826/
10.https://www.economist.com/culture/bill-gates-explains-how-to-prevent-the-next-pandemic/21809103
11.https://www.cnbc.com/2021/01/27/bill-gates-was-very-surprised-by-crazy-covid-conspiracy-theories.html

Last Updated : Jul 29, 2022, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.