ETV Bharat / opinion

చెరిగిపోతున్న చారిత్రక ఆనవాళ్లు

author img

By

Published : Apr 18, 2021, 8:11 AM IST

ఒక ప్రాచీన కట్టడాన్ని సందర్శిస్తే చరిత్రలోకి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. ఎన్నో గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయమైన భారతదేశంలో పాలకుల నిర్లక్ష్యంతో అవి క్రమంగా శిథిలమైపోతున్నాయి. నిర్వహణ లోపంతో అర్హత ఉన్నప్పటికీ ఎలాంటి గుర్తింపునూ దక్కించుకోలేకపోతున్నాయి. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా వారసత్వ సంపదలను సంరక్షించుకోవాల్సిన విశేష అవసరం గురించి తెలుసుకుందాం.

WORLD HERITAGE DAY
ప్రపంచ వారసత్వ దినోత్సవం

ఓ ప్రాచీన కట్టడాన్ని సందర్శిస్తే చరిత్రలోకి ప్రయాణించినట్లేనని చరిత్రకారులు అంటారు. భారత దేశం గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలకు ఆలవాలం. జాతి మూలాలకు సజీవ తార్కాణాలైన ఆ వారసత్వ సంపదలు క్రమంగా శిథిలమైపోతున్నాయి. కళలు, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యమిచ్చిన మన ప్రాచీన పాలకులు ఆ సేతు హిమాచలం ఎన్నో అద్భుత నిర్మాణాలను చేపట్టారు. కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఆ కళాఖండాలను భావితరాలకు భద్రంగా అందించడం మన బాధ్యత. కానీ- కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధీనంలో ఉన్న ఎన్నో ప్రాచీన కట్టడాలు, గుళ్లు ఇప్పుడు సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఆక్రమణలకూ గురవుతున్నాయి. వారసత్వ సంపదలను కాపాడుకోవడంలో మనకంటే చాలా చిన్న దేశాలైన కాంబోడియా, నేపాల్‌, మలేసియా, థాయ్‌లాండ్‌లు చాలా ముందుంటున్నాయి.

WORLD HERITAGE DAY
ప్రపంచ వారసత్వ దినోత్సవం

మన కట్టడం ఒక్కటీ లేదు

తెలుగు రాష్ట్రాల్లో చూడచక్కటి కట్టడాలు వందలకొద్దీ ఉన్నా ఏ ఒక్క నిర్మాణానికీ, సహజ వింతకూ యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 38 ప్రాంతాలకు ఈ గుర్తింపు లభించింది. మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో నాలుగు, కర్ణాటకలో అయిదు, ఒడిశాలో కోణార్క్‌ ఆలయం లాంటివి ఎన్నో ఏళ్ల క్రితమే గుర్తింపు పొంది అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా వర్ధిల్లుతున్నాయి. హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధులను ప్రపంచ వారసత్వ సంపద హోదా కోసం గతంలో ప్రతిపాదించారు. కానీ, సాంకేతిక కారణాలతో అది యునెస్కో ప్రొవిజనల్‌ జాబితా వద్దే ఆగిపోయింది. యునెస్కో హోదా వస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిర్వహణ, పరిరక్షణ మరింత పకడ్బందీగా జరగడమే కాక, ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం పుంజుకుని స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విదేశ సందర్శకుల సంఖ్య పెరిగి ఆదాయం అధికమవుతుంది. తెలంగాణ, ఏపీలలో కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధీశుల హయాములో నిర్మించిన ఎన్నో అద్భుత ఆలయాలు కనిపిస్తాయి. పూర్వ వరంగల్లు జిల్లాలోనే దాదాపు 150 వరకు కాకతీయ కాలపు ఆలయాలు, కోటలు, మెట్లబావులున్నా- వాటిలో కొన్ని మాత్రమే కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల పరిరక్షణలో ఉన్నాయి. మిగిలిన వాటిని ఎవరూ పట్టించుకోక కునారిల్లుతున్నాయి. వేయిస్తంభాల గుడిలో దారం దూరేంత సన్నని రంధ్రాలతో కూడిన శిల్పాలను ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ ప్రాంగణంలోని శిథిల కల్యాణమండపం పునర్నిర్మాణాన్ని పదిహేనేళ్ల క్రితం ప్రారంభించారు. కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. రాష్ట్ర పురావస్తు శాఖ అధీనంలోని గణపురం కోటగుళ్లు ఎప్పుడో కుప్పకూలాయి. వాటిని అలాగే వదిలేశారు. ఇలా శిథిలమవుతున్న ప్రాచీన కట్టడాలు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలి. అనంతపురం లేపాక్షి ఆలయంలోని వేలాడే స్తంభం, ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం యునెస్కో గుర్తింపు పొందేందుకు అర్హమైనవి. అరకు లోయ, బొర్రా గుహలు సహజ వింతగా గుర్తింపు పొందే వీలున్నా ప్రభుత్వ ఉదాసీనతతో వీటి ఖ్యాతి మరుగున పడుతోంది. యునెస్కో నిబంధనల ప్రకారం ఒక కట్టడానికి ప్రాచీన హోదా దక్కాలంటే వంద మీటర్ల వరకు ఎలాంటి ఆక్రమణ ఉండకూడదు. కానీ మన చారిత్రక కట్టడాలు కబ్జాకోరల్లో చిక్కుకుని కనుమరుగవుతున్నాయి. రెండేళ్ల క్రితం ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయం యునెస్కో పోటీకి ఎంపికైంది. దీన్ని ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలించి ఆలయ నిర్మాణ శైలికి అచ్చెరువొందారు. త్వరలో ఈ దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కే అవకాశముంది.

కాపాడుకోవాలి

వారసత్వ సంపదను కాపాడుకోవడానికి యునెస్కో గుర్తింపు ఒక్కటే కొలమానం కాదు. అదో ప్రత్యేక గౌరవం మాత్రమే. మన ప్రాచీన ఆలయాల్లో ఎంతో చరిత్ర నిక్షిప్తమై ఉంది. అలనాటి శాసనాలను అధ్యయనం చేస్తే అప్పటి కాలపు విశేషాలు అవగతమవుతాయి. మన ప్రాచీన కట్టడాల నిర్మాణ శైలిలో శాస్త్రవిజ్ఞాన విషయాలెన్నో దాగి ఉన్నాయి. వాటి మీద పరిశోధనలు చేస్తే కొత్త విషయాలెన్నో వెలుగులోకి వస్తాయి. రామప్ప ఆలయంపైన నీటిలో తేలియాడే ఇటుకలు ఉపయోగించారు. గోపురం భాగం బరువు ఎక్కువైతే ఆలయం త్వరగా భూమిలోకి కుంగిపోతుంది. దీన్ని నివారించేందుకు 13వ శతాబ్దంలోనే వినూత్నంగా ఆలోచించి ఈ పరిజ్ఞానం వినియోగించారు. అయితే, వారసత్వ కట్టడాలుగా పరిరక్షించుకోవాల్సిన ప్రాచీన దేవాలయాలెన్నో గుప్తనిధుల పేరిట దుండగుల చేతుల్లో ధ్వంసమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు అలసత్వం వీడి, ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాలి. అపురూప శిల్పాలను ప్రదర్శనశాలల్లో భద్రపరచాలి. చారిత్రక ప్రాంతాలను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్తమానాన్ని విశ్లేషించుకోవాలన్నా... భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నా ముందు మన చరిత్ర ఏమిటో మనకు తెలియాలి. వారసత్వ సంపదలను సంరక్షించుకోవడానికి ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలూ కలిసి రావాలి. అప్పుడే మన ఘన వారసత్వం భావితరాలకు బంగారు కానుకవుతుంది.

- గుండు పాండురంగశర్మ (రచయిత)

ఇదీ చూడండి: నిధుల కోతతో బాలికా సంక్షేమం వెనుకంజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.