ETV Bharat / opinion

బాలికా వికాసమే ప్రగతి పథం - బాలుర బాలికల నిష్పత్తి

దేశంలో బాలబాలికల నిష్పత్తి అయిదేళ్ల కాలావధిలో పదహారు పాయింట్లు పెరిగి 934కు చేరిందని కేంద్ర ప్రభుత్వం చాటుతోంది. అయితే.. ఆడపిల్లలకు 12 ఏళ్ల పాటు నిర్నిరోధంగా చదువుసంధ్యలు గరిపేలా ఆరోగ్యకర విధానాల్ని అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అందుకు పూనిక వహించని దేశాలు ఏటా 15-30 లక్షల కోట్ల డాలర్ల ఉత్పాదకత నష్టాన్ని అనుభవిస్తున్నాయని 2018లోనే హెచ్చరించింది. అలాంటి నష్టజాతక దేశాల్లో భారత్​ సైతం ముందువరసలోనే ఉంది.

girl child
బాలికా వికాసమే ప్రగతిపథం
author img

By

Published : Jan 25, 2021, 6:51 AM IST

బాలికలకు సమానావకాశాలు, భద్రమైన భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా ఏటా అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2012 నుంచి నిర్వహిస్తోంది. అంతకు నాలుగేళ్ల ముందు నుంచే జాతీయ స్థాయిలో అదే తరహా చొరవ కనబరుస్తున్న ఇండియాలో- లింగపరమైన దుర్విచక్షణ సామాజిక జాడ్యంగా తరాల తరబడి ఊడలు దిగి విస్తరించింది. పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలకు తెగబడే నైచ్యం మొదలు బాల్యవివాహాల దాకా చట్ట విరుద్ధంగా సాగుతున్న అమానుషాలది అక్షరాలా అంతులేని కథ.

ఆరేళ్లలోపు పిల్లల్లో ప్రతి వెయ్యిమంది బాలురకు 1961లో 976 మంది బాలికలు ఉండగా, ఆ నిష్పత్తి 2001 నాటికి 927కు, 2011 వచ్చేసరికి 918కి పడిపోవడమే- పురుషాధిక్య భావజాలం ఆడపిల్లలకెంతగా ప్రాణాంతకమవుతున్నదీ వెల్లడిస్తోంది. ఆ దురవస్థను దునుమాడటానికే 'బేటీ బచావ్‌ - బేటీ పడావ్‌' పేరిట ఎన్‌డీఏ తొలి జమానా 2015లో పట్టాలకెక్కించిన పథకం సత్ఫలితాలనిస్తోందని, బాలబాలికల నిష్పత్తి అయిదేళ్ల కాలావధిలో పదహారు పాయింట్లు పెరిగి 934కు చేరిందని కేంద్ర ప్రభుత్వం చాటుతోంది. దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు గాను 422 చోట్ల జనన సమయ లింగ నిష్పత్తి మెరుగు పడిందని, యూపీ, పంజాబ్‌, హరియాణాలాంటి రాష్ట్రాల్లో బేటీ బచావ్‌ గణనీయ ప్రభావం కనబరచిందని నిన్న బాలికా దినోత్సవ సందర్భంగా సర్కారు వెల్లడించింది.

కొవిడ్ వేళ..

బాలింతల నమోదు, ఆసుపత్రి ప్రసవాలు, సెకండరీ స్థాయి చదువుల్లో ఆడపిల్లల ప్రవేశాలు తొలి నాలుగేళ్లలో బాగా పెరిగాయంటున్నా- కొరివిగా దాపురించిన కొవిడ్‌ సంక్షోభం బాలికల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేసింది. ప్రతి వెయ్యిమంది బాలలకు 950 మంది బాలికలు ఉండటం సానుకూల నిష్పత్తి కాగా, ఆ లక్ష్యానికి ఎంతో దూరంగా ఉన్న ఇండియాలో- కొవిడ్‌ వేళ బాల్య వివాహాల జాతర గుండెల్ని మెలిపెడుతోంది. సాధికార శక్తిగా బాలిక ఎదగగలిగే వాతావరణంలోనే యావద్దేశమూ ధీమాగా పురోగమించగలుగుతుంది!

ప్రతి ఇద్దరిలో ఒకరు..

పాతికేళ్ల క్రితం (1995) నాటి చరిత్రాత్మక బీజింగ్‌ డిక్లరేషన్‌కు అనుబంధంగా 2011లో సమితి చేసిన తీర్మానం- భద్రంగా చదువుకొని ఆరోగ్యకర జీవనాన్ని పొందే హక్కు బాలికలకు ఉందని ఎలుగెత్తింది. ఆసరా దొరికితే అల్లుకుపోయే మల్లెతీగల్లా షఫాలీ వర్మ, మైథిలీ ఠాకుర్‌, ప్రియాంక పాల్‌, హిమాదాస్‌, శివంగి పాఠక్‌, రిథిమా పాండే వంటివారి విజయగాథలు కొత్త ఆశల చివుళ్లు తొడుగుతున్నాయి. అదేసమయంలో- ఇండియా వ్యాప్తంగా సంతానవతులయ్యే వయసులోని స్త్రీలు ప్రతి ఇద్దరిలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నట్లు విశ్వ పౌష్టికాహార నివేదిక నిరుడు వెల్లడించింది. గ్రామీణ భారతాన జరుగుతున్న వివాహాల్లో 57 శాతం 15-19 ఏళ్ల మధ్య వయసులోని బాలికలవేనని నిరుడు నివేదించిన స్వచ్ఛంద సంస్థ 'క్రై'- కోటీ 72 లక్షల పైచిలుకు బాల్యవివాహాలు జరిగాయని ప్రకటించింది.

సమగ్రంగా అమలైనప్పుడే..

ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో- గృహహింస తీవ్రత అధికంగా ఉందని ఏడు రాష్ట్రాలు, లింగ నిష్పత్తి పడిపోవడంలో ఎనిమిది రాష్ట్రాలు, బాలికలుగా లైంగిక దాడులకు గురయ్యామని సమధిక మహిళలు చెప్పినవి తొమ్మిది రాష్ట్రాలు కావడం క్షేత్రస్థాయి వ్యధాభరిత దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఆడపిల్లలకు 12 ఏళ్ల పాటు నిర్నిరోధంగా చదువుసంధ్యలు గరిపేలా ఆరోగ్యకర విధానాల్ని అమలు చేయాలన్న ప్రపంచ బ్యాంకు, అందుకు పూనిక వహించని దేశాలు ఏటా 15-30 లక్షల కోట్ల డాలర్ల ఉత్పాదకత నష్టాన్ని అనుభవిస్తున్నాయని 2018లోనే హెచ్చరించింది. అలాంటి నష్టజాతక దేశాల్లో ఇండియా సైతం ముందువరసలోనే ఉంది. బాలికల భద్రత, ఆరోగ్యకర ఎదుగుదల, విద్యావిషయకంగా వెన్నుదన్ను, బాల్యవివాహాలపై ఉక్కుపాదం, భ్రూణ హత్యలపై పటిష్ఠ నిషేధం, స్త్రీ సాధికారత దిశగా విధానాలు- సమగ్రంగా అమలైనప్పుడే మానవాభివృద్ధి సూచీలే కాదు, వృద్ధి రేట్లూ రేసు గుర్రాలవుతాయనడంలో సందేహం లేదు!

ఇదీ చూడండి:భారత్‌.. ప్రపంచానికే అన్నపూర్ణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.