ETV Bharat / opinion

నత్తనడకన సాగుతున్న భారత​ 'బుల్లెట్​' - బుల్లెట్​ రైళ్లు ఇండియా

జపాన్‌, చైనా, బ్రిటన్‌ సహా దాదాపు 20 దేశాల్లో ప్రస్తుతం బుల్లెట్‌ రైళ్లు దూసుకుపోతున్నాయి. కానీ దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు మూడేళ్ల క్రితమే శంకుస్థాపన జరిగినా, భూ సేకరణ వంటి బాలారిష్టాలనే అది అధిగమించలేకపోతోంది. భారత్​లో ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఏ దశలో ఉంది? పనులు వేగంగా జరగాలంటే ఏం చర్యలు చేపట్టాలి?

Editorial on delay of bullet train project works in India
నత్తనడకన సాగుతున్న భారత​ 'బుల్లెట్​'
author img

By

Published : Sep 30, 2020, 5:49 AM IST

కాలంతోపాటు మనమూ మారాలి. ఆధునికతను అందిపుచ్చుకోవాలి. లేదంటే పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. జపాన్‌, చైనా, బ్రిటన్‌ సహా దాదాపు 20 దేశాల్లో ప్రస్తుతం బుల్లెట్‌ రైళ్లు దూసుకుపోతున్నాయి. ప్రపంచంలోకెల్లా అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌లో మాత్రం ఈ హైస్పీడ్‌ రైలు ఇప్పటికీ పట్టాలెక్కలేదు. దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు మూడేళ్ల క్రితమే శంకుస్థాపన జరిగినా, భూ సేకరణ వంటి బాలారిష్టాలనే అది అధిగమించలేకపోతోంది. దాంతోపాటు మరో ఏడు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ప్రణాళికలు సిద్ధంచేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్‌తో అనుసంధానించే నడవా కూడా ఇందులో ఒకటి. నూతన ప్రాజెక్టులను తలపెట్టడం హర్షణీయమే అయినా, తొలుత తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతీ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జపాన్‌ ఆదర్శం

ప్రపంచంలో తొలి బుల్లెట్‌ రైలును ప్రారంభించిన దేశం జపాన్‌. టోక్యో, ఒసాకా నగరాలను కలుపుతూ 1964లోనే అక్కడ హైస్పీడ్‌ రైలు పరుగులు మొదలయ్యాయి. అమెరికా, చైనాల తరవాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్‌ వెలుగొందడానికి గల ప్రధాన కారణాల్లో అక్కడి బుల్లెట్‌ రైలు వ్యవస్థ ఒకటి. రెండో ప్రపంచయుద్ధంతో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. ఆ తరవాత ప్రభుత్వం, ప్రజలు మొక్కవోని పట్టుదలతో కృషి చేయడంతో ప్రగతి సత్వరం పట్టాలెక్కింది. సమ్మిళిత వృద్ధి సాధనే లక్ష్యంగా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు జపాన్‌ శ్రీకారం చుట్టింది. దరిమిలా దేశ వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణ సమయం కలిసిరావడంతో మానవ వనరులను పరిశ్రమలు సమర్థంగా వినియోగించుకోగలిగాయి. పర్యాటక రంగమూ ఊపందుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమించింది. ఇన్నేళ్లలో ఏ ఒక్కరూ రైలు ప్రమాదంలో మృత్యువాత పడకపోవడం, బుల్లెట్‌ రైళ్ల వార్షిక సగటు ఆలస్యం కేవలం 20 సెకన్లు కావడం- జపాన్‌లో హైస్పీడ్‌ రైళ్ల వ్యవస్థ పటిష్ఠతకు నిదర్శనం!

జపాన్‌ సహకారంతో ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్‌ రైలు మార్గ నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. 2017లో అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని మోదీ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. అందులో 81 శాతం సొమ్ము జపాన్‌ నుంచి రుణంగా అందనుంది. 2023 డిసెంబరు నాటికి తొలి ప్రయాణం చేయాలన్నది లక్ష్యం. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 2022నాటికి 75 ఏళ్లు పూర్తవుతుండటంతో అదే ఏడాది ఆగస్టులో 'బుల్లెట్‌' సేవలను కొంతమేరకైనా ప్రారంభిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ప్రారంభ తేదీని ముందుకు మార్చింది.

అన్నదాతలకు భరోసా ఇవ్వాలి

గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి మూడు గంటల్లో చేరుకోవచ్చని 'జాతీయ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)' చెబుతోంది. శంకుస్థాపన జరిగి మూడేళ్లవుతున్నా పనుల్లో పెద్దగా పురోగతి లేదు. నడవా నిర్మాణానికి 1,380 హెక్టార్ల భూమి కావాలి. 940 హెక్టార్ల భూమి గుజరాత్‌లో, 431 హెక్టార్లు మహారాష్ట్రలో, మిగిలిన కొంత భూమి దాద్రానాగర్‌ హవేలీలో అవసరం. మొత్తం భూమిలో 63 శాతమే సేకరించగలిగారు. దీంతో లక్ష్యం గడువును 2028కి మార్చాలని కేంద్రం, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రాజెక్టు వ్యయమూ పెరగనుంది! వాస్తవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ ప్రాజెక్టు తమ ప్రాధాన్య జాబితాలో లేనేలేదని ఇటీవల కుండ బద్దలుకొట్టారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు కాబట్టే ముంబయి-అహ్మదాబాద్‌ ప్రాజెక్టును ఠాక్రే నిర్లక్ష్యం చేస్తున్నారని, సీఎం అలా మాట్లాడితే భూములిచ్చేందుకు రైతులు ఎలా ముందుకొస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రాజెక్టు కోసం అన్నదాతలు సారవంతమైన భూములను కోల్పోతే రోడ్డున పడతారు. కనుక భవిష్యత్తుపై భరోసా కలిగించేలా కేంద్రం, రాష్ట్రాలు వారిలో విశ్వాసం కల్పించాలి. బుల్లెట్‌ రైళ్ల వ్యవస్థతో దేశానికి ఒనగూడే ప్రయోజనాలను విడమరచి చెప్పాలి. మెరుగైన పునరావాస వసతులు ఏర్పాటుచేయాలి. మార్కెట్‌ రేటు కంటే కొన్ని రెట్లు ఎక్కువగా డబ్బు అందజేయాలి. ఇళ్లు కోల్పోయేవారికి కొత్త ఇళ్లు కట్టించడం, ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి కేటాయించడం వంటి చర్యలు చేపట్టాలి. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావాలి. అప్పుడే దేశంలో బుల్లెట్‌ రైలు కల సాకారమయ్యే దిశగా అసలైన ముందడుగు పడుతుంది.

- మండ నవీన్‌కుమార్‌ గౌడ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.