ETV Bharat / opinion

చట్టం సద్వినియోగం అయ్యేదెలా?

దేశంలో ఎక్కడ చూసినా కల్తీ, నాసిరకం ఉత్పత్తులు, మోసపూరిత ప్రకటనలతో వినియోగదారులు నష్టపోతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. వాటిని నివారించేందుకు 1986 నాటి పాత చట్టం స్థానే నూతన నిబంధనావళి జులైలో పట్టాలెక్కింది. కల్తీ నకిలీ సరకులు అంటగట్టజూసినవారు లక్ష రూపాయల వరకు జరిమానా చెల్లించి ఆరు నెలలదాకా జైలు ఊచలు లెక్కించక తప్పదన్న అంచనాలు వినిపించాయి. కానీ వాస్తవ దశ్యం అందుకు విరుద్ధంగా మారింది.

Consumer Rights Protection Act
చట్టం సద్వినియోగం అయ్యేదెలా?
author img

By

Published : Jan 1, 2021, 12:10 PM IST

నాసిరకం వస్తూత్పాదనలు, అనైతిక వ్యాపారాలు, మోసకారి ప్రకటనల బారిన పడి వినియోగదారులు దారుణంగా నష్టపోవడాన్ని నివారించడానికి ఉద్దేశించిన ప్రత్యేక శాసన స్ఫూర్తి అమలులో నీరోడుతోంది. 1986నాటి పాత చట్టం స్థానే వినియోగ హక్కులకు ఇతోధిక రక్షణను లక్షించిన నూతన నిబంధనావళి గత జులైలో పట్టాలకు ఎక్కింది. ఆ చట్టం రావడం తరువాయి- భిన్న అంచెల్లో వివాదాల పరిష్కార సంఘాలు, వేదికలు కొలువుతీరతాయని, కల్తీ నకిలీ సరకులు అంటగట్టజూసినవారు లక్ష రూపాయల వరకు జరిమానా చెల్లించి ఆరు నెలలదాకా జైలు ఊచలు లెక్కించక తప్పదన్న అంచనాలు వినిపించాయి. వాస్తవ దృశ్యం తద్విరుద్ధమని- వివిధ రాష్ట్రాలు, జిల్లాస్థాయి వినియోగదారుల కమిషన్లలో పెద్దయెత్తున ఖాళీలు పేరుకుపోయాయంటూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోదాహరణంగా చాటుతోంది. అత్యవసర ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపట్టాలని తన వంతుగా ప్రధాని మోదీ రాష్ట్రాలకు తాజాగా పిలుపిచ్చారు.

సంపూర్ణ రక్షణ ఎండమావే..

మునుపటి చట్ట నిబంధనల ప్రకారం, వినియోగదారుల వేదికల ముందుకు వెళ్ళిన కేసుల్ని మూడు నెలల గడువులో పరిష్కరించాల్సి ఉన్నా- రెండు మూడేళ్లయినా అతీగతీ లేని ఉదంతాలెన్నో గతంలో వెలుగుచూశాయి. జిల్లా, రాష్ట్ర సంఘాల్లో వందలాది ఖాళీలు పోగుపడే దుస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్న అర్జీదారు ఆ వివరాల్నీ క్రోడీకరించారు. ఒక్క కర్ణాటక రాష్ట్ర కమిషన్‌లో దాఖలైన వివాదాలను ఓ కొలిక్కి తేవడానికే ఏడేళ్లు పడుతుందంటే- రాష్ట్రాలవారీగా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నవంబరు నెలాఖరు వరకు వేసిన మదింపు ప్రకారం- జాతీయ వినియోగదారుల సంఘం వద్దే 21 వేలకుపైగా కేసులు అపరిష్కృతంగా పడి ఉన్నాయి. నియామకాలు చురుకందుకోని కారణంగా రాష్ట్రస్థాయి సంఘాల చెంత దాదాపు లక్షా పాతిక వేలు, జిల్లా వేదికల్లో అంతకు మూడింతల మేర అపరిష్కృత వ్యాజ్యాలు లెక్కతేలాయి. వెరసి, వినియోగదారులకు ఒనగూడుతుందన్న 'సంపూర్ణ రక్షణ' ఎండమావిని తలపిస్తోంది.

కోర్టుల జోక్యంతోనూ..

వినియోగ హక్కులపై జనచైతన్యమన్నది పారిశ్రామిక దేశాల్లో ఆరేడు దశాబ్దాలక్రితమే మొగ్గ తొడిగింది. ప్రపంచం నలుమూలలా ఆ ఒరవడి వేరూనుకోవాలని 1985లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. ఆ మరుసటి ఏడాది దేశీయంగా రూపుదాల్చిన చట్టం- హక్కుల అమలును పర్యవేక్షించే నియంత్రణ వ్యవస్థను సాకారం చేయడంలో విఫలమైంది. ఇ-కామర్స్‌, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు భారీగా విస్తరిస్తున్న దృష్ట్యా వినియోగదారుల పరిరక్షణ అథారిటీ అవతరణకు బాటలు పరచిన కొత్త చట్టం- సంఘాల సారథులు, సభ్యుల నియామకాలు సరిగ్గా జరగక అచేతనమవుతోంది! నాలుగేళ్లక్రితం యూపీలోని జిల్లా సంఘాల్లో రాజకీయ నియామకాల బాగోతంపై నిప్పులు కక్కిన సర్వోన్నత న్యాయస్థానం, దేశమంతటా క్షేత్రస్థాయి స్థితిగతులెలా ఉన్నదీ తెలుసుకునేందుకు జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌ కమిటీని ఏర్పరచింది. చాలాచోట్ల నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని, హరియాణా వంటిచోట్ల ముఠాల సంస్కృతిని తూర్పారపట్టిన కమిటీ- దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనీస వసతులు కొరవడ్డాయని స్పష్టీకరించింది. చాలాచోట్ల దస్త్రాలకు చెదలు పట్టిపోతున్నా స్పందించే నాథుడు లేడంటే, వినియోగ హక్కుల పరిరక్షణోద్యమం ఎంతగా గాడి తప్పిందో ఇట్టే బోధపడుతుంది. సిబ్బంది ఖాళీలు ఏర్పడటానికి ఆరునెలల ముందే నియామక ప్రక్రియ ఆరంభం కావాలంటున్న కొత్తచట్టం, ఏ స్థాయిలో ఎవరెవరితో ఎంపిక సంఘాలను నెలకొల్పాలో విశదీకరిస్తోంది. తెలంగాణ, ఒడిశా, దిల్లీ సహా వేర్వేరు ఉన్నత న్యాయస్థానాలు వినియోగదారుల సంఘాల్లో నియామకాలపై ఇటీవల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసినా- దీటైన స్పందన కరవైంది. దేశదేశాల్లో వినియోగదారులకు బాసటగా సంస్కరణాభిలాష ప్రస్ఫుటమవుతుండగా- ఇక్కడ కోర్టుల జోక్యంతోనూ నియామకాలు గాడిన పడని అవ్యవస్థ నిశ్చేష్టపరుస్తోంది!

ఇదీ చూడండి: అదిగో.. ఆశల వాకిలి? 2021 ఎలా ఉండబోతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.