ETV Bharat / opinion

చైనా పాటకు నేపాల్‌ ఆట.. సరిహద్దు వివాదానికి ఆజ్యం - india nepal border latest news

ఒక పక్క చైనా ప్రభుత్వం సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతుండగా, నేపాల్‌లోని కమ్యూనిస్టు ప్రభుత్వం భారత్‌తో సంప్రదాయ, చిరకాల సంబంధాల్ని విస్మరిస్తూ గిల్లికజ్జాలకు దిగింది. భారీ స్థాయిలో రుణాలు ఇవ్వడం ద్వారా నేపాల్‌పై భారం మోపిన చైనా, భారత్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడేలా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ కారణంగానే నేపాల్‌ మూడు భారత భూభాగాలను తనవిగా చెప్పుకుంటోంది.

china behind nepal-india controversy
చైనా పాటకు నేపాల్‌ ఆట.. సరిహద్దు వివాదానికి డ్రాగన్‌ ఆజ్యం
author img

By

Published : Jun 6, 2020, 6:37 AM IST

భారత్‌, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌ ప్రాంతంలో పెరిగిన వేడి.. మధ్యవర్తిత్వం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనతో చల్లారిపోయింది. జూన్‌ అయిదో తేదీన చైనా, భారత సైనికులు ఉత్తర సరిహద్దుల్లో ముఖాముఖి తలపడ్డారు. అంతకుముందు అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిమ్‌లలో సైతం ఇరుపక్షాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక పక్క చైనా ప్రభుత్వం సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతుండగా, నేపాల్‌లోని కమ్యూనిస్టు ప్రభుత్వం భారత్‌తో సంప్రదాయ, చిరకాల సంబంధాల్ని విస్మరిస్తూ గిల్లికజ్జాలకు దిగింది. భారీ స్థాయిలో రుణాలు ఇవ్వడం ద్వారా నేపాల్‌పై భారం మోపిన చైనా, భారత్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడేలా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ కారణంగానే నేపాల్‌ మూడు భారత భూభాగాలను తనవిగా చెప్పుకుంటోంది.

పెరుగుతున్న వ్యతిరేక ధోరణులు

చైనా తాజాగా భారత్‌తో ఘర్షణలకు దిగడం వెనక పలు కారణాలున్నాయి. ఇందులో ప్రధానమైనది.. ప్రపంచవ్యాప్తంగా కరోనాను విస్తరింపజేశారనే ఆరోపణలతో చైనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కరోనా ధాటికి తీవ్రస్థాయిలో ప్రభావితమైన అమెరికా సైతం చైనాపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిలో చైనా పాత్రపై అది బహిరంగంగానే ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో భారత్‌ అమెరికాకు చేరువకావడాన్ని చైనా జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది.

మరోవైపు నేపాల్‌ భారత్‌కు సమస్యలు సృష్టించడం మొదలుపెట్టింది. నేపాల్‌ ఇటీవల ప్రచురించిన పటంలో తూర్పు సరిహద్దుల్లో భారత్‌కు చెందిన మూడు భూభాగాలను తమవిగా ప్రకటించుకుంది. ఇరుదేశాల మధ్య ఎప్పటినుంచో ఉన్న స్నేహబంధాన్ని విస్మరించి నేపాల్‌ ప్రధానమంత్రి కేపీశర్మ ఓలి ఆరోపణలు చేశారు. తాజాగా చైనా, నేపాల్‌ రెండూ ఆకస్మికంగా తమ ఆరోపణల స్వరాన్ని తగ్గించాయి. అవి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంతో ఉన్న తూర్పు సరిహద్దుల్లో శాంతిస్థాపనను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పితారాగఢ్‌ జిల్లా పరిధిలోకి వచ్చే భూభాగాలు నేపాల్‌ తూర్పు సరిహద్దుల్లో ఉన్నాయి. కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాధురా అనే ఈ మూడు భారత భూభాగాలు తమవిగా నేపాల్‌ చెప్పుకుంటోంది. నేపాల్‌లోని కమ్యూనిస్టు ప్రభుత్వం భారత భూభాగాలను తమవిగా ప్రకటించుకుంటూ ఓ పటాన్ని సైతం ప్రచురించింది. కొన్నేళ్ల క్రితమే కమ్యూనిస్టు పార్టీ ఈ మూడు భాగాలను తమ దేశానివిగా చెబుతూ, పటం రూపొందించడంతో నేపాల్‌ వాటిపై గళం అందుకుంది. ఇటీవలి కాలంలో బీజింగ్‌, ఖాట్మండూ మధ్య సంబంధాలు బలపడటంతో- నేపాల్‌ భారత్‌లో తప్పులు ఎంచడం మొదలుపెట్టింది. నేపాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైన తరవాత భారత వ్యతిరేక ధోరణి బాగా పెరిగింది.

చరిత్ర చెబుతోందిలా...

రెండు శతాబ్దాలకు ముందు నేపాల్‌కు తూర్పు వైపున గఢ్వాల్‌, కుమౌన్‌ అనే రెండు రాజ్యాలు ఉండేవి. అవి రెండూ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో భాగంగా మారాయి. గతంలో పృథ్వీ నారాయణ్‌ షా అనే నేపాల్‌ రాజు తూర్పు ప్రాంత రాజ్యాలపైకి, పశ్చిమాన సిక్కింపైనా తన సైన్యంతో దాడికి దిగారు. భారీ సంఖ్యలో ఉన్న నేపాలీ సైన్యం... ముందస్తుగా సన్నద్ధంగా లేని గఢ్వాల్‌, కుమౌన్‌ రాజ్యాల సైనికుల్ని ఓడించింది. అప్పట్నుంచి గఢ్వాల్‌, కుమౌన్‌ ప్రాంతాలు రెండూ నేరుగా నేపాల్‌ రాజు, నేపాలీ యుద్ద గిరిజన తెగ గోర్ఖాల ప్రత్యక్ష నియంత్రణలోకి వెళ్లాయి. గోర్ఖాలు ఈ రెండు ప్రాంతాలనూ ఉక్కు పిడికిలితో, కఠిన రీతిలో పాలించాయి. ఈ రెండు ప్రాంతాల్లోని అమాయక పర్వత ప్రాంత ప్రజలపై అన్ని రకాల చిత్రహింసలకు పాల్పడుతూ దాష్టీకాలు చేశారు. గోర్ఖా సైనికులు సామూహిక హత్యాకాండలు, అత్యాచారాలు, లూటీలకు విరివిగా పాల్పడ్డారు. కొంతకాలానికి గఢ్వాల్‌ రాజు ప్రద్యుమ్న షా నాటి బ్రిటిష్‌ ఇండియా గవర్నర్‌ జనరల్‌ సాయం కోరారు. ఫలితంగా బ్రిటిష్‌ సైనిక దళాలకు, నేపాల్‌ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. నేపాల్‌ ఓడిపోయింది. శాంతి ఒప్పందం కుదిరింది. 1815లో జరిగిన ఈ ఒప్పందాన్నే ‘సుగౌలి సంధి’గా వ్యవహరిస్తారు. ఈ సంధి ప్రకారం- నేపాల్‌ తాను గఢ్వాల్‌, కుమౌన్‌ రాజ్యాల్లో ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ వెనక్కి ఇచ్చేయాలి.

అప్పట్నుంచి, నేపాల్‌ ప్రస్తుతం తమవిగా చెప్పుకుంటున్న భూభాగాల గురించి నేపాల్‌ చివరి రాజు జ్ఞానేంద్ర వీర్‌విక్రమ్‌షా పాలన వరకు ఎప్పుడూ ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. అంతకుముందు రాజు వీరేంద్ర వీర్‌ విక్రమ్‌షాను 2001లో అతడి కుమారుడు దీపేంద్ర హత్య చేయడంతో జ్ఞానేంద్ర రాజ్యాన్ని చేపట్టారు. ఆ తరవాత రాజు జ్ఞానేంద్రను ప్రజాతీర్పు మేరకు సింహాసనం నుంచి తొలగించి కమ్యూనిస్టులు దేశ పాలన చేపట్టారు. అప్పట్నుంచి భౌగోళిక వివాదం మొదలైంది. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ ఆ మూడు భారత భూభాగాలు తమవేనంటూ చెప్పుకోవడం ప్రారంభించింది.

ప్రస్తుతం వివాదాల్లో ఒకటైన లిపులేక్‌ ప్రాంతం పితారాగఢ్‌కు తూర్పువైపున భారత, టిబెట్‌ సరిహద్దులదాకా విస్తరించి ఉండటం గమనార్హం. ఈ ప్రాంతంలో భారత్‌, నేపాల్‌ సరిహద్దుల వరకు మన దేశం 82 కి.మీ. పొడవైన రహదారిని సైతం నిర్మించింది. ఈ రహదారి నిర్మాణంవల్ల తమ ముప్పు అనేది చైనా ఆందోళన. ఈ విషయంలో భారత్‌తో నేరుగా గొడవ పడకుండా, నేపాల్‌ను రెచ్చగొడుతోందనేది నిపుణుల అభిప్రాయం. భౌగోళికంగా నేపాల్‌ చాలా రకాల సేవలు, సరకుల విషయంలో పూర్తిగా భారత్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం లక్షల మంది నేపాలీ పౌరులు భారత్‌లో ఉపాధి పొందుతూ, తమ దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత అసాధారణ, అవాంఛిత వైఖరికి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కమ్యూనిస్టు ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంది.

- ఆర్‌.పి.నైల్వాల్‌(ప్రముఖ పాత్రికేయులు, ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.