ETV Bharat / opinion

కళ్లు చెదిరే సొరంగ వ్యూహంతో చైనాకు భారత్​ చెక్!

author img

By

Published : Jul 24, 2020, 7:24 PM IST

శత్రువును దెబ్బకొట్టాలంటే వ్యూహం గట్టిదై ఉండాలి. పయనించే దారి సాఫీగా ఉండాలి. అప్పుడే పగవాడిపై పైచేయి సాధ్యమవుతుంది. అర్థం లేని కవ్వింపు చర్యలతో కంట్లో నలుసులా మారిన చైనాను కట్టడి చేసేందుకు కేంద్రం ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరించబోతోంది. చైనా సరిహద్దుల వద్దకు ఆయుధ సంపత్తి తరలింపు కోసం బ్రహ్మపుత్ర నది కింద 15 కిలోమీటర్ల సొరంగ మార్గం అనే బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. 2028 నాటికి పూర్తి చేసే ఈ కళ్లు చెదిరే ప్రణాళికకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

Brahmaputra tunnel by 2028 will aid in bringing all China under India's nuke range
కళ్లు చెదిరే సొరంగ వ్యూహంతో చైనాకు కేంద్రం చెక్!

యావత్‌ ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తూ ఉంటే గల్వాన్‌లో భారత సైనికులపై దాడి, సరిహద్దుల ఆక్రమణ వంటి చిల్లర చేష్టలతో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది డ్రాగన్‌. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికకు పథక రచన చేసింది. అసోంలో బ్రహ్మపుత్ర నది కింద సొరంగ మార్గం అనే ఊహించ సాధ్యం కాని ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా చైనా సరిహద్దులకు సమీపంలో అత్యాధునిక ఆయుధాల తరలింపును సులభ సాధ్యం చేయడం సహా... యావత్‌ చైనాను భారత అణ్వస్త్ర పరిధిలోకి తీసుకురావడం కేంద్రం వ్యూహం.

సూత్రప్రాయ అంగీకారం

చైనాకు దగ్గరగా ఉండే అరుణాచల్‌ ప్రదేశ్‌కు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద 15 కిలోమీటర్ల పొడవునా ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలనేది కేంద్రం ప్రణాళిక. అసోంలోని నుమాలీగర్‌ వద్ద ఉన్న బ్రహ్మపుత్ర దక్షిణ తీరం నుంచి అదే రాష్ట్రంలోని గోహ్‌పుర్‌ వద్ద ఉన్న ఉత్తర తీరం వరకు ఈ సొరంగ మార్గం ఉంటుంది. నాలుగు లైన్లు ఉండే ఈ సొరంగ మార్గాన్ని 2028లోపు నిర్మించాలని కేంద్రం వ్యూహం రచిస్తోంది. ఇందుకు సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపింది. 2019 అక్టోబర్‌లో అంతర్జాతీయ టెండర్ల కోసం రిక్వెస్ట్‌ఫర్‌ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. గత ఏడాది బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ కూడా పార్లమెంటరీ ప్యానెల్‌కు ఈ సొరంగ మార్గంపై పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించింది. ఈ ప్రాజక్టుపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకున్నా అసోం ప్రసార మాధ్యమాలు అనేక వివరాలు వెల్లడించాయి.

అలా జరిగితే కష్టం

బ్రహ్మపుత్ర నదిపై ఇప్పటికే పలు వంతెనలు ఉన్నాయి. ఒక వేళ చైనాతో యుద్ధం వంటి పరిస్ధితులు తలెత్తితే చైనా ఈ వంతెనలను మొదటగా లక్ష్యంగా చేసుకుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అప్పుడు వాస్తవాధీన రేఖ వద్దకు ఆయుధ సంపత్తిని తరలించడం సాధ్యం కాదు. అసోంలో భారత్‌కు పలు సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ అగ్ని-2, అగ్ని-3, బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థను నిర్వహిస్తున్నారు. అగ్ని-2 పరిధి 3,500 కిలోమీటర్లు కాగా, అగ్ని-3 క్షిపణి 5 వేల కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది. ఇక బ్రహ్మోస్‌ పరిధి 300 కిలోమీటర్లు. వీటన్నింటినీ రోడ్డు, రైలుపై నుంచి కూడా ప్రయోగించవచ్చు.

చైనా లక్ష్యాన్ని దెబ్బకొట్టేందుకు

అయితే భారత్‌కు సమీపంలో ఉన్న తమ దేశంలోని కోర్లా, ఝింజియాంగ్‌, ఉయఘుర్‌, జియాన్‌షుయ్‌ ప్రాంతంలో అంత కంటే ఎక్కువ పరిధి కలిగినన డీఎఫ్-21, డీఎఫ్-31, డీఎఫ్-31ఏ వంటి 104 క్షిపణులను చైనా మోహరించింది. ఇవన్నీ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని మోహరించినవే. అందుకే యుద్ధం వస్తే సరిహద్దుల వద్దకు ఆయుధ సంపత్తిని, సైన్యాన్ని తరలించడం చాలా ముఖ్యం. ఇందుకు బ్రహ్మపుత్ర నది కింద నిర్మించబోయే సొరంగ మార్గం చాలా కీలకం అని భావిస్తోంది కేంద్రం.

పైచేయి కోసం

ఈ సొరంగం పూర్తయితే యావత్‌ చైనా భారత అణు క్షిపణి వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. యుద్ధ సమయంలో సైన్యాన్ని, ఇతర ఆయుధ సంపత్తిని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల వద్దకు తరలించడం కూడా సులభం అవుతుంది. అలా ఈ సొరంగ మార్గం చైనాపై పైచేయి సాధించడంలో తిరుగులేని దారిగా మారుతుంది. బ్రహ్మపుత్ర ఉత్తర, దక్షిణ తీరం మధ్య ప్రజల రాకపోకలకు, ఇతర రవాణా సౌకర్యాలకు కూడా వీలు కలుగుతుంది. అందుకే ఈ సొరంగ మార్గాన్ని భారత్‌ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

నది కింద సొరంగ మార్గం అంటే అది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అయినా తరచూ కవ్వింపు చర్యలతో పంటి కింద రాయిలా మారిన చైనాపై పైచేయి సాధించడం సహా బహుళ ప్రయోజనాలు కల్గే ఈ సొరంగ మార్గాన్ని నిర్దేశిత సమయంలోపు పూర్తి చేసి ముందే జాగ్రత్త పడాలని కేంద్రం భావిస్తోంది.

(రచయిత- సంజీవ్ బారువా)

ఇదీ చదవండి- డోక్లాం కోసం చైనా ఆరాటం- భూటాన్​తో 'దౌత్య' పోరాటం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.