ETV Bharat / opinion

భావప్రకటనకు ప్రతిబంధకంగా ఐటీ చట్టంలో ఆ సెక్షన్​!

author img

By

Published : Jul 7, 2021, 8:27 AM IST

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ రాజ్యాంగ విరుద్ధమైనదని ఆరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. స్వేచ్ఛాలోచనకు ప్రతిబంధకమై, పౌరుల భావ ప్రకటనా హక్కును హరిస్తున్న ఆ నల్ల నిబంధనను కొట్టేస్తూ 2015 మార్చిలో చరిత్రాత్మక తీర్పిచ్చింది. వాక్‌ స్వాతంత్య్ర పతాకాన్ని ఎత్తిపట్టిన ఆ విశిష్ట తీర్పు క్షేత్రస్థాయిలో కొల్లబోతోందన్న చేదు వాస్తవం నేడు సర్వోన్నత న్యాయస్థానాన్నే విస్మయపరుస్తోంది!

Article 66A of the Constitution of India
ఐటీ చట్టం 66 ఏ

అంతర్జాలంలో అభిప్రాయాల వెల్లడిపై కరకు ఆంక్షల కత్తులను వేలాడదీసిన ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ 'రాజ్యాంగ విరుద్ధమైనది' అని ఆరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. స్వేచ్ఛాలోచనకు ప్రతిబంధకమై, పౌరుల భావ ప్రకటనా హక్కును హరిస్తున్న ఆ నల్ల నిబంధనను కొట్టేస్తూ 2015 మార్చిలో చరిత్రాత్మక తీర్పిచ్చింది. వాక్‌ స్వాతంత్య్ర పతాకాన్ని ఎత్తిపట్టిన ఆ విశిష్ట తీర్పు క్షేత్రస్థాయిలో కొల్లబోతోందన్న చేదు వాస్తవం నేడు సర్వోన్నత న్యాయస్థానాన్నే విస్మయపరుస్తోంది! సెక్షన్‌ 66ఏ కింద నేటికీ కేసులు నమోదవుతున్నాయని, న్యాయస్థానాల్లో వాటిపై విచారణలూ సాగుతున్నాయన్న పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) అర్జీపై స్పందిస్తూ- యంత్రాంగం తీరును 'సుప్రీం' ఈసడించింది.'జరుగుతున్నదంతా ఘోర'మని వ్యాఖ్యానించిన న్యాయపాలిక- రెండు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు చెత్తబుట్ట పాల్జేసిన సెక్షన్‌ 66ఏ కింద ఆ తరవాత 11 రాష్ట్రాల్లో 1307 కేసులు నమోదుకావడం- న్యాయపాలిక విస్పష్ట ఆదేశాలను పోలీసు యంత్రాంగం ఎంతగా అపహాస్యం చేసిందో కళ్లకు కట్టింది! 381 కేసులతో మహారాష్ట్ర, దాని వెనకే ఝార్ఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు బిగించిన వైనం ఆందోళన రేపుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు సైతం 53 కేసులతో ఈ దుష్కీర్తిలో భాగం పంచుకోవడం కలవరపరుస్తోంది. శ్రేయా సింఘాల్‌ కేసులో సెక్షన్‌ 66ఏ ను కొట్టేస్తూ తానిచ్చిన తీర్పు అమలు కావడం లేదన్న విషయం 2019లోనే సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. దానిపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం- కేసుల నమోదు ఆగకపోతే కఠిన చర్యలు తప్పవని కన్నెర్రచేసింది. 2015 నాటి తన తీర్పు ప్రతులను దిగువ న్యాయస్థానాలకు పంపాలని అన్ని హైకోర్టులకు చెప్పడమే కాదు, ఆ మేరకు పోలీసులకూ అవగాహన పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సర్వోన్నత న్యాయపాలిక ఇంతగా చొరవ తీసుకున్నా సరే, పౌరహక్కుల హననానికి అడ్డుకట్ట పడకపోవడమే ఆందోళనకరం!

'భావ ప్రకటనా స్వేచ్ఛను కోల్పోయిన మరుక్షణంలో మనం మౌనంగా వధశాల బాటపట్టే గొర్రలమైపోతా'మని అమెరికా తొలి అధ్యక్షులు జార్జి వాషింగ్టన్‌ హెచ్చరించారు. స్వేచ్ఛగా ఆలోచించడం, తెలుసుకోవడం, అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించడాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా ఉద్ఘాటిస్తున్న రాజ్యాంగ స్ఫూర్తికి సెక్షన్‌ 66ఏ గొడ్డలిపెట్టుగా మారిందని ప్రజాస్వామ్యవాదులెందరో లోగడ గళమెత్తారు. బాల్‌ఠాక్రే మరణం తరవాత ముంబయి మహానగరమంతటినీ 'బంద్‌' చేయడంపై ఫేస్‌బుక్‌లో ప్రశ్నించిన షహీన్‌ బాహ్దా, 'లైక్‌' రూపంలో ఆమెను సమర్థించిన స్నేహితురాలు రీణూ శ్రీనివాసన్‌లపై ఠాణే పోలీసులు 66ఏ కత్తిగట్టారు! ఆ ఇద్దరమ్మాయిల అరెస్టుకు ముందు, ఆ తరవాత సైతం సామాజిక మాధ్యమాల్లో 'అభ్యంతరకర' పోస్టులు చేశారంటూ దేశవ్యాప్తంగా అనేక మందిపై పోలీసులు కేసులు పెట్టారు.

మహారాష్ట్ర కార్టూనిస్టు ఆసీమ్‌ త్రివేది నుంచి పశ్చిమ్‌ బంగ ప్రొఫెసర్‌ అంబికేశ్‌ మహాపాత్ర వరకు ఎందరో ఈ అర్థరహిత ఆంక్షల కొరడా బారిన పడినవారే! విభిన్న భావాలు సంఘర్షిస్తేనే ప్రజాస్వామ్యం వికసిస్తుందన్న యథార్థాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించే నేతాగణాల అసహనమే ఈ అరాచకత్వానికి ఆజ్యంపోసింది! సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా తొలగిపోవాల్సిన ఈ దుస్థితి ఇప్పటికీ అలాగే తిష్ఠవేయడం- ప్రజాస్వామ్య పునాదులనే కదలబారుస్తోంది. రాజద్రోహం వంటి నల్లచట్టాలతో చైతన్యపూరిత గళాలకు ఉరితాళ్లు పేనిన తెల్లదొరల పెడపోకడలను పుణికి పుచ్చుకొన్న భ్రష్టపాలనా పద్ధతులు స్వతంత్ర భారతంలో కొనసాగడం హేయం!

ఇదీ చూడండి: నేడే మంత్రివర్గ విస్తరణ- పూర్తైన కసరత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.