ETV Bharat / opinion

నిర్బంధితులపై నిఘా... సమతూకమే కీలకం - Live Coronavirus updates

కరోనా లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని పలుసార్లు విజ్ఞప్తులు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. సమస్యలోని తీవ్రత కారణంగా కొవిడ్ లక్షణాలు ఉన్నాయా అంటూ ఇంటింటికి తిరిగి వాకబు చేయిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకోని కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ సిబ్బందిపై తిరగబడటమో, పట్టించుకోకుండా ఉండిపోవడమే చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యపూరిత, బాధ్యతరాహిత్య వైఖరి తమకే కాదు. చుట్టూ ఉన్న సమాజానికి చేటు చేస్తుంది. అయితే ప్రభుత్వంలోని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ వ్యక్తిగత గోప్యతా ప్రమాణాలను పాటించడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. ఈ కరోనా సమయంలో విస్తృత ప్రజాప్రయోజనాల కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

corona spy
నిర్బంధితులపై నిఘా.. సంక్షోభంలో ప్రజారోగ్యం
author img

By

Published : Apr 18, 2020, 10:09 AM IST

ప్రభుత్వం, పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా కొందరు తబ్లీగీ మర్కజ్‌ అనుయాయులు వైద్యం చేయించుకోకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కొవిడ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నాయా అని వాకబు చేస్తున్న ఆశా వర్కర్లపై కొంతమంది బెదిరింపులకు, దుర్భాషలకు దిగుతున్నారు. చాలామంది జనం లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీదకు వస్తున్నారనీ, స్వీయ నిర్బంధాన్ని ఖాతరు చేయడం లేదనీ పత్రికలు, టీవీలు ఘోషిస్తున్నాయి. కొద్దిమంది బాధ్యతారాహిత్యం కోట్లమందిని కరోనా కోరల్లోకి నెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా లేక నిఘాను తీవ్రం చేసి రోగ వ్యాపకుల ఆటకట్టించాలా అన్నది వెంటనే తేల్చుకోవాలి.

నిఘా నీడతోనే..

జనబాహుళ్యంపై అనుక్షణం నిఘా, నిర్బంధాలు చైనాలో మాదిరిగా ప్రజాస్వామ్యాలలో కుదరవని భావిస్తాం. కానీ, కొవిడ్‌ దెబ్బకు దక్షిణ కొరియా వంటి ప్రజాస్వామ్య దేశమూ నిఘాను ముమ్మరం చేయాల్సి వచ్చింది. చైనాలా సింగపూర్‌ కూడా కొవిడ్‌ పీడితులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవర్ని కలిశారు అనే అంశాలను స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ల సాయంతో పసిగడుతోంది. ఇజ్రాయెల్‌ తన ఉగ్రవాద నిరోధక సంస్థకున్న అధునాతన సాంకేతికతను దీనికి ఉపయోగిస్తోంది.

corona spy
హెచ్చరిక బోర్డులు

కట్టడి చేయడమే లక్ష్యం

కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు కరోనా సోకిందనే అనుమానంతో క్వారంటైన్‌లో ఉన్నవారి వ్యక్తిగత వివరాలను రాజస్థాన్‌ ప్రభుత్వం వార్తా పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ప్రకటిస్తోంది. అజ్మీర్‌లో 46 మంది కరోనా అనుమానితుల పేర్లు, చిరునామాలను స్థానిక హిందీ దినపత్రికల్లో వెలువరించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో స్వీయ గృహనిర్బంధంలో ఉన్న 300 మంది వ్యక్తుల వివరాలు సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యాయి. దిల్లీ, చండీగఢ్‌లలో కరోనా అనుమానితుల ఇళ్ల ముందు అతికించిన పోస్టర్లలో వారి పేర్లు, స్వీయ నిర్బంధ కాలం, కుటుంబ సభ్యుల సంఖ్య, ఫోన్‌ నంబర్ల వంటి వివరాలను బహిర్గతపరిచారు. ‘కొవిడ్‌ హెచ్చరిక: ఈ ఇల్లు క్వారంటైన్‌లో ఉంది. లోనికి రాకండి’ అని సదరు పోస్టర్లు హెచ్చరిస్తున్నాయి.

ఆయా రాష్ట్రాల కార్యక్రమాలు..

పంజాబ్‌లో మొహాలీ జిల్లా యంత్రాంగమైతే కరోనా అనుమానితులు, వారి కుటుంబ వివరాలను ఏకంగా తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ముంబయి, ఒడిశాలు కూడా ఇదే బాట పట్టాయి. కర్ణాటకలో గృహ నిర్బంధంలో ఉన్న కరోనా అనుమానితులు నిర్ణీత సమయంలో గంటకోసారి సెల్ఫీ దిగి మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వానికి పంపాలి. సెల్ఫీ దిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నదీ జీపీఎస్‌ ద్వారా తెలిసిపోతుంది. సెల్ఫీ పంపనివారిపై క్రిమినల్‌ కేసు పెట్టవచ్ఛు ముఖ గుర్తింపు, జియో ఫెన్సింగ్‌లను ఉపయోగించి కరోనా అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టే యాప్‌ను తమిళనాడు పోలీసులు ఉపయోగిస్తున్నారు. ప్రతి కరోనా అనుమానితుడు తన ముఖాన్ని, తానున్న ప్రదేశాన్నీ యాప్‌లో లోడ్‌ చేయాలి. ఆపైన పోలీసులు రోజులో రెండు మూడుసార్లు తమ ఇష్టం వచ్చిన సమయంలో యాప్‌లో ఉన్న అనుమానితుల ముఖాలను తనిఖీ చేస్తారు. కరోనా అనుమానితులు ఇంటికి 10 నుంచి 100 మీటర్లలోపు మాత్రమే తిరగాలి. ఈ కంచె (జియోఫెన్సింగ్‌) దాటితే పోలీసులకు వెంటనే హెచ్చరిక సంకేతం వెళ్లిపోతుంది. తమిళనాడులో అనేక జిల్లాల్లో ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొవిడ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ యాప్‌ కరోనా అనుమానితుల ఆనుపానులపై నిఘా సమాచారాన్ని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖలకు తెలియజేస్తుంది. కరోనా అనుమానితులు క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవారి కదలికలు బ్లూటూత్‌, లొకేషన్‌ ట్రాక్‌ ద్వారా అధికారులకు తెలిసిపోతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రక్రియను ప్రజారోగ్య నిఘాగా వర్ణిస్తోంది. కరోనా వాహకుల నుంచి సాధారణ ప్రజలకు వ్యాధి సోకకుండా చూడటానికి ఇది అవసరమంటోంది.

సమతూకం ఆవశ్యకం..

భారతదేశంలోని 130 కోట్ల జనాభా జీవితాలను, జీవనాధారాలను పరిరక్షించడానికి కరోనా వ్యాప్తిపై నిఘాను తీవ్రతరం చేయకతప్పడం లేదు. కానీ, ఇది వ్యక్తిగత గోప్యతా హక్కుకు భంగకరమని పౌర హక్కుల సంరక్షకులు ఆందోళన చెందుతున్నారు. అతి కొద్దిమంది గోప్యతా హక్కును, అత్యధికుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను సమతుల్యపరచడమెలా అన్నది నేటి సవాలు. దీన్ని పరిష్కరించేటప్పుడు ప్రభుత్వాలు స్వీయ సంయమనం, సమతూకాలను పాటించడం ఆవశ్యకం. మరోవైపు కొవిడ్‌ నీడలో సైబర్‌ నేరాలు పెచ్చరిల్లుతున్నందున వ్యక్తులు కూడా స్మార్ట్‌ ఫోన్లను, యాప్‌లను వాడేటప్పుడు అత్యంత జాగరూకత ప్రదర్శించాలి. కొవిడ్‌ బాధితులకు సహాయం కోసం ఏర్పరచిన పీఎం కేర్స్‌ పేరుతో నకిలీ నిధులను ఏర్పాటుచేసి విరాళాలు దండుకొంటున్న కేసులు వెలుగుచూశాయి. బ్యాంకు ఈఎంఐలపై ప్రకటించిన మారటోరియాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థిక మోసాలకు పాల్పడేవారూ ఎక్కువయ్యారు. కొవిడ్‌ గురించి సమాచారాన్ని అందించే యాప్‌లలో మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టి ఖాతాల నుంచి డబ్బు కొట్టేస్తున్న ఘటనలూ పెరిగాయి. మాస్కులు తయారుచేసే కర్మాగారాల స్థాపనకు పెట్టుబడులు కావాలంటూ బురిడీ కొట్టించేవాళ్లూ తయారయ్యారు. ప్రజలు వీరి బారి నుంచి తప్పించుకొంటూ కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వాలకు సహకరించాలి.

corona spy
సామాజిక మాధ్యమాలు

సామాజిక దుర్విచక్షణ

కానీ, కరోనా బూచిని చూపి ప్రభుత్వాలు జనజీవితాలపై నిత్యం నిఘా వేయడం వ్యక్తుల గోప్యతా హక్కులకు భంగకరమని పౌర హక్కుల కార్యకర్తలు బలంగా వాదిస్తున్నారు. ఆరోగ్య సేతు యాప్‌ను కొవిడ్‌ ఉపద్రవం తొలగిపోయిన తరవాత కూడా ప్రభుత్వం ఉపయోగించదనే భరోసా ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆరోగ్య సేతు యాప్‌కు ఒక పరిమితి లేకపోలేదు. ఏకకాలంలో అత్యధికులు ఈ యాప్‌ను వాడితే తప్ప కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించలేం. పల్లె జనం ఎక్కువగా ఉండే భారతదేశంలో ఈ యాప్‌ వల్ల ఎంతమేరకు ప్రయోజనం ఉంటుందో చెప్పలేం. కరోనా పీడితుల, అనుమానితుల వివరాలను బహిరంగపరచడం కొత్త తరహా అంటరాని తనానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా అనుమానితుల వివరాలు బట్టబయలైతే వారు ఉద్యోగాలు కోల్పోవచ్చు, పరాయివాళ్ల బెదిరింపులకు, ఇరుగుపొరుగువారి ఛీత్కారాలకు, సామాజిక వెలికీ ఎరకావచ్ఛు చాలాచోట్ల కరోనా రోగులకు చెరగని సిరాతో ముద్రలు వేసి 14 రోజులపాటు క్వారంటైన్‌కు పరిమితం చేస్తున్నారు. ఇది కూడా సామాజిక వెలితో సమానమే. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక వ్యక్తికి కరోనా నెగెటివ్‌ వచ్చినా సామాజిక వెలికి గురయ్యాననే వ్యధతో ఆత్మహత్య చేసుకున్నారు. హక్కుల కోసం ఉద్యమించేవారి ముఖాలను ప్రభుత్వం దగ్గరున్న ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సుల డేటా బేస్‌లతో సరిపోల్చి వారిని నిర్బంధంలోకి తీసుకోవచ్చని ప్రతిపక్షాల భయం.

రహస్యంగా పరీక్షలు

కొవిడ్‌ సంక్షోభ సమయంలో సేకరించే వ్యక్తిగత వివరాలను ప్రత్యేక సర్వర్లలో భద్రపరచి, వ్యాధి నుంచి దేశం విముక్తమయ్యాక ఆ డేటాబేస్‌ను చెరిపివేయడం ఉత్తమమని పౌర హక్కుల సంరక్షకులు సూచిస్తున్నారు. ఇలాంటి వాదాలను గమనంలోకి తీసుకుని అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరం పోలీసులు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించరాదని గతేడాది నిషేధం విధించారు. భారత ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత వివరాలను ఏయే సందర్భాల్లో ఏ విధంగా ఉపయోగించవచ్చో నిర్దేశించే న్యాయపరమైన చట్రాన్ని వెంటనే ఏర్పరచుకోవాలి.

రచయిత: వరప్రసాద్

ఇదీ చూడండి: 'మహా'నగరంలో కరోనా గుబులు మొదలైందా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.