LIVE : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - BRS leaders pressmeet live
🎬 Watch Now: Feature Video
Published : Jan 19, 2024, 1:06 PM IST
|Updated : Jan 19, 2024, 1:34 PM IST
బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల కసరత్తు కొనసాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా సన్నాహక సమావేశాలకు వస్తున్నారు. ముఖ్య నేతలు వారికి దిశానిర్ధేశం చేయడంతో పాటు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ భోజన విరామం అనంతరం వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఒక్కో సమావేశంలో 20 నుంచి 40 మంది వరకు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. అటు నేతలు, కార్యకర్తల నుంచి వస్తున్న అభిప్రాయాలు, సూచనలను పార్టీ అధినేత కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మెదక్ లోక్‌సభ నియోజకవర్గంపై సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ ఎంపీ స్థానం పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో, కేటీఆర్, హరీశ్‌రావు, సీనియర్ నేతలు చర్చలు జరపుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, వ్యూహాలపై సమవేశంలో చర్చిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.