ETV Bharat / lifestyle

మొక్కల ఆరోగ్యానికి.. గుప్పెడు తులసి! - tulsi usages latest

మొక్కలను ఇంట్లో పెంచుకున్నప్పుడు వాటికి చీడపీడలు ఆశిస్తే... రసాయన మందులు కొట్టలేం. మరి ఇలాంటప్పుడు సహజంగా వాటిని ఎలా అరికట్టొచ్చు అంటే...

tulsi
tulsi
author img

By

Published : Aug 9, 2020, 9:40 AM IST

  • రెండు వెల్లుల్లిపాయలని చితక్కొట్టి ఓ సీసాలో వేయండి. దానికి ఒక చెంచా దాల్చిన చెక్క పొడినీ జత చేయండి. ఉదయాన్నే ఆ నీటిని మొక్కలపై పిచికారీ చేసి చూడండి. ఫలితం ఉంటుంది.
  • రెండు చెంచాల బేకింగ్‌ సోడాని లీటరు నీటిలో కలపాలి. దీనికి చెంచా ద్రవరూప సబ్బుని జతచేయాలి. ఈ నీటిని మొక్కలపై స్ప్రే చేస్తే....బూడిద తెగులుకి పరిష్కారం ఉంటుంది.
  • కీటకాలు వాలుతూ తోటలని నాశనం చేస్తుంటే...ఇంట్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ ఉంటే దాన్ని స్ప్రే సీసాలో వేసి చల్లితే అవి రాకుండా ఉంటాయి.
  • లీటరు నీటిలో గుప్పెడు చొప్పున తులసి, వేపఆకుల్ని వేసి మరిగించాలి. వీటికి కొద్దిగా యూకలిప్టస్‌ ఆయిల్‌ని చేర్చి మొక్కలపై చల్లితే చీడపీడల్ని మొదట్లోనే అరికట్టవచ్చు.
  • రెండు చెంచాల రాళ్ల ఉప్పుని గ్లాసు నీళ్లల్లో కలిపి మొక్కలపై చల్లినా ఫలితం ఉంటుంది. అయితే మరీ ఎక్కువగా వాడితే మొక్క వాడిపోయే ప్రమాదమూ ఉంటుంది.
  • చెంచా కారాన్ని తీసుకుని దాన్ని రెండు చెంచాల ద్రవ రూప సబ్బు నీటిలో కలిపి రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి నీళ్లు కలిపి స్ప్రే బాటిల్‌లో నింపి మొక్కలపై చల్లితే పురుగులు దరిచేరవు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.