ETV Bharat / lifestyle

యూట్యూబ్‌లో ఇంటిపనులు నేర్పిస్తూ కాసులు పండిస్తున్నారు! - యూట్యూబ్‌లో కాసులు పండిస్తున్నారు!

ఆసక్తి కోసం.. ఆరోగ్యం కోసం.. తోటపని బాట పట్టారు. అభిరుచితో తమ లోగిలిని పచ్చని తోటలుగా మార్చేసిన ఈ సామాన్య గృహిణులు.. ఆ పాఠాలను యూట్యూబ్‌లో చెప్పేస్తున్నారు! ఇంట్లోనే ఉండి రెండు చేతులా ఆదాయమూ సంపాదిస్తున్నారు. తమ తోటపనితో ఎందరికో స్ఫూర్తినిస్తున్న ఈ ఇద్దరు తోటమాలినిలు.. ఇప్పుడు యూట్యూబ్‌ రాణులు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

they became youtube stars by teaching cooking through youtube
యూట్యూబ్‌లో ఇంటిపనులు నేర్పిస్తూ కాసులు పండిస్తున్నారు!
author img

By

Published : Jul 20, 2020, 2:10 PM IST

తెలంగాణ జిల్లాల్లో నీళ్లావకాయ పెడతారు. ఓ రోజు సరదాగా యూట్యూబ్‌లో కొట్టి చూశా. ఒక్క వీడియో కూడా రాలేదు. దాంతో దాన్ని అందరికీ పరిచయం చేయాలని మా పెద్దపాపని వీడియో తీయమన్నాను. నిజానికి అప్పటి వరకూ యూట్యూబ్‌లో ఛానల్స్‌ ఉంటాయని కూడా నాకు తెలియదు. ‘నీకోసం ఓ ఛానల్‌ క్రియేట్‌ చేస్తున్నా. ఏం పేరు పెట్టనూ?’ అంది. కలగూరగంపలా ఏదో ఒకటి పెట్టు అనడంతో... అదే పేరుగా స్థిరపడిపోయింది.

మా అమ్మావాళ్లది వికారాబాద్‌ జిల్లాలోని ఓ పల్లెటూరు. అమ్మానాన్నలు ఇద్దరూ ఉద్యోగం చేసేవారు. దాంతో ఆదివారం కూడా వారికి మాతో పూర్తిగా గడిపే సమయం చిక్కేది కాదు. అందుకే నేను పదోతరగతిలో ఉండగానే ఎప్పటికీ ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నా.

ఎమ్మెస్సీ పూర్తిచేశా. ఓ బిజినెస్‌ ప్రారంభించా. రెండో పాప కడుపులో పడ్డాక వదిలేశా. నాకూ, మా వారికి సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది కల. చిలుకూరుకి వెళ్లేదారిలో నా కలల ఇల్లు నిర్మించుకున్నా. నిర్మాణంలో ఉండగానే పండ్ల మొక్కలు నాటా. తర్వాత ఇంటిని నందనవనంగా మార్చేశా.

ఆ వనంలో వాక్కాయలు, మునగ, పనస, మామిడి, కూరగాయలు, ఆకుకూరలు ఇలా 200 రకాలున్నాయి. ఆవు పేడనే ఎరువుగా వాడతా. పాతకాలపు సంప్రదాయాలు, రుచులు, మొక్కల పెంపకం నా వ్యాపకాలు. వాటినే యథాతథంగా తీసి యూట్యూబ్‌లో పెడుతున్నా.

చాలా తక్కువ కాలంలోనే చక్కటి ఆదరణ దొరికింది. రెండు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ వరకూ ఉన్నారు. ఇప్పటి వరకూ నా వీడియోలకు రెండుకోట్లకు పైగానే వ్యూస్‌ వచ్చాయి. దీని ద్వారా ఆదాయం వస్తుందని తెలియదు. యూట్యూబ్‌ వారు ఆరు నెలల మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేటప్పటికి నేనూ షాకయ్యాను. ఇలా నెలకు యాభైవేలకు పైగానే ఆదాయం అందుకుంటున్నా.

లాక్‌డౌన్‌ కొత్తదారి చూపించింది... - సాయిలీల

నాకోసం, నా ఆరోగ్యం కోసం మిద్దె సాగు మొదలుపెట్టా. అది ఇప్పుడు నాకో వ్యాపకంలా మారిపోయింది. నా దినచర్యను యూట్యూబ్‌ వ్యూయర్స్‌తో పంచుకోవాలన్న ఆలోచన మాత్రం లాక్‌డౌన్‌ కాలంలోనే వచ్చింది. మాది మహబూబ్‌నగర్‌ దగ్గర కల్వకుర్తి. నాన్న టీచర్‌. ఏ సందర్భం వచ్చినా అందరితో మొక్కలు నాటించేవారు. అదే మా ఇంట్లో అందరికీ ఆసక్తిని పెంచింది. పెళ్లి తరువాత హైదరాబాద్‌ వచ్చేశాం. ఇక్కడ మొక్కలు పెంచేందుకు పెద్ద జాగా ఉండేది కాదు.

మిద్దె మీద పెంచేదాన్ని. ఐదేళ్ల క్రితం నాకు థైరాయిడ్‌ వచ్చింది. ఐదుకిలోల బరువు పెరిగాను. డైట్‌ విషయంలో క్రమశిక్షణగా ఉంటా. నాకెందుకిలా జరిగిందని ఆలోచించి... రసాయనాలు లేని పండ్లు, కూరగాయలు వాడాలనుకున్నా. కానీ, అవి దొరకడమే కష్టం. ఒకవేళ దొరికినా.. బోలెడు ఖరీదు. అందుకే మిద్దెతోటలో పెంచాలని నిర్ణయించుకున్నా.

పాత డబ్బాల వంటివన్నీ కుండీల్లా అందంగా మార్చుకున్నా. వాటిలో ఆకుకూరలు, కాయగూరల్ని పెంచా. క్రమంగా విస్తరించడం మొదలుపెట్టా. మరోపక్క బొటిక్‌ నిర్వహిస్తా. ఇల్లు, తోట, బొటిక్‌ పనులతో తీరిక ఉండేది కాదు. లాక్‌డౌన్‌ వల్ల ఖాళీ దొరకడంతో... ఓ రోజు మా చిన్నమ్మాయి 'అమ్మా! నువ్వు చేసే పని నలుగురికీ స్ఫూర్తినిస్తుంద’ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టేందుకు ఒప్పించింది. పెద్దపాప ఎడిటింగ్‌ చేస్తుంది. అలా సాయిలీల వ్లోగ్స్‌ ఛానల్‌ మొదలుపెట్టా.

మూడునెలల్లో సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య రెండు లక్షలకు చేరింది. ఈ మధ్యే యూట్యూబ్‌ పేమెంట్‌కి అర్హత సాధించా. నెలకు రూ.20వేలకు పైగా అందుకుంటున్నా. మా మిద్దెతోటలో 25 రకాల పళ్లు, 30 రకాల కూరగాయలతో పాటు మునగ, పనస, రుద్రాక్ష, అశ్వగంథ వంటివెన్నో ఉన్నాయి. వీటికి అవసరమైన ఎరువుల్నీ నేనే తయారు చేసుకుంటా'.

ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.