మిసెస్ పర్‌ఫెక్ట్ అనిపించుకోవడం బాగానే ఉంటుంది. కానీ అందరికీ అన్నీ అరచేతిలోకి అందించే సమయం ప్రతిసారీ మీకు ఉండకపోవచ్ఛు అలా చేయలేనప్పుడు వారు పరిస్థితిని అర్థం చేసుకోకపోగా మిమ్మల్నే అది చేయలేదు, ఇది లేదు అని నిందించే ప్రమాదం ఉంది. ఇంట్లో ఎవరిపనులు వారు పూర్తిచేసుకోవాలనే నిబంధనతోనే మీ పని మొదలుపెట్టండి. ఇవన్నీ మీ శ్రీవారు, పిల్లలతో సహా అందరూ దాన్ని అమలు చేసేలా చూసుకోండి. అవసరమైతే వారికి చేయందించడంలో తప్పులేదు.
- ఇంటిపనులు, కుటుంబ బాధ్యతలు, ఆఫీసు విధులు వంటివన్నీ ఒకదాని వెంట మరొకటి చేయడంలో మీరు మానసికంగా అలసిపోతారు. మల్టీ టాస్కింగ్ అనే పదం వినడానికి బాగుంటుంది కానీ ఆచరణలో మీపై ఒత్తిడిని పెడుతుంది. మీపని సామర్థ్యాన్ని, ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. అందుకే కాస్త విరామం, కొంత పనివిభజన వంటివి మీలో శక్తి సామర్థ్యాలను పెంచుతాయి.
- ప్రణాళికాబద్ధంగా ఏ పని చేసినా సులభంగానే పూర్తవుతుంది మీ లక్ష్యం. రోజు ప్రణాళికతో పాటు వారానికి కూడా ఓ ప్లాన్ తయారు చేసుకోండి. వంట మొదలుకుని దుస్తుల వరకూ అన్నింటా ఇది అమలయ్యేలా చూసుకోండి. ఒక్కరోజు తప్పినా ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయాన్నీ ఏర్పాటు చేసుకోండి. ఇవన్నీ మిమ్మల్ని స్మార్ట్ మహిళగా నిలబెడతాయి.
ఇదీ చూడండి: సుదీర్ఘంగా భారత్-చైనా సైనికాధికారుల చర్చలు