ETV Bharat / lifestyle

TIPS: వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఏం చేయాలంటే..?

వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన వస్తోందా.. అలా కాకుండా వానాకాలంలోనూ దుస్తులు సువాసన వెదజల్లుతూ.. తాజాగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అవేంటో చూసేయండి..!

TIPS: వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఏం చేయాలంటే..?
TIPS: వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఏం చేయాలంటే..?
author img

By

Published : Sep 10, 2021, 3:00 PM IST

కరోనా వచ్చిన దగ్గర్నుంచి కీర్తనకు ఇంటి పని తడిసి మోపెడవుతోంది. ఇక వాషింగ్‌ మెషీన్‌ ఉన్నా ఉతికే బట్టలు గుట్టలా పేరుకుపోవడం, దానికి తోడు ఈ వర్షాకాలంలో దుస్తులు సరిగ్గా ఆరకపోవడంతో ఆమెకు విసుగొచ్చేసింది. దీంతో ఆరీ ఆరనట్లున్న వాటిని అలాగే వార్డ్‌రోబ్‌లో పెట్టేసరికి వాటి నుంచి అదో రకమైన వాసన రావడం మొదలైంది.

దీప్తి, ఆమె భర్త దీపక్‌ ఇద్దరూ ఉదయం ఎప్పుడో ఆఫీసులకెళ్తే.. వచ్చేసరికి రాత్రవుతుంటుంది. రోజూ వాషింగ్‌ మెషీన్లో ఉతికిన బట్టలు బయట ఆరేయడం, వర్షానికి అవి కాస్తా తడిసిపోవడం.. ఇది వారికి అలవాటే! వర్షమొస్తుందేమోనని ఒక్కోసారి ఉతికిన బట్టల్ని ఇంట్లోనే ఆరేసి వెళ్తుంటారు. ఇలా ఈ రెండు కారణాల వల్ల దుస్తులు సరిగ్గా ఆరక వాటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. ఇల్లంతా అదే వాసన నిండిపోయింది.

.

ఇలా చెప్పుకుంటూ పోతే వర్షాకాలంలో ఉతికిన బట్టల విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. ఈ కాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల దుస్తులు ఆరుబయట కూడా సరిగ్గా ఆరవు. ముట్టుకుంటే ఆరినట్లుగా అనిపించినప్పటికీ.. వాటి పోగుల్లో తేమ ఇంకా నిలిచే ఉంటుంది. ఇక ఇలాంటి దుస్తుల్ని మడతపెట్టి వార్డ్‌రోబ్‌లో పెట్టామంటే వాటిలో ఫంగస్‌ వృద్ధి చెంది అదో రకమైన వెగటు వాసన రావడం, ఇదే వాసన తాజాగా ఉన్న బట్టలకూ పట్టడం, ఇళ్లంతా నిండిపోవడంతో విసుగొచ్చేస్తుంటుంది. మరి, అలాకాకుండా వానాకాలంలోనూ దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా, బట్టలు తాజాగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూసేద్దామా..?!

వెగటు వాసనను దూరం చేయాలంటే..!

.

* వర్షాకాలంలో సరిగ్గా ఆరని దుస్తుల నుంచి వచ్చే దుర్వాసనను నిమ్మరసంతో దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం కొద్ది నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాసన వచ్చే దుస్తులపై స్ప్రే చేసి కాసేపు అలాగే గాలిలో ఆరేయాలి. ఈ వెగటు వాసనకు కారణమైన ఫంగస్‌ను నశింపజేసి సువాసనను వెదజల్లేందుకు నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది.
* వెనిగర్‌లో ఉండే ఆమ్ల స్వభావం దుర్వాసనకు కారణమైన ఫంగస్‌ను నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి దుస్తులపై ఎక్కడైతే వెగటు వాసన వస్తుందనుకుంటే అక్కడ కాస్త వెనిగర్‌ వేసి రుద్దాలి. ఆపై కాసేపటికి శుభ్రమైన నీటిలో ఉతికి ఆరేస్తే జిడ్డులా అంటుకున్న ఆ వాసన వదిలిపోతుంది.

.

* ఈ కాలంలో దుస్తులతో పాటు అవి అమర్చిన వార్డ్‌రోబ్‌లో నుంచి కూడా అదో రకమైన వాసన వస్తుంటుంది. తేమగా ఉండే వాతావరణంతో పాటు గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇలాంటప్పుడు వార్డ్‌రోబ్‌ మూలల్లో కాస్త బేకింగ్‌ సోడా చల్లి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.
* సరిగ్గా ఉతక్కపోయినా, పూర్తిగా ఆరకపోయినా దుస్తులు దుర్వాసనను వెదజల్లుతాయి. ఇక వీటిని అలాగే వార్డ్‌రోబ్‌లో పెట్టేస్తే ఆ షెల్ఫ్స్‌ అన్నీ వాసనతో నిండిపోతాయి. అలాంటప్పుడు బ్లీచ్‌ చక్కగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ముందుగా వార్డ్‌రోబ్‌లో ఉన్న బట్టలన్నీ బయటికి తీసి.. బ్లీచ్‌ ద్రావణంలో ముంచిన తడిగుడ్డతో అరలన్నీ తుడిచేయాలి. ఆపై ఆరాక మళ్లీ దుస్తుల్ని ఎప్పటిలాగే సర్దేస్తే సరిపోతుంది. ఈ చిట్కా దుస్తుల దుర్వాసననూ దూరం చేస్తుంది.

ఇలా చేస్తే వాసన రావు!

.

* కొంతమంది బట్టల మురికి పోవాలన్న ఉద్దేశంతో గంటల తరబడి వాటిని నానబెడుతుంటారు. ఇంకొందరు తడిసిన దుస్తుల్ని రోజుల తరబడి ఉతకకుండా పక్కన పెట్టేస్తుంటారు. తద్వారా కూడా దుస్తుల నుంచి అదో రకమైన వాసన వస్తుంటుంది. ఇలా బట్టలు ఎక్కువ సమయం తడిగానే ఉండడం వల్ల వాటి నాణ్యతా దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని ఉతికేయడం మంచిది.
* ఇక వాషింగ్‌ మెషీన్‌లో లేదంటే చేత్తో ఉతికిన దుస్తులు ‘పనులన్నీ పూర్తయ్యాక ఆరేద్దాంలే’ అని వాటిని అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల కూడా దుస్తులు వాసన వస్తుంటాయి. అందుకే ఎంత బిజీగా ఉన్నా ఉతికిన వెంటనే వాటిని ఆరేయడం వల్ల అవి దుర్వాసన వెదజల్లకుండా ముందుగానే జాగ్రత్తపడచ్చు.

* వర్షం పడుతున్నా కొంతమందికి ఆరుబయట నీడలో ఆరేసే వెసులుబాటు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో వేసుకున్నా.. ఆ గదిలో గాలి బాగా ఆడేలా కిటికీలు, వెంటిలేషన్‌ సరిగ్గా ఉండేలా చూసుకుంటే దుస్తులు దుర్వాసన వెదజల్లవు.
* బట్టలు ఆరేసేటప్పుడు వెడల్పాటి హ్యాంగర్స్‌కి, ర్యాక్‌ డ్రయర్స్‌కి ఆరేసినా.. గాలి బాగా తగిలి సులభంగా ఆరేలా, వాసన రాకుండా జాగ్రత్తపడచ్చు.
* బట్టలు అమర్చుకునే వార్డ్‌రోబ్‌ మూలల్లో నాఫ్తలీన్‌ బాల్స్‌ వేయడం, ఏదైనా అత్యవసర నూనెను చల్లడం.. వంటివి చేసినా వార్డ్‌రోబ్‌లో నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడచ్చు.

ఫ్యాబ్రిక్‌ కండిషనర్స్‌ ఇంట్లోనే!

దుస్తుల నుంచి సువాసన రావాలని, అవి కొత్తగా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో చాలామంది ఫ్యాబ్రిక్‌ కండిషనర్స్‌ని వాడుతుంటారు. అయితే బయట దొరికే కండిషనర్స్‌ కంటే ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్స్‌ని తయారుచేసుకోవచ్చు. దుస్తులు ఉతికిన తర్వాత ఆఖర్లో ఈ లిక్విడ్‌ కలిపిన నీటిలో వాటిని ఓసారి ముంచి తీసి ఆరేస్తే సరి! ఇక వాషింగ్‌ మెషీన్‌లో ఉతికే వాళ్లు రిన్సింగ్‌ సైకిల్‌లోకి రాగానే (అంటే ఉతకడం పూర్తై జాడించేటప్పుడు) ఈ కండిషనర్‌ని వేయాల్సి ఉంటుంది. మరి, ఇంతకీ వాటిని ఎలా తయారుచేసుకోవాలంటే..!

* వెనిగర్‌, బేకింగ్‌ సోడా.. ఈ రెండింటినీ టేబుల్‌స్పూన్‌ చొప్పున తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఒకసారి ఉతికేటప్పుడు ఉపయోగించడానికి సరిపోతుంది. ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకుందామనుకునే వారు.. ఈ రెండింటినీ సమపాళల్లో తీసుకొని కలుపుకొని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
* కొద్దిగా వెనిగర్‌లో కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె వేసి తయారుచేసిన మిశ్రమాన్ని ఫ్యాబ్రిక్‌ కండిషనర్‌గా వాడచ్చు. ఇదే మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి వాసన వచ్చే దుస్తులపైనా స్ప్రే చేసుకోవచ్చు. అలాకాకుండా నేరుగా వెనిగర్‌ను కూడా ఉపయోగించచ్చు.

.

* నేరుగా బేకింగ్‌ సోడాను కూడా ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్‌గా వాడచ్చు. లేదంటే దీనికి సమానంగా ఎప్సం సాల్ట్‌ని కలిపి మిశ్రమంగా తయారుచేసుకొని వాడచ్చు.
* కొద్దిగా ఎప్సం సాల్ట్‌లో కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె వేసి బాగా కలుపుకోవాలి. టీస్పూన్‌ మిశ్రమాన్ని నీటిలో కరిగించైనా వాషింగ్‌ మెషీన్‌లో పోయచ్చు.. లేదంటే నేరుగానైనా వేయచ్చు.
* కొద్ది మోతాదుల్లో బేకింగ్‌ సోడా, వెనిగర్‌ తీసుకొని అందులో కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె కలుపుకొని సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్‌ని తయారుచేసుకోవచ్చు.
చూశారుగా.. ఈ వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో! సో.. ఇవన్నీ మనమూ పాటిద్దాం.. దుస్తుల నాణ్యత దెబ్బతినకుండా జాగ్రత్తపడదాం.. వాటిని ఎక్కువ కాలం పాటు కొత్తగా, తాజాగా ఉంచుకుందాం..!

ఇదీ చూడండి: ఇలా చేయండి.. మీ ఇంటిని అందంగా, హాయిగా మలచుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.