మెటల్ బ్రష్ స్టిక్ రస్ట్ రిమూవర్
ఏ వస్తువైనా పెద్దపెద్దవి కాకుండా చేతిలో ఒదిగిపోయేంత చిన్నగా ఉండేవి కొనడానికే ఇష్టపడుతున్నారంతా! రస్ట్ రిమూవర్ విషయంలోనూ అంతే! అందుకోసమే ‘మెటల్ బ్రష్ స్టిక్ రస్ట్ రిమూవర్’ని డిజైన్ చేశారు. చిత్రంలో చూపించిన విధంగా పెన్సిల్ గీతల్ని చెరిపేసే ఎరేజర్‌లా ఉంటుందీ గ్యాడ్జెట్. చాక్లెట్ కాగితాన్ని కొద్దికొద్దిగా ఒలిచినట్టు.. దీని చుట్టూ ఉన్న ర్యాపర్‌ని కొద్దికొద్దిగా తొలగిస్తూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాస్త గరుకుగా బ్రష్ బ్రిజిల్స్ మాదిరిగా ఉండే దీని ఉపరితలంతో తుప్పు పేరుకున్న పాత్రపై నెమ్మదిగా రుద్దడం వల్ల క్రమక్రమంగా తుప్పు తొలగిపోతుంది. ఈ క్రమంలో బ్రిజిల్స్ కూడా రాలిపోయే అవకాశముంది కాబట్టి ర్యాపర్‌ని ఒలుస్తూ దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. చూడడానికి చిన్నగా ఉన్నా.. చక్కగా ఉపయోగపడే ఈ రస్ట్ రిమూవర్ నాణ్యతని బట్టి ధర రూ.250 నుండి రూ.450 వరకు ఉంటుంది.
రస్ట్ రిమూవింగ్, పాలిషింగ్ డ్రిల్ టూల్స్
పాత్రలపై లేదా పనిముట్లపై పేరుకుపోయిన తుప్పును తొలగించాలంటే కాస్త గరుకుగా ఉన్న టూల్స్ వాడాల్సి ఉంటుంది. అవి వాడడం వల్ల తుప్పు వదలడంతోపాటు.. పాత్రలపై గీతలు కూడా పడుతుంటాయి. తద్వారా పాత్ర లుక్ పోతుంది. మరి, ఓవైపు తుప్పును వదిలించడంతో పాటు.. ఈ క్రమంలో వాటిపై పడిన గీతల్ని కనిపించకుండా పాత్రల్ని పాలిష్ చేసే టూల్స్ ఉంటే బాగుంటుందనుకుంటున్నారా? అయితే ‘రస్ట్ రిమూవింగ్, పాలిషింగ్ డ్రిల్ టూల్స్’ మీకోసమే!
ఫొటోలో చూపించినట్లుగా వీటిలో వివిధ రకాల ఆకృతులు, పరిమాణాల్లో తుప్పును తొలగించే టూల్స్‌తో పాటు.. పాలిషింగ్ టూల్స్ కూడా లభ్యమవుతాయి. వాటిని మీ అవసరాన్ని బట్టి డ్రిల్లింగ్ మెషీన్‌కి అటాచ్ చేసి ఉపయోగించాలి. తుప్పును తొలగించడానికి ఉపయోగించే టూల్స్ బ్రిజిల్స్ చాలా రఫ్‌గా ఉంటాయి. డ్రిల్ మెషీన్ ఫాస్ట్‌గా తిరగడం వల్ల ఈ టూల్ ద్వారా పాత్రపై పేరుకుపోయిన తుప్పును ఈజీగా వదిలించేయచ్చు. ఆపై గీతలు కనిపించకుండా పాలిష్ చేయడానికి మృదువుగా ఉండే పాలిషింగ్ టూల్స్‌ని వాడితే సరి.. ఇలా అవసరాన్ని బట్టి టూల్స్ మార్చుకుంటూ ఉపయోగించాలి. టూల్స్ సంఖ్య, నాణ్యతని బట్టి ధర రూ.520 నుండి రూ.1300 వరకు ఉంటుంది.
రస్ట్ రిమూవింగ్ స్పాంజ్
ఒక్కోసారి పాత్రలపై పూతలా తుప్పు పేరుకుపోతుంది. దాన్ని తొలగించడానికి మరీ కఠినమైన టూల్స్ కాకుండా కాస్త రఫ్‌గా ఉండే స్పాంజ్ సరిపోతుంది. పైగా దీన్ని ఉపయోగించడం వల్ల గీతలు పడి పాత్ర లుక్ చెడిపోతుందన్న అనుమానమే అక్కర్లేదు. అలా మ్యాజిక్ చేసే స్పాంజ్ లాంటి రస్ట్ రిమూవర్ కావాలనుకునే వారికోసం డిజైన్ చేసిందే ఈ ‘రస్ట్ రిమూవింగ్ స్పాంజ్’.
చిత్రంలో చూపించిన విధంగా అచ్చం పాత్రలు తోమే స్క్రబ్బర్‌లా ఉంటుందిది. ముందుగా పాత్రపై కాస్త నీళ్లు చల్లి ఆపై ఈ స్పాంజ్‌ని ఉపయోగించి స్క్రబ్ చేయడం వల్ల పాత్రపై పూతలా పేరుకుపోయిన తుప్పు సులభంగా తొలగిపోతుంది. గీతలు కూడా పడవు. పాత్రలపై కొద్దిగా తుప్పు పేరుకున్నప్పుడు దాన్ని వదలగొట్టడానికి ఈ స్పాంజ్ చక్కగా ఉపయోగపడుతుంది. దీని నాణ్యతని బట్టి ధర రూ.220 నుండి రూ.950 వరకు ఉంటుంది.
రస్ట్ రిమూవింగ్ మెటాలిక్ బ్రషెస్
కేవలం తుప్పును తొలగించడానికి మాత్రమే కాకుండా మనం ఉపయోగించే రస్ట్ రిమూవర్‌తో మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉంటే బాగుంటుంది కదూ!! అలాంటివే ఈ ‘రస్ట్ రిమూవింగ్ మెటాలిక్ బ్రషెస్’. చిత్రంలో చూపించిన విధంగా ఇవి రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి మెటాలిక్ వైర్స్‌తో రూపొందించింది.. మరొకటి బ్రాస్ వైర్స్‌తో రూపొందించింది. వీటిని డ్రిల్లింగ్ మెషీన్ ముందు భాగంలో అటాచ్ చేసుకుని వాడుకోవచ్చు. బాగా కఠినమైన తుప్పును తొలగించాలంటే మెటాలిక్ వైర్స్‌తో తయారైన బ్రష్ సరైన ఎంపిక అని చెప్పచ్చు. ఇక సాధారణంగా పూతలా పేరుకున్న రస్ట్‌ని రిమూవ్ చేయాలంటే బ్రాస్ వైర్స్‌తో రూపొందించిన బ్రష్‌ను ఉపయోగించచ్చు. ఈ రెండు బ్రష్‌లతో తుప్పే కాదు.. వస్తువులపై పడిన పెయింట్ మరకల్ని సైతం తొలగించచ్చు. ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ రెండింటినీ ఉపయోగించి అటు తుప్పును.. ఇటు పెయింట్‌ను ఏకకాలంలో తొలగించుకోవచ్చు. వీటి నాణ్యతని బట్టి ధర రూ.210 నుండి రూ.599 వరకు ఉంటుంది.
స్టెయిన్‌లెస్ స్టీల్ వైర్ రస్ట్ రిమూవింగ్ బ్రష్
కఠినమైన తుప్పును వదిలించుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో గ్యాడ్జెట్ ‘స్టెయిన్‌లెస్ స్టీల్ వైర్ రస్ట్ రిమూవింగ్ బ్రష్’. చిత్రంలో చూపించిన విధంగా చూడడానికి కత్తి ఆకారంలో ఉంటుందీ బ్రష్. దీనికి ముందు భాగంలో స్టెయిన్‌లెస్ స్టీల్ బ్రిజిల్స్ ఉంటాయి. ఈ బ్రష్‌ని హ్యాండిల్‌తో పట్టుకొని పాత్రలపై పేరుకుపోయిన తుప్పుపై నెమ్మదిగా రుద్దడం వల్ల అది త్వరగా వదిలిపోతుంది. ఒకవేళ ఇలా రుద్దేటప్పుడు పాత్రపై గీతలు పడ్డట్లయితే పాలిషింగ్ టూల్స్‌ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ రిమూవింగ్ బ్రష్ నాణ్యతని బట్టి ధర రూ.230 నుండి రూ.600 వరకు ఉంటుంది.
ఇదీ చూడండి: ఓడిపోయానని కుంగిపోకండి.. తిరిగి ప్రయత్నించండి!