హెటళ్లు, రిసార్ట్లపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వాటి నిర్వహణ, ఉద్యోగుల వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. కేరళలోని కుమారకామ్‌లోగల అవేదా రిసార్ట్ అండ్ స్పా యాజమాన్యం ఓ ఆలోచన చేసింది. అక్కడున్న 150/50 విస్తీర్ణం గల ఈత కొలనును చేపల చెరువుగా మార్చేసింది. దాంతో జూన్‌లో ఈ రిసార్ట్‌లో ఉన్న కొలనులో రెండేళ్ల వయస్సు ఉన్న 16 వేల పెరల్ స్పాట్ చేప పిల్లలను వేశారు.
ఈ చేప పిల్లల పెంపకానికి కొంతమంది ఉద్యోగులను నియమించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. పెరల్ స్పాట్ చేపలకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో డిమాండ్ ఎక్కువ. నవంబరు కల్లా అవి పెద్దవైతే అక్కడకు ఎగుమతి చేస్తారు. దానివల్ల రిసార్ట్ యాజమాన్యానికి దాదాపు మూడున్నర కోట్ల దాకా ఆదాయం వస్తుందని అంచనా. ఆ డబ్బుతో రిసార్టులో పని చేసి ఖాళీగా ఉన్నవారికి సైతం ఆర్థికంగా చేయూత నివ్వాలని చూస్తోంది యాజమాన్యం. మంచి ఆలోచన కదూ!
- ఇదీ చూడండి : 'నాగర్కర్నూల్ అభివృద్ధికి పాటుపడుతా'