ETV Bharat / lifestyle

Life style: అన్యోన్య దాంపత్యానికి ఆ ఒక్క ఛాన్స్‌ ఇవ్వలేమా? - telangana varthalu

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. దానిని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న మనస్పర్థలు కూడా రావొచ్చు. కొన్నిసార్లు అవతలివాళ్లు చేసే పనులు మనకు నచ్చకపోవచ్చు. వారి మాటల వల్ల నొచ్చుకునే సందర్భాలూ రావొచ్చు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే.. కుటుంబాలు చిందర వందర అయిపోతాయి. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ పెర్‌ఫెక్ట్‌ కాదు. ప్రతి ఒక్కరిలోనూ మంచిచెడులుంటాయి. అందువల్ల అప్పటి వరకు ఎలా ఉన్నా.. వాళ్లలో మార్పు తీసుకొచ్చేందుకు మరొక్క అవకాశం ఇవ్వడంలో తప్పులేదంటారు పెద్దలు. అసలు ఆ ఒక్క అవకాశం ఎందుకివ్వాలి?

Life style: అన్యోన్య దాంపత్యానికి ఆ ఒక్క ఛాన్స్‌ ఇవ్వలేమా?

author img

By

Published : Dec 12, 2021, 4:23 PM IST

రాకేశ్‌ ఓ బిజినెస్‌ మ్యాన్.. బాగా సంపాదిస్తాడు. కానీ, ఇంటికొచ్చేసరికి అతడికి ఆనందం కరువవుతోంది. ఏదో ఒక రూపంలో భార్యతో గొడవ. చిన్న చిన్న పొరపాట్లకూ కసురుకుంటాడు. ఆ పక్క కాలనీలో ఉండే రాధ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. ఐదంకెల జీతం. ఆమె భర్త ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్. ఆయన ఎత్తిపొడుపు మాటలతో విసిగిపోతోంది. తెగతెంపులు చేసుకున్నా తప్పులేదన్న నిర్ణయానికి వచ్చేసింది. వైవాహిక జీవితమంతా సుఖసంతోషాలతో సాగిపోవాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ, భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకొని మసలుకున్నప్పుడే ఇది సాధ్యం. కొన్నిసార్లు అవతలివాళ్లు చేసే పనులు మనకు నచ్చకపోవచ్చు. వారి మాటల వల్ల నొచ్చుకునే సందర్భాలూ రావొచ్చు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే.. కుటుంబాలు చిందర వందర అయిపోతాయి. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ పెర్‌ఫెక్ట్‌ కాదు. ప్రతి ఒక్కరిలోనూ మంచిచెడులుంటాయి. అందువల్ల అప్పటి వరకు ఎలా ఉన్నా.. వాళ్లలో మార్పు తీసుకొచ్చేందుకు మరొక్క అవకాశం ఇవ్వడంలో తప్పులేదంటారు పెద్దలు. అసలు ఆ ఒక్క అవకాశం ఎందుకివ్వాలి?

1. క్షమించమని అడిగేలా చేసుకోవాలి!

ఏదో కోపంలో భాగస్వామి మిమ్మల్ని ఒక మాట అనొచ్చు. దాంతో మీ మనోభావాలు దెబ్బతినొచ్చు. అలాగని వెంటనే అవతలివాళ్లతో గొడవ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. వాళ్లంతట వాళ్లే తన తప్పును తెలుసుకొని, క్షమించమని అడిగేలా చేసుకోవాలి. దీనికోసం కొన్ని రోజులు వేచిచూసినా తప్పులేదు. కోపం తగ్గిన తర్వాత తనే మీదగ్గరకొచ్చి ‘సారీ’ చెప్పే అవకాశం ఉంది.

2. కోపమున్నా నమ్మకం కోల్పోం

భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అవతలివాళ్లు మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ, వారిపైనున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోం కదా. చిన్నపాటి కారణాలతో పచ్చని కాపురంలో నిప్పులు రాజేసుకోకూడదు. మీ జీవిత భాగస్వామి బాధించినప్పటికీ, వారిమీద మీకు సానుకూల దృక్పథం, నమ్మకం, ప్రేమ ఉంటే మరో ఛాన్స్‌ ఇవ్వడంలో తప్పేం లేదు.

3. స్నేహితులైనా చెప్పొచ్చు

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఒక స్థాయిని మించిపోతే.. చాలామంది స్నేహితుల సహకారం తీసుకుంటారు. ఆ తర్వాతే కుటుంబ సభ్యులదాకా వెళుతుంది. కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి సలహాలు అడగడంలో తప్పేం లేదు. అయితే, ఆ స్నేహితులు ఎలాంటివారు, వారిచ్చే సూచనలు సరైనవేనా అనేదే ముఖ్యం. మీ గురించి పూర్తిగా తెలిసిన వారెవరైనా ‘ఈ ఒక్కసారికి క్షమించి.. మరో ఛాన్స్‌ ఇవ్వొచ్చు కదా’ అనే చెప్తారు. అందులో అసలు తప్పేం లేదు. ఎదుటివారిలో ఏ విషయాలు తనని బాధించాయో కూర్చొని మాట్లాడుకుంటే సగం సమస్య తీరిపోయినట్లే.

4. తప్పు సరిదిద్దుకోవచ్చు..!

జీవిత భాగస్వామి తెలిసో తెలియకో కొన్నిసార్లు బాగా నష్టం చేకూర్చే పొరపాటే చెయ్యొచ్చు. అలాగని వారిని కసురుకోవడం మంచిది కాదు. ఆ తప్పును అవతలివారు సరిదిద్దుకోగలరన్న నమ్మకం మీకుంటే మరో అవకాశం ఇవ్వడానికి వెనకాడొద్దు. తప్పును గుర్తించి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే.. భవిష్యత్తులో ఏం చేయకూడదో ఓ నిర్ణయానికి వచ్చారన్న మాట. దీనివల్ల గొడవ మరింత పెద్దది అవ్వకుండా కాపురం నిలబడుతుంది.

5. కావాలనే బాధపెట్టరు కదా..!

భార్యాభర్తలెవరూ ఉద్దేశపూర్వకంగా ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలనుకోరు. అవతలివారు చేసిన పని నచ్చకో, ఏదో కోపంలోనో కొన్నిసార్లు అలా జరుగుతుంది. మిమ్మల్ని బాధించినంత మాత్రాన వాళ్లేం చెడ్డవారైనట్టు కాదు. పరిస్థితులను బట్టి ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారు. ఒక వేళ కోపగించుకున్నా.. ఆ తర్వాత వాళ్లు చెప్పేది వినాలి. అసలెందుకలా జరిగిందో అర్థం చేసుకొని నడచుకోవాలి. అలాంటప్పుడే కాపురం బాగుంటుంది.

6. ఎత్తి పొడవకూడదు!

అనుకోకుండా జీవిత భాగస్వామి ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టే ఉండొచ్చు. అలాగని బంధాన్ని తెంచుకోవడం మంచిది కాదు. గొడవ జరిగిన తర్వాత అవతలి వాళ్లు.. ఆ తప్పును తెలుసుకొని సైలెంట్‌ అయిపోతే, వాళ్లని ఇక ఎత్తి పొడవకూడదు. దానివల్ల ఎదుటి వారిలో మీపై వ్యతిరేక భావన మొదలవుతుంది. తప్పు తెలుసుకొని చింతించిన వారికి మరో అవకాశం ఇస్తే వచ్చే నష్టమేం లేదు. మీ కాపురమే మళ్లీ పచ్చగా చిగురిస్తుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.