ETV Bharat / lifestyle

Relationships: దాంపత్య జీవితం రొమాంటిక్​గా సాగాలంటే.. ఇలా చేయండి.! - ways to romantic relationship between couple

పెళ్లి ఒక మధురమైన అనుభూతి. ఒక కొత్త తరానికి నాంది. విభిన్న అభిరుచులు కలిగిన కుటుంబాల నుంచి వచ్చి.. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించుకుంటూ భార్యాభర్తలు ఆ దాంపత్య బంధాన్ని కొనసాగిస్తారు. ఈ క్రమంలో వారి మధ్య అలకబూనడాలు, పట్టించుకోవడం లేదనే ఆరోపణలు.. ఇవే కాదు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఆప్యాయతలు ఎన్నో చోటుచేసుకుంటాయి. ఇక ఇద్దరూ ఉద్యోగస్తులయితే ఆ ప్రేమలు, అలకలు కొంచెం తక్కువనే చెప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీ బంధం పదిలంగా ఉండాలంటే ఇవి పాటించండి..

ways to romantic relationship
దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే
author img

By

Published : Jun 30, 2021, 5:28 PM IST

దాంపత్య బంధంలో ప్రతి క్షణమూ భార్యాభర్తలిద్దరికీ ఎన్నో మరపురాని మధురానుభూతుల్ని పంచుతుంది. ఇక పెళ్త్లెన కొత్తలో అయితే ఇలాంటి మధుర భావనలకు అంతుండదంటే అది అతిశయోక్తి కాదు. 'నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను' అన్న రీతిలో ఒకరినొకరు కాసేపైనా వదిలిపెట్టకుండా సమయం గడుపుతుంటారు కొందరు. అదే మరికొందరైతే పెళ్త్లె పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే పని.. పని.. అంటూ తమ ఉద్యోగంపైనే శ్రద్ధ చూపిస్తుంటారు. ఫలితంగా భాగస్వామికి దగ్గర కావడానికి కూడా ప్రయత్నించరు. దీంతో తొలిరోజుల్లోనే వారి అనుబంధంలో అసంతృప్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి పెళ్త్లెన నాటి నుంచే దంపతులిద్దరూ వారి ఉద్యోగానికి ఓవైపు సమయం కేటాయిస్తూనే.. మరోవైపు ఒకరితో మరొకరు వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామనే భావన కలగడానికి కొన్ని పద్ధతులను పాటించాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

వీటికి దూరంగా...

పెళ్త్లెన కొత్తలో భార్యాభర్తలిద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలియకపోవచ్చు. కాబట్టి ముందుగా ఇద్దరూ తమ తమ అభిరుచులు, ఇష్టాయిష్టాలు.. వంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు ఇద్దరూ కలిసి వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. అలాగని ఏ ఫోనో, ల్యాప్‌టాపో పట్టుకొని అన్యమనస్కంగా మాట్లాడుకోవడం కాదు.. ఇద్దరూ ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్లి దగ్గరగా కూర్చొని ఒకరి కళ్లలోకి మరొకరు కళ్లు పెట్టి చూస్తూ.. తమకు సంబంధించిన విషయాలన్నీ పంచుకోవాలి. అప్పుడే వారి మధ్య ఐ కాంటాక్ట్ పెరిగి 'మేమిద్దరం ఒకరికొకరం, ఇద్దరం దగ్గరగా ఉన్నాం..' అన్న భావన కలుగుతుంది. దాంపత్య బంధంలో భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు దగ్గరవడానికి, రొమాన్స్ పండించుకోవడానికి కూడా ఈ ఐ కాంటాక్టే ప్రధానమంటున్నాయి అధ్యయనాలు. కాబట్టి మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీ.. వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లన్నీ దూరం పెట్టి ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకుంటే ఆ అనుబంధంలో అన్యోన్యతకు అవధులే ఉండవు.

కలిసి చదువుకోవాలి..

అదేంటి.. ఇప్పుడే కదా ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపాలన్నారు.. అప్పుడే మళ్లీ చదువుకోమంటున్నారు.. అనుకుంటున్నారా? అవును.. దంపతులిద్దరూ కలిసి గడపడానికి ఎలాగైతే సమయం కేటాయించుకుంటారో.. అలాగే కలిసి చదవడం వల్ల కూడా వారి అన్యోన్యత హద్దులు దాటుతుందంటున్నాయి పలు అధ్యయనాలు. అదెలాగంటే.. దంపతులిద్దరికీ పుస్తకాలు చదవడమంటే ఇష్టమనుకోండి.. ఎవరి పుస్తకం వారు చదువుకోవడం కాకుండా.. ఇద్దరూ కలిసి ఒక మంచి రొమాంటిక్ ప్రేమకథ పుస్తకాన్ని చదువుతూ.. అందులోని పాత్రల్లో మిమ్మల్ని ఊహించుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, రొమాన్స్ చేస్తూ.. సమయం గడపాలి. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ కథ మరింత రసవత్తరంగా సాగడంతో పాటు మీ మధ్య అనుబంధం కూడా రెట్టింపై.. ఒకరికొకరు మరింత దగ్గరవుతారంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

ఇచ్చిపుచ్చుకోవాలి..

అలాగే భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామన్న భావన కలగాలంటే ఒకరినొకరు అభినందించుకోవడం మరవద్దంటున్నారు నిపుణులు. డ్రెస్ బాగుందని, వంట రుచిగా ఉందని.. ఇలా ప్రతి విషయంలోనూ ఒకరినొకరు అభినందించుకోవడం చాలా ముఖ్యం. అది కూడా ఫోన్లోనో లేదంటే దూరంగా ఉండో కాదు.. ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటి మీద ఓ ముద్దు పెడుతూ వారిలో మీకు నచ్చిన విషయాల్ని పంచుకోవాలి. అప్పుడు దంపతుల మధ్య అనుబంధం పది కాలాల పాటు పదిలంగా ఉండటమే కాదు.. మరింత దగ్గరయ్యామన్న భావనా చిగురిస్తుంది. ఇలాంటి అభినందనలతో పాటు మధ్యమధ్యలో ముద్దులు, కౌగిలింతలు.. వంటి రొమాంటిక్ పనులనూ ఇందులో భాగం చేయాలి. అప్పుడే అన్యోన్యత మరింత బలపడుతుంది.

పనుల్నీ పంచుకోవాలి..

ప్రస్తుత బిజీ లైఫ్‌ స్త్టెల్‌లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమైపోయింది. అలాంటప్పుడు దంపతులిద్దరూ ఇంట్లోని ప్రతి పనినీ సమానంగా పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పనులు సునాయాసంగా పూర్తవడం మాత్రమే కాదు.. వారి మధ్య సాన్నిహిత్యం కూడా క్రమంగా పెరుగుతుంది. అంతేకాదు.. ఈ పనులు కలిసి చేసుకునేటప్పుడు ఇద్దరికీ సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి మాట్లాడుకుంటూ చిలిపిగా, సరదాగా పూర్తి చేయడం వల్ల పనిభారం అంతగా అనిపించదు సరికదా.. ఉన్న సమయంలోనే ఒకరికొకరు మరింత దగ్గరయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఇలా దంపతులిద్దరూ ప్రతి పనినీ పంచుకుంటూ ముందుకు సాగడం వల్ల వారి అన్యోన్య దాంపత్యం పది కాలాల పాటు పచ్చగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కేవలం ఇవే కాదు.. రోజూ ఇద్దరూ కలిసి వ్యాయామం చేయడం, ఒకరికి నచ్చినట్లుగా మరొకరు తయారవడం, ఒకరికి నచ్చిన పనులు మరొకరు చేయడం, భాగస్వామిని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, ముద్దాటం.. వంటివన్నీ ఇద్దరిలో దగ్గరితనం పెంపొందించేవే అంటున్నారు నిపుణులు!

ఇదీ చదవండి: Etela Rajender: మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.