ETV Bharat / lifestyle

Relationship tips: సున్నితంగా చెబితేనే సంతోషం...

author img

By

Published : Jul 23, 2021, 9:31 AM IST

ఆలుమగల అనుబంధానికి ప్రత్యేక సూత్రాలేమీ ఉండవు. సందర్భం, పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. ఇష్టాయిష్టాలను పంచుకోవాలి.అప్పుడే సంతోషంగా సాగిపోతుంది ఆ కాపురం.

tips-to-maintain-good-relationship-between-husband-and-wife
సున్నితంగా చెబితేనే సంతోషం...

ఒక్కోసారి చిన్న విషయాలూ ఆలుమగల మధ్య పెద్ద దుమారం లేపుతుంటాయి. మీరు చిన్నది అనుకున్న విషయం అవతలి వారికి పెద్దదిగా కనిపించొచ్చు... వీలైనంత వరకూ అన్నింటా పారదర్శకంగా ఉండండి. ఏదైనా తప్పక దాచాల్సి వచ్చినా... వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించుకోండి. అప్పుడే అపోహలూ, అపార్థాలూ ఉండవు.

  • కోపంతో సాధించలేని ఎన్నో పనులు ప్రేమతో చేయొచ్చు. ఎదుటివారిలో మార్పు కోరుకున్నప్పుడు మీరు చెప్పాలనుకునే విషయం కోపంతోనో, ఆవేశంతోనో కాకుండా సున్నితంగా చెప్పిచూడండి. ఉద్వేగాలతో ఎదుటి వారి కాళ్లకు బంధనాలు వేయడం వల్ల... ఇద్దరి మధ్యా అగాథం పెరిగే ప్రమాదం ఉంది. ప్రేమను వ్యక్తం చేయడంలో అందరి తీరూ ఒకేలా ఉండక పోవచ్చు. అర్థం చేసుకుని అడుగులేస్తే ఆనందమే.
  • ఎదుటివారు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకొచ్చి క్షమాపణ కోరుతుంటే బెట్టు చేయకుండా దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే భార్యాభర్తల బంధం నిలబడుతుంది. 'నేను చేసింది పొరపాటే.. నిన్ను అనవసరంగా బాధ పెట్టాను.. సారీ.. ఇంకోసారి అలా చేయను..' అంటూ మీ భాగస్వామి దగ్గరికొస్తే వారిని క్షమించి, దగ్గరికి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరోసారి ఇలాంటి గొడవలు రాకుండా ఉండడంతో పాటు ఇద్దరిలోనూ ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది.
  • ఎంత దూరంలో ఉన్నా మీ బంధానికి ప్రాధాన్యం ఇవ్వడం మరిచిపోవద్దు. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే.. నలుగురిలోనూ మీ మర్యాదా నిలబడుతుందని గమనించండి. అలాకాకుండా చులకన చేయడం, కొట్టి పారేయడం...వద్దు. ఏ విషయమైనా గుట్టుగా మాట్లాడుకుని ఒక తాటిపై నిలబడితేనే సంసారం సంతోషంగా సాగిపోతుంది.
  • ఇంటికీ, ఆఫీసుకీ మధ్య కచ్చితంగా గీత ఉండాలి. అలాకాకుండా ల్యాప్‌టాప్‌, ఫోన్‌లతో కాలం గడిపేస్తుంటే... అవతలివారు అభద్రతకు గురవుతారు. అన్నిసార్లూ ఆ పరిధులు నిర్ణయించుకోవడం కుదరకపోవచ్చు. దీంతో సెలవు రోజుల్లోనూ, అదనపు గంటలూ పని చేయాల్సి రావొచ్చు. ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో మీరు విఫలమవ్వొద్దు. ఈ తీరు ఎదుటివారిలో ఒత్తిడి తగ్గిస్తుంది. మీ మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.
  • బంధం బోర్‌ కొట్టకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు ఔటింగ్‌కు వెళ్లాలి. కొత్త ప్రదేశాలను చూసి, సరదాగా గడుపుతూ ఉండాలి. ఎంత తీరిక లేకున్నా మీ ఇద్దరి కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.

ఇదీ చూడండి: RELATIONSHIP TIPS: మనసులోనే కాదు మాటల్లోనూ ప్రేమ నింపితే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.