ETV Bharat / lifestyle

మింగిల్​ అవ్వాలంటే... 'హాయ్​' హద్దు దాటాలంతే...!

సింగిల్‌గా ఉన్నప్పుడు ఎవరో ఒకరితో మింగిల్‌ అవుదాం అనుకుంటాం. అందుకు అనువైన వేదికలు డేటింగ్‌ యాప్‌లు.. సోషల్‌ మీడియా వేదికలు. వాటిల్లో రిజిస్టర్‌ అయ్యి ఏదో ఉన్నాం.. అనిపించుకుంటే ఎవ్వరూ మిమ్మల్ని పలకరించరు..పంథా మార్చుకోవాల్సిందే. చురుకుగా చక్కర్లు కొట్టాల్సిందే!

social life tips for youth for mingle with others

author img

By

Published : Aug 22, 2020, 6:46 PM IST

సమయాన్ని కేటాయించండి

డేటింగ్‌ సైట్లలో మనసెరిగినోళ్లా? నాకైతే ఇంత వరకు దొరకలేదు. అదంతా టైం వేస్టు విషయమని నిరాశ పడిపోతే ఎలా? వేచి చూడాలి. రోజులో కొంత సమయం సోషల్‌ లైఫ్‌లో విహరించాలి. మీ అభిరుచులకు సరిపడే వారిని వెతకాలి. అప్పుడే మీకు మ్యాచ్‌ అయ్యేవారు తారసపడతారు. అదే పనిగా మాత్రం సమయం వృథా చేసుకోవద్దు.

మీ ఫొటోలే మాట్లాడతాయి..

అవును. మీరు అప్‌లోడ్‌ చేసే ఫోటోలు మీ గురించి చాలా చెబుతాయి. అందుకే ఎప్పుడూ ఒకే రకమైన ఫొటోలు కాకుండా విభిన్నమైనవి అప్‌లోడ్‌ చేస్తుండాలి. అలాగని, ప్రొఫైల్‌ మొత్తం సెల్ఫీలతో నింపొద్దు. కొన్నేళ్ల క్రితం తీసుకున్నవి ఎకౌంట్‌ నుంచి తొలగించడం మంచిది. మీ ప్రొఫైల్‌ని సందర్శిస్తే మీ జీవనశైలి ఏంటో అర్థం అవ్వాలి. మీరు పోస్ట్‌ చేసే అప్‌డేట్స్‌తో మీ వ్యక్తిత్వం ఏంటో తెలియపరచొచ్చు.

సెల్ఫ్‌ డబ్బా వద్దు

మీ గురించి మీరే పేరాలుపేరాలుగా వర్ణించుకోకండి. అంత చదివి అర్థం చేసుకునే ఓపికుండదు. చిన్న చిన్న వాక్యాలు.. ఫొటోలతోనే ఆకట్టుకునేలా చెప్పాలి. మీరెంత సింపుల్‌ అనేది అక్కడే ఎదుటివారికి అర్థం అవుతుంది. ఉదాహరణకి మీకు లాంగ్‌ డ్రైవింగ్‌ ఇష్టం అనుకోండి. లాంగ్‌ డ్రైవింగ్‌ వెళ్తున్నప్పుడు దిగిన ఫొటోని అప్‌లోడ్‌ చేసి.. దానికి సరిపోయే వాక్యం ఒకటి జోడిస్తే సరి. మీ గురించి, మీ అభిరుచుల గురించి సూటిగా నిజాయతీగా చెప్పడం చాలా ముఖ్యం.

‘హాయ్‌’తో పాటు..

రోడ్డుపై హాయ్‌ అంటే.. ఎవరైనా ఆగి మాట్లాడతారు.అదే సోషల్‌ మీడియాలో అలా కాదు. ఎవరితోనైనా మాట కలపాలంటే ‘హాయ్‌లు’ దాటుకుని వెళ్లాలి. వారి ప్రొఫైల్‌లో మీకు నచ్చిన విషయాన్ని చెప్పాలి. ఉదాహరణకు మీకు ఫొటోగ్రఫీ ఇష్టమైతే. నచ్చిన ఫొటోల్లో ఒకదానిపై స్పందించండి. దీంతో ఎదుటివారు కచ్చితంగా తిరిగి స్పందిస్తారు. ఈ విషయంలో అమ్మాయిలైతే అబ్బాయిలకంటే వేగంగా స్పందిస్తారట. పాజిటివ్‌ కాంప్లిమెంట్‌తోనే సంభాషణకి సిద్ధంకండి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.