జవాబు : Relationship Problems : మీరు సుస్థిరమైన ఉద్యోగంలో ఉన్నారు. ఇక ఇప్పుడు మీరు జీవితంలో స్థిరపడే సమయం. అయితే ఇలాంటి సమయంలో మీకొచ్చిన సంబంధాలు మీకు నచ్చకపోవడానికి, ఒక వివాహితుడు నచ్చడానికి కారణమేంటనేది విశ్లేషించుకోండి. ఎక్కువ సామీప్యం వల్ల కానీ, ఒకేచోట పనిచేస్తున్నందు వల్ల కానీ, అతను చురుగ్గా.. చొరవగా మీతో మాట్లాడుతున్నందుకు గానీ మీకు అతని పట్ల ఏర్పడినటువంటి సదభిప్రాయాన్ని మీరు ప్రేమగా నిర్వచించుకుంటున్నారేమో ఆలోచించండి. అతను అందరితో మాట్లాడినట్లే మీతోనూ మాట్లాడుతున్నాడేమో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
Woman Wants to Marry Married Man :జీవితంలో ఒక అనుబంధం ఏర్పడాలంటే అది పరస్పరం ఉండాలి. అతనికి వివాహమైనా మీకోసం తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదన్న విషయం స్పష్టమవుతోంది. అలాంటప్పుడు అతనిపై మీరు ఒత్తిడి తెచ్చి అతనితో జీవితం పంచుకోవాలనుకోవడం ఎంతవరకు సహేతుకమో ఆలోచించండి. అతను తన కుటుంబంతోనే సంతోషంగా ఉన్నాడనుకున్నప్పుడు మీరు మీ స్వాభిమానాన్ని పక్కన పెట్టి.. మీరు రెండో భార్యగా ఉండడానికి, మీ జీతంతో తన కుటుంబాన్ని నడపడానికైనా సిద్ధమే అంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. తద్వారా అతని దృష్టిలో మరింత పలుచనయ్యారనేది మీ ఉత్తరం సూచిస్తోంది.
Girl Wants to Marry Married Man : కాబట్టి ఈ ఆలోచనల్లో నుంచి బయటపడాలంటే మీ మనసుని మీకు ఇష్టమైన వ్యాపకాలపై కేంద్రీకృతం చేయండి. ఈ క్రమంలో మీ వృత్తిప్రవృత్తులకు సంబంధించిన అర్హతల్ని పెంచుకోవడం, ఉద్యోగంలో పదోన్నతి సాధించడానికి కావాల్సిన చదువు లేదా రాతపరీక్షలపై దృష్టి పెట్టడం.. వంటివి చేయాలి. అలాగే అతని నుంచి ప్రయత్నపూర్వకంగా కొంత దూరాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. అతని కుటుంబం మీ వల్ల ఇబ్బంది పడుతుందన్న విషయం అతను అవగాహన చేసుకున్నట్లే.. మీరు కూడా అతని స్థానంలో ఉండి సహేతుకంగా ఆలోచించడానికి ట్రై చేయండి. అలాగే అతనే మీకు లోకం అని కాకుండా మీకంటూ ఒక లోకాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరూ ఇష్టపడితేనే ప్రేమ.. కానీ బలవంతంగా తీసుకునేది ప్రేమ కాదన్న విషయం గ్రహించండి.
Relationship Advice : ప్రస్తుతం మీ మనసులో అతను ఒక బలహీనత.. ఆ బలహీనతను అధిగమించడానికి ఏం చేయాలి? అనే ధోరణిలో ఆలోచించి చూడండి. ఈ క్రమంలో అనేక మార్గాలుంటాయి. మీరు రిలాక్స్ అవడం, కొంతకాలం దూరంగా వెళ్లి మనసుని మళ్లించుకునే ప్రయత్నం చేయడం, అలాగే మీ మనసులో అతనికిచ్చిన స్థానాన్ని మీకు నచ్చిన మరే అంశంతోనైనా భర్తీ చేసుకోవడం.. వంటివి చేయండి. అలాగే మీరు చదువుకున్న సమయంలో మీకున్న స్నేహితులు కానీ, పెళ్లి చేసుకున్న వాళ్లు గానీ.. వాళ్లతో మళ్లీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నాలు చేయండి. ఇలా మీ పరిధిని పెంచుకునే కొద్దీ మీ ఆలోచనల్లో చేసుకోగలిగిన మార్పులేంటో మీకే అర్థం అవుతాయి. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి, మిమ్మల్ని మీరుగా గౌరవించే వ్యక్తి, మిమ్మల్ని సంపూర్ణంగా స్వీకరించే వ్యక్తి ఈ ప్రయత్నంలో మీకు తారసపడచ్చు.