ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చే భాగస్వామి ఆ తర్వాత ల్యాప్‌టాప్ ముందే కాలం గడిపేస్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు ‘నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు. వచ్చిన వెంటనే ల్యాప్‌టాప్ ముందేసుకుని కూర్చుంటున్నావు’ అనడం కంటే... ‘పది నిమిషాలు నాతో మాట్లాడిన తర్వాత నీ పని చూసుకుంటే బాగుంటుందిగా... ఒక్కద్దానికీ బోరుగా ఉంది’ అని చెప్పి చూడండి. ఇలా సున్నితంగా మీ మనసులోని మాటను తెలియజేస్తే... ఎదుటివాళ్లు కూడా సానుకూలంగా స్పందించే అవకాశముంటుంది.
విమర్శించకూడదు
దంపతులిద్దరి కుటుంబ నేపథ్యాలు, అలవాట్లు, అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు ఎదుటివారి పద్ధతులు కాస్త కొత్తగానూ, వింతగా అనిపించవచ్చు. అంత మాత్రాన వెంటనే భాగస్వామిని పనితీరును విమర్శించడం మొదలుపెట్టకూడదు. ఒక్కోసారి మీరు ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు.. ఎదుటివాళ్లు సరదాగా బయటకు వెళదామని అడగొచ్చు. అలాంటప్పుడు కోపంతో రగిలిపోకుండా... చేస్తున్న పని ఎంత ముఖ్యమైందో కాస్తా సున్నితంగా వివరించాలి. అవసరమైతే భాగస్వామి సాయమూ తీసుకోవచ్చు. ఏం చెప్పారన్నది కాదు... ఎలా చెప్పారన్నదే ముఖ్యం.
ఇదీ చూడండి: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?