ETV Bharat / lifestyle

రూ.150లక్షల కోట్ల విలువున్న సిటీకి సీఈఓగా ఎదిగింది! - వాల్​స్ట్రీట్​ వద్ద జేన్​ ఫ్రైజర్​ వార్తలు

న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌... ప్రపంచ ప్రసిద్ధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలుండే ప్రాంతం. బ్యాంకింగ్‌ రంగంలో వచ్చే మార్పులన్నీ దాదాపు అక్కణ్నుంచే మొదలవుతాయి. కానీ ఒక అంశంలో మాత్రం ఏ మార్పూలేకుండా దశాబ్దాలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఆ మార్పూ వచ్చింది. అమెరికాలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన ‘సిటీ’కి ఓ మహిళ సీఈఓగా రానుండటమే ఆ పెను మార్పు. ఆమె పేరు... జేన్‌ ఫ్రేజర్‌. వాల్‌స్ట్రీట్‌లో గ్లాస్‌ సీలింగ్‌ని ఎట్టకేలకు జేన్‌ బద్దలుకొట్టారు. రూ.150లక్షల కోట్ల విలువున్న సిటీకి సీఈఓగా కొత్త ఏడాదిలో బాధ్యతల్ని తీసుకోనున్నారు యాభై మూడేళ్ల జేన్‌.

jane frazer as CEO for City worth Rs 150 lakh crore!
రూ.150లక్షల కోట్ల విలువున్న సిటీకి సీఈఓగా ఎదిగింది!
author img

By

Published : Sep 14, 2020, 1:19 PM IST

Updated : Sep 17, 2020, 9:16 AM IST

స్కాట్లాండ్‌లో పుట్టిన జేన్‌ ఫ్రేజర్‌ 20 ఏళ్లకే కేంబ్రిడ్జి నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత లండన్‌లోనే గోల్డ్‌మెన్‌ శాక్స్‌, మెకన్సీ అండ్‌ కంపెనీలో ఉద్యోగం చేశారు. నాలుగేళ్లపాటు పనిచేశాక లండన్‌ జీవితం బోర్‌కొట్టి మాడ్రిడ్‌కు వెళ్లారామె. స్పెయిన్‌లో ఆమె జీవితం ఎంతో సరదాగా సాగిపోయేది. అక్కడ పనిచేసిన రెండేళ్లలో స్పానిష్‌ కూడా నేర్చుకున్నారు. తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన అమెరికా వెళ్లాలనుకున్నారు. నేరుగా ఉద్యోగిగా వెళ్లకుండా ముందు హార్వర్డ్‌లో ఎంబీఏ చేశారు. తర్వాత మెకన్సీ లండన్‌ శాఖలో అవకాశం రావడంతో ట్రస్ట్‌డ్‌ అడ్వైజర్‌గా చేరారు.

అప్పటికే బ్యాంకింగ్‌ రంగంలో స్థిరపడ్డ కొందరు స్త్రీ, పురుషుల్ని చూశారు జేన్‌. వాళ్లు కెరీర్‌లో అద్భుతంగా రాణించేవారు. కానీ నలభైలకి దగ్గరవుతున్నా కుటుంబ జీవితం మొదలుపెట్టేవారు కాదు. కానీ జేన్‌ మాత్రం పర్సనల్‌, ప్రొఫెషనల్‌... రెండు జీవితాలూ బాగుండాలనుకున్నారు. అప్పుడే సీనియర్‌ ఒకరు ‘కచ్చితంగా రెండు చోట్లా విజయం సాధించొచ్చు. కానీ రెండూ ఒకేసారి మాత్రం సాధ్యం కాదు’ అని చెప్పారట. ఆ సలహాని పాటించిన జేన్‌... ఏడాది తిరిగేసరికి పార్ట్‌టైమ్‌ జాబ్‌కి మారారు. ‘ఆ సమయంలోనే ఆల్బెర్టో పెయెడ్రాను పెళ్లి చేసుకున్నా. ఆయన కూడా బ్యాంకర్‌. మేం ముందు పిల్లల్ని కనాలనుకున్నాం. అమ్మ పాత్రకి పూర్తి న్యాయం చేయాలనుకుని కొన్నాళ్లు పార్ట్‌టైమ్‌ జాబ్‌కీ దూరంగా ఉన్నా’ అని చెబుతారు జేన్‌. తరువాత రెండేళ్లకి రెండో అబ్బాయి పుట్టాడు. అదే టైమ్‌లో ఆల్బెర్టో... ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా’ ఐరోపా విభాగం బాధ్యతలు చూసుకునేవారు. రెండో అబ్బాయికి ఏడాది వచ్చాక పార్ట్‌టైమ్‌ ఉద్యోగాన్ని మళ్లీ కొనసాగించారు. ‘పిల్లలు స్కూల్‌కి వెళ్లడం మొదలయ్యాక ఫుల్‌టైమ్‌ వర్క్‌లోకి దిగా. ఈసారి ‘సిటీ’ బ్యాంకులో చేరా. గ్లోబల్‌ ఆర్గనైజేషన్స్‌లో పనిచేస్తే.. అవకాశాలతోపాటు, బృందంలో భిన్నత్వమూ ఉంటుంది’ అంటారు జేన్‌.

విక్రమ్‌ సారథ్యంలో...

లండన్‌లో ఉంటూ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు విభాగంలోని ‘గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌’తో పనిచేసేవారు జేన్‌. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో అప్పటి సీఈఓ విక్రమ్‌ పండిట్‌ నుంచి ఫోన్‌... ‘మీకు గోల్డ్‌మేన్‌, మెకన్సీలో అనుభవం ఉంది. మీరు తక్షణమే ‘గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ స్ట్రాటజీ’గా బాధ్యతలు తీసుకోండి’ అని చెప్పారాయన. జేన్‌ ‘ఓకే’ చెప్పారు కానీ, తాను చేయగలనా అన్న చిన్న సందేహం. ఓ స్నేహితురాలికి విషయం చెబితే ‘సీఈఓనే పిలిచారంటే నువ్వు చెయ్యగలవన్న నమ్మకంతోనే కదా’ అని బదులివ్వడంతో వెంటనే అమెరికా ప్రయాణమయ్యారు. ఆ సమయంలో అనుబంధంగా ఉన్న అనేక అప్రధాన విభాగాల్ని తగ్గించుకోవడమే మేలని తేల్చారు. దాంతో రూ. లక్ష కోట్ల డాలర్ల విలువైన విభాగాల్ని అమ్మి నష్టాన్ని తగ్గించుకుంది సిటీ. దాదాపు లక్షమంది ఉద్యోగుల్నీ వదులుకున్నారు. ఆ సమయంలో జేన్‌ అమెరికాలో ఉంటే, ఆమె కుటుంబం లండన్‌లో ఉండేది. అప్పటికి ఆల్బెర్టో ఒక బ్యాంక్‌కి సీఈఓగా ఉన్నారు. ఒకరు కెరీర్‌ త్యాగం చేయాలనుకున్నారు. వయసులో పెద్దయిన ఆల్బెర్టో విశ్రాంతి తీసుకుంటానన్నారు. ఆ వెంటనే ‘ఏదైనా కొత్త బాధ్యత ఇవ్వండి’ అని విక్రమ్‌ని అడగ్గా జేన్‌ను ‘ప్రైవేట్‌ బ్యాంక్‌ గ్లోబల్‌ హెడ్‌’గా నియమించారు. ఆ హోదాలో ఎందరో సెలెబ్రిటీల్ని కలుస్తూ వారి నుంచి చాలా నేర్చుకున్నానంటారు. తరువాత నష్టాల్లో ఉన్న మార్ట్‌గేజ్‌ బిజినెస్‌కి మార్చగా ఆ ఛాలెంజ్‌నీ స్వీకరించారు. అక్కడ హోమ్‌లోన్‌ సమస్యని పరిష్కరించి మళ్లీ లాభాల బాట పట్టించారు. అదే ఆమె కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌.

మహిళా సీఈఓని చూడాలని...

ఏ విభాగంలోనైనా అనుభవజ్ఞులూ, తెలివైనవాళ్లూ కొందరు ఉంటారు. కొత్తగా బాస్‌ హోదాలో వెళ్లినపుడు వాళ్లని గుర్తించి వారి నుంచే ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలంటారు జేన్‌. ‘అలాంటపుడు అహాన్ని వీడాలి. అలాగే నాకంటే తెలివైన వ్యక్తుల్ని బృందంలో చేర్చుకునేదాన్ని. దీనివల్ల ఇద్దరికీ లాభం’ అని తన అనుభవ పాఠాలు చెబుతారు. 2014లో ‘కన్జ్యూమర్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌’ బాధ్యతల్నీ, అదనంగా 2016లో లాటిన్‌ అమెరికా బాధ్యతల్నీ స్వీకరించారు జేన్‌. ‘లాటిన్‌ అమెరికా విభాగంలో మెక్సికో, బ్రెజిల్‌, అర్జెంటీనా, కొలంబియా ఉంటాయి. ఆ దేశాల్లో స్థానికులు స్పానిష్‌ మాట్లాడతారు. మొదటి సమావేశంలో వారితో స్పానిష్‌లో మాట్లాడా. దాంతో వాళ్లకు దగ్గరయ్యా’ అంటారు జేన్‌. ‘సీఈఓ అవ్వాలని ఎప్పుడైనా అనుకున్నారా’ అని అడిగితే... ‘ఆ లక్ష్యంతో నేనెప్పుడూ పనిచేయలేదు. పనిలో ఆనందాన్ని వెతుక్కుంటా వచ్చానంతే. వాల్‌స్ట్రీట్‌లో మహిళా సీఈఓని చూడాలని మాత్రం అనుకునేదాన్ని’ అంటారు జేన్‌. గతేడాది కొన్ని బ్యాంకులు జేన్‌ని సీఈఓగా తీసుకోవడానికి సంప్రదింపులు జరిపాయనీ వార్తలు వచ్చాయి. ఆ వెంటనే సిటీ ఆమెకు ‘ప్రెసిడెంట్‌’గా పదోన్నతి ఇచ్చింది. అది జరిగిన కొన్ని నెలల్లోనే ప్రస్తుత సీఈఓ ఫిబ్రవరిలో రిటైర్‌ అవుతారనీ, తమ తదుపరి సీఈఓ జేన్‌ ఫ్రేజర్‌ అని ప్రకటించింది. ‘కొవిడ్‌-19 సమయంలో మేమంతా కలిసికట్టుగా పనిచేస్తూ సిటీ ప్రత్యేకతను చాటాం. సీఈఓగా బ్యాంకు చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని చెబుతారు జేన్‌.

సీనియర్లూ, సహోద్యోగులూ, పాత కొలీగ్స్‌... మన మెంటార్ల నెట్‌వర్క్‌లో ఉన్నప్పుడే... ఎన్నో విషయాలను తెలుసుకోగలం -జేన్‌

ఇదీ చదవండిః పీచు పదార్థాలతో... కొలెస్ట్రాల్‌ బయటకు...

Last Updated : Sep 17, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.