గుర్తు చేయండి
ఎంత భార్యాభర్తలైనా ఒకరి గురించి మరొకరికి అన్నీ తెలిసి ఉండాలనేం లేదు. మీరు మనసులోనే దాచుకోకుండా వాటి గురించి ప్రస్తావించండి. చాలావరకూ పని ఒత్తిడిలోనో, అలవాటులేకో...చాలామంది కొన్ని విషయాలు మరిచిపోతుంటారు. ఆ సందర్భానికో, అంశానికో మీరు చాలా ప్రాధాన్యం ఇచ్చి ఉండొచ్చు. పజిల్ ఇచ్చినట్లు మీకు గుర్తులేదా అంటూ ప్రశ్నించొద్దు.. వారు మరిచిపోవడానికి కారణమైన పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిజంగా వారికే దురుద్దేశం, నిర్లక్ష్యం లేదని మీకు తెలిసినా మిమ్మల్ని మీరు మోసం చేసుకుని గొడవపడొద్దు. వీలైతే మీరు చొరవ తీసుకుని గుర్తు చేయండి. అప్పుడు మీ సమస్య తీరుతుంది.
మాట్లాడండి
మీరో, మీవారో అంతర్ముఖులై ఉండొచ్చు నేరుగా మాట్లాడలేకపోవచ్చు అయినంతమాత్రాన ఒకరిమీద ఒకరికి ప్రేమలేనట్లు కాదు...మాటల్లో చెప్పలేకపోతున్నారా? అయితే చేతల్లో చూపించండి. అవతలివారిపై మీరు చూపించే ప్రేమ, అప్యాయతలు వారు మనసువిప్పి మాట్లాడేలా చేస్తాయి. ఒకేసారి మనసులో ఉన్నవన్నీ చెప్పేయక్కర్లేదు కూడా...కొద్దికొద్దిగా చనువు చూపిస్తే...కచ్చితంగా మనసువిప్పి మాట్లాడుకోగలుగుతారు.
కోపాన్ని కట్టడిచేయండి
చాలా బంధాలు దెబ్బతినేవి కోపంలో అనే మాటలు, చేసే పనులవల్లే. మీరు ఎదుటివారిపై వ్యక్తపరిచే భావోద్వేగాలు ఎక్కువే ప్రభావం చూపిస్తాయి. అందుకే కోపం వచ్చినప్పుడు వీలైనంతవరకూ అక్కడి నుంచి దూరంగా వెళ్లండి. మరింత వాదనలకు దారితీసే చర్చల్లో పాల్గొనకండి. ఒకవేళ కోపం ప్రదర్శించినా...తరువాత ఆలోచించుకోండి.
ఇదీ చదవండిః ఈ షవర్ కప్‌తో మీ చిన్నారికి లాల పోసేద్దామిలా..!