ETV Bharat / lifestyle

110 ఏళ్ల అబ్బా.యి.. 104 ఏళ్ల అమ్మాయి.. 80 ఏళ్ల ప్రేమానుబంధం - వాల్డ్రామినాకు 104 ఏళ్లు

జీవితంలో పెళ్లనేది ఓ మధురమైన ఘట్టం. ఎంతో అందమైన ఈ అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవాలనుకుంటారు భార్యాభర్తలు. అందుకే కష్టమైనా, సుఖమైనా, లాభమైనా, నష్టమైనా ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాన్ని పంచుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహిస్తూ, ఒకరి ఇష్టప్రకారం మరొకరు నడుచుకుంటుంటారు... ఇలా ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగేస్తే ఆ ఆలుమగల సంసారం జీవితాంతం ఎంతో సాఫీగా సాగుతుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ సుమారు 80 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తోందీ ఓ జంట. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించి ఉన్న భార్యాభర్తలుగా గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఆ ఆదర్శ దంపతుల ప్రేమ కథ గురించి తెలుసుకుందాం రండి.

110 ఏళ్ళ అబ్బా.యి.. 104 ఏళ్ళ అమ్మాయి.. 80 ఏళ్ళ ప్రేమానుబంధం

author img

By

Published : Sep 3, 2020, 10:10 PM IST

ఈక్వెడార్‌ రాజధాని క్విటోకు చెందిన జూలియో సీజర్‌ మోరా, వాల్డ్రామినా క్వింటెరస్‌ సుమారు 80 ఏళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. సుఖ దుఃఖాల్లో కలిసే ఉంటామన్న అప్పటి పెళ్లినాటి ప్రమాణాలను నిలబెట్టుకుంటూ దాంపత్య బంధాన్ని ఆస్వాదిస్తున్నారీ ఓల్డ్‌ కపుల్‌. వారి అన్యోన్యతకు దేవుడి ఆశీర్వాదం కూడా తోడయిందేమో అన్నట్లు వారి ఆయుర్దాయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది.

మధురిమల ఆస్వాదన..

ప్రస్తుతం జూలియో వయసు 110 ఏళ్లు కాగా, అతడి భార్య వాల్డ్రామినాకు 104 ఏళ్లు. సుమారు 8 దశాబ్దాలుగా దాంపత్య బంధంలోని మధురిమలను ఆస్వాదిస్తున్న ఈ స్వీట్‌ కపుల్‌ ప్రపంచంలోనే వృద్ధ దంపతులుగా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఈ లవ్లీ కపుల్‌ ప్రస్తుతం మనవలు, మనవరాళ్లు, ముని మనవళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.

110 ఏళ్ళ అబ్బా.యి.. 104 ఏళ్ళ అమ్మాయి.. 80 ఏళ్ళ ప్రేమానుబంధం
110 ఏళ్ళ అబ్బా.యి.. 104 ఏళ్ళ అమ్మాయి.. 80 ఏళ్ళ ప్రేమానుబంధం

పెద్దలను ఎదిరించి... ఇంట్లోంచి వెళ్లిపోయి..

జూలియో 1910 మార్చి 10న పుట్టగా, క్వింటెరస్‌ 1915 అక్టోబర్ 16న జన్మించింది. వేసవి సెలవుల్లో భాగంగా వాల్డ్రామినా ఓ సారి తన సోదరి ఇంటికి వెళ్లింది. ఆమె భర్త జూలియో బంధువు కావడం, జూలియో కూడా అదే అపార్ట్‌మెంట్లో నివాసం ఉండడంతో 1934లో మొదటిసారిగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆపై ప్రేమ బంధంగా చిగురించింది. స్వతహాగా సాహితీ వేత్త అయిన జూలియో ప్రేమ కవిత్వాలు క్వింటెరస్‌ను కట్టిపడేస్తే.. అందం, అంతకుమించి దయార్థ్ర హృదయమున్న వాల్డ్రామినాను చూసి ఇట్టే ఆమెతో ప్రేమలో పడిపోయాడు జూలియో.

ప్రేమ బంధం పెళ్లితో అనుబంధంగా...

ఇక తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్న ఆ ప్రేమ పక్షుల ఆశలకు వారి పెద్దలు, కుటుంబ సభ్యులు అడ్డుకట్టవేశారు. అయినా సరే పెద్దలను ఎదిరించి తమ ప్రేమను గెలిపించుకోవాలనుకున్న వారిద్దరూ ఇంట్లోంచి పారిపోయారు. ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆ లవ్‌బర్డ్స్‌ 1941 ఫిబ్రవరి 7న రహస్యంగా ఓ చర్చిలో పెళ్లి చేసుకున్నారు.

'అవే మా అన్యోన్య బంధానికి బాటలు వేశాయి'

అప్పటి నుంచి సుఖ దుఃఖాలను కలిసి పంచుకుంటూ కాపురం సాగిస్తున్న ఈ లవ్లీ కపుల్‌కు మొత్తం ఐదుగురు సంతానం. వీరంతా డిగ్రీ పట్టాలు సాధించి భార్యాపిల్లలతో ఉన్నతంగా స్థిరపడిన వారే. వీరితో పాటు 11 మంది మనవలు, మనవరాళ్లు, 21 మంది ముని మనవళ్లు, మనవరాళ్లు, 9 మంది ముని ముని మనవలు, మనవరాళ్లు ఉన్నారు.

వాళ్లు అంగీకరించలేదు...

‘మా వివాహానికి మా కుటుంబ సభ్యులెవరూ అంగీకరించలేదు. అయినా మేం వారిని ఎదిరించి ఒక్కటయ్యాం. మేమిద్దరం దగ్గరైనా మా కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మాకు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో పెళ్లయ్యాక మా బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలనుకున్నాం. ఇందులో భాగంగా పరస్పరం గౌరవించుకున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం..ఒకరి అభిరుచులను మరొకరు గ్రహించాం.

క్రమంగా కోపం తగ్గిపోయింది...

మా ప్రేమానుబంధాన్ని చూసి మా ఇరు కుటుంబ సభ్యుల కోపం కూడా కొద్ది రోజులకు తగ్గిపోయింది. ‘ప్రేమ, పరస్పర గౌరవం, నిజాయతీ, విద్య, సమష్ఠి కుటుంబ విలువలు’ ఇవే ఆరోగ్యకర కుటుంబానికి, సమాజానికి ప్రధాన సూత్రాలు. ఇవే మా 80 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధానికి బాటలు వేశాయనుకుంటాను’ అని చెబుతారీ అమేజింగ్‌ కపుల్.ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం !

ఇద్దరిదీ కలిపితే సుమారు 215 ఏళ్ల సుదీర్ఘం...

జూలియో-వాల్డ్రామినా.. వీరిద్దరి వయసు కలిపితే సుమారు 215 సంవత్సరాలు. ఈ క్రమంలో 80 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధంతో గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో ఎక్కారీ లవ్లీ కపుల్‌. ఈ గుర్తింపు తమ కుటుంబంలో మరింత సంతోషాన్ని తెచ్చిపెట్టిందని సంబరపడిపోతోంది వీరి కుమార్తె యురా సిసిలియా.

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ...

‘అమ్మానాన్నలకు పండ్లు, పూల మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులందరితో ఓ పెద్ద డిన్నర్‌ ఏర్పాటుచేసి... పార్టీ తర్వాత తాము స్వయంగా పండించిన పండ్లు, కూరగాయలను అందరికీ బహుమతిగా అందజేస్తుంటారు. తాజాగా అమ్మానాన్నల అనుబంధాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. ప్రస్తుతం ప్రపంచమంతా వారి గురించే మాట్లాడుకుంటోంది. ఇది మాకెంతో సంతోషాన్నిస్తోంది.

కరోనా కారణంగా...

కానీ కరోనా కారణంగా ఈ సందర్భాన్ని ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకోలేకపోతున్నాం. అమ్మానాన్నలు కూడా ఈ మహమ్మారితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. రోజూ ఫోన్‌ చేసి మరీ మాలో ధైర్యాన్ని నింపుతున్నారు. కరోనా అంతమైపోయి మా కుటుంబ సభ్యులంతా కలిసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది సిసిలియా.

అసలు సిసలైన ప్రేమానురాగాలు...

పరస్పరం ప్రేమను పంచుకుంటూ 80 ఏళ్లుగా అన్యోన్య దాంపత్య బంధాన్ని కొనసాగిస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు జూలియో-వాల్డ్రామినా. అసలు సిసలైన ప్రేమ బంధానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ యువతకు రిలేషన్‌షిప్‌ గోల్స్‌ విసురుతున్నారు. మరి ఈ స్వీట్‌ కపుల్‌ చెప్పిన టిప్స్‌ను అనుసరించి మీ దాంపత్య బంధాన్ని కూడా పదిలంగా మార్చుకోండి.

ఇవీ చూడండి : ప్రసవానంతరం ఈ మార్పులు సహజమే !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.