ETV Bharat / lifestyle

మహిళలకు రోజూ కావాలి షడ్రుచులు..! - తెలంగాణ వార్తలు

తెలుగువారి తొలి పండుగైన ఈ ఉగాది పర్వదినాన్ని సంబరంగా చేసుకుంటాం. ఈరోజున షడ్రుచుల కమ్మదనాన్ని ఆస్వాదిస్తాం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు రుచుల సమ్మేళనాన్ని కష్టసుఖాలుగా జీవితానికి అన్వయించుకుంటాం. ఈ ఆరు రుచుల సంగమం... మహిళల ఆరోగ్యాన్నీ,  అందాన్నీ ఎలా పరిరక్షిస్తుందో తెలుసుకుందాం.

six flavours good for health, health tips in telugu
షడ్రుచులతో ఆరోగ్యం, షడ్రుచులతో అందం
author img

By

Published : Apr 13, 2021, 10:05 AM IST

తెలుగు సంవత్సరాది ఉగాది నాడు తినే షడ్రుచుల సమ్మేళనం కమ్మదనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పచ్చడి జీవిత సారాన్ని తెలియజేస్తుందని అనుకుంటాం. అయితే కమ్మనైన ఈ ఆరు రుచులు అందం, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అది ఎలాగో చూద్దాం.

బెల్లంతో పోషకాలెన్నో..

తీపి... ఉగాది పచ్చడిలో వేసే బెల్లంలో మహిళల ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలెన్నో ఉన్నాయి. భోజనం తర్వాత తినే చిన్న బెల్లం ముక్క ఆహారాన్ని పూర్తిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. బెల్లంలో విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్స్‌తోపాటు జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ముఖంలో వృద్ధాప్య ఛాయలను త్వరగా రానివ్వవు. అంతేకాదు, జీవక్రియలను వేగవంతం చేసి, బరువు పెరగకుండా చేస్తుంది. రజస్వల అయినప్పటి నుంచి అమ్మాయిలతో రోజూ చిన్నబెల్లం ముక్కను తినిపిస్తే.. ఇందులోని ఐరన్‌ రక్తంలోని హీమోగ్లోబిన్‌ను వృద్ధి చేస్తుంది. నెలసరిలో కడుపునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గర్భిణుల్లో రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది.

పులుపుతో లాభాలు

పులుపు: చింతపండు గుజ్జులో విటమిన్‌-సి తోపాటు పలు పోషకాలుంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో అమినోయాసిడ్స్‌, బీటాకెరొటిన్‌ పుష్కలంగా ఉండి, చర్మకణాలు, కంటిచూపును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే వీటిలోని యాంటీఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. విటమిన్‌-బి నరాల వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. మెదడును చురుకుగా ఉంచుతుంది.

థైరాయిడ్​కు చెక్

ఉప్పు: తగిన మోతాదులో వాడటం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జీవక్రియల్లో ప్రధానపాత్ర పోషించే థైరాయిడ్‌ బాగా పని చేసేందుకు అయోడిన్‌ అవసరం. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. రక్తపోటు తగ్గకుండా పరిరక్షిస్తుంది.

పచ్చిమిర్చి: వీటిలో విటమిన్‌ సి, బి6, ఏ..లతోపాటు ఐరన్‌, కాపర్‌, పొటాషియం, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యవంతమైన చర్మం, మెరుగైన జీర్ణశక్తితోపాటు బరువు పెరగకుండా ఉండటం లాంటి ప్రయోజనాలున్నాయి. మధుమేహులకు శరీరంలో చక్కెరస్థాయులు పెరగకుండా పచ్చిమిర్చి అదుపులో ఉంచుతుంది.

వేప పూలు: ఆరోగ్య పరిరక్షణకు వేపపూలెంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. పిత్త, కఫదోషాలను దూరం చేస్తుందీ పువ్వు. పిల్లలకు ఉదర సమస్యలు దరి చేరనివ్వదు. కడుపులోని నులిపురుగులను సంహరించి, ఆకలిని పెంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. సీజన్‌లో లభ్యమయ్యే వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చు.

ఆరోగ్యం కోసం వేప పువ్వు

మామిడి కాయ: మధుర ఫలం మామిడిలో పులుపుతోపాటు వగరు కూడా ఉంటుంది. ఉగాది పచ్చడికి రుచిని పెంచే ఈ కాయంతా పోషకాలమయమే. తక్కువ కెలొరీలతో, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు బీ6, ఏ, ఈ, బీ5, కేతోపాటు పీచు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాగే మాంగనీస్‌, మెగ్నీషియం, థయమిన్‌ వంటివన్నీ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని కాల్షియం ఎముకలను బలోపేతంగా మారుస్తుంది. ఐరన్‌ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యాంటీఆక్సిడెంట్స్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి వృద్ధాప్యఛాయల నుంచి దూరంగా ఉంచుతాయి.

ఇదీ చదవండి: శుభాలు కలిగించే... ఉగాది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.