ETV Bharat / lifestyle

కళ్లకి సాంత్వన.. నల్లటి వలయాలకు చెక్! - తెలంగాణ వార్తలు

కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయా? వాటి వల్ల ఇబ్బందిగా ఉందా? అయితే మీ కోసమే ఈ చిట్కాలు. వీటితో నల్లటి వలయాల సమస్యకి చెక్ పెట్టండి. ఆ టిప్స్ ఏంటో చూసేయండి మరి.

tips for reduce black spots , beauty tips
నల్లని వలయాలు పోగొట్టే చిట్కాలు, మహిళల అందం కోసం చిట్కాలు
author img

By

Published : Apr 26, 2021, 9:40 AM IST

ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు కూర్చుని, కంటికింద వలయాలు ఏర్పడ్డాయా? కళ్ల చుట్టూ ఉన్న నలుపుతో ఇబ్బందిగా ఉందా? అయితే మీకోసమే ఈ చిట్కాలు..

రాత్రి పడుకునేముందు బాదం క్రీమ్‌ను కంటిచుట్టూ రాసి మర్దనా చేయండి. ఇలా క్రమం తప్పక చేస్తే వలయాలు తగ్గుముఖం పడతాయి.

* కమలాపండు రసంలో, కొద్దిగా పాలు కలిపి కళ్లకింద సున్నితంగా రాయండి. ఈవిధంగా చేస్తే కొన్ని రోజులకు కళ్ల చుట్టూ నలుపు పోతుంది.

* రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి దాన్ని కళ్ల మీద పెట్టుకుని 10 నిమిషాలు ఉంచండి. దానివల్ల అలసట తగ్గి ప్రకాశవంతంగా మెరుస్తాయి.

* టొమాటో గుజ్జు, పసుపు, నిమ్మరసం, సెనగపిండి అన్నీ కలిపి కళ్ల చుట్టూ రాసుకోండి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

* పడుకునేముందు కీరదోస రసాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసినా, కీరదోస ముక్కల్ని కళ్ల మీద పెట్టుకుని పదిహేను నిమిషాలు ఉంచినా డార్క్‌ సర్కిల్స్‌ తగ్గుతాయి.

ఇదీ చదవండి: కొవిడ్​ను ఎదుర్కోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.