చర్మం పొడిబారిపోతోందంటే క్రమంగా తేమను కోల్పోతున్నట్లే లెక్క. ఆ తేమను తిరిగి పొందాలంటే మాయిశ్చరైజర్ ఆధారిత (మాయిశ్చరైజర్ బేస్డ్) క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. అది కూడా రాత్రి పూట పడుకునే ముందు అప్త్లె చేసుకుంటే రాత్రంతా ఇది చర్మంలోకి బాగా ఇంకిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి క్రీమ్స్‌తో పాటు ఇంట్లో లభించే పాల మీగడను కూడా అప్త్లె చేసుకోవచ్చు.
అయితే ఇందుకోసం ముందుగా ఆ మీగడను బాగా గిలక్కొట్టాలి. తద్వారా అది మృదువైన క్రీమ్‌లా మారుతుంది. ఇలా తయారైన క్రీమ్‌ని రోజులో ఎప్పుడైనా చర్మానికి అప్త్లె చేసుకొని రెండుమూడు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఈ చిట్కాని సరిగ్గా నెల రోజులు పాటిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. మీగడ వాడినా ఫలితం లేకపోతే బాదం నూనెను ప్రయత్నించచ్చు. ఇందుకోసం అర టేబుల్‌స్పూన్ బాదం నూనెను ముఖానికి అప్త్లె చేసుకొని రెండు గంటల పాటు అలాగే ఉంచుకుంటే పొడిబారిన చర్మానికి ఇట్టే పరిష్కారం లభిస్తుంది.
ఇదీ చూడండి: వంటింట్లో ప్రమాదాలు జరగకుండా.. ఇవి పాటించాల్సిందే!