- టేబుల్‌స్పూన్ ముల్తానీమట్టిలో కొద్దిగా గులాబీనీరు పోసి పేస్టులా కలపాలి. దీన్ని ముఖానికి రాస,ి బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల ముఖ చర్మం మృదువుగా మారుతుంది. జిడ్డు, సాధారణ చర్మం ఉన్నవాళ్లు ఎవరైనా దీన్ని ప్రయత్నించవచ్ఛు.
- మూడు టీస్పూన్ల ఓట్స్‌లో టేబుల్‌స్పూన్ గులాబీనీరు, టీస్పూన్ తేనె, పెరుగు వేసి పేస్టులా చేయాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి దీన్ని రాసుకోవాలి. అరగంట ఆగి చన్నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే తేడా మీకే తెలుస్తుంది.
- టీస్పూన్ సెనగపిండిలో చిటికెడు పసుపు, రెండుమూడు చుక్కల నిమ్మరసం, రెండు టీస్పూన్ల గులాబీనీరు వేసి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ పూతతో ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
- రెండు టీస్పూన్ల పెసరపిండిలో కొద్దిగా గులాబీనీరు, తేనె వేసి పేస్టులా కలపాలి. దీన్ని ముఖానికి రాసి బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
గులాబీ నీటి ప్యాక్‌లతో చందమామలాంటి ముఖారవిందం
వర్షాకాలంలో వాతావరణం మబ్బులతో ముసురుగా ఉన్నా... మీ ముఖారవిందం మాత్రం చందమామలా చక్కగా మెరుస్తూ ఉండాలంటే గులాబీనీరు కలిపిన ఈ ప్యాక్‌లను ప్రయత్నించండి...
చందమామలా ముఖారవిందం...