ETV Bharat / lifestyle

ఇవి తింటే బాలింతల్లో పాలు బాగా పడతాయి ! - mothers precautions for milk

పాపాయి ఆరోగ్యానికి తల్లిపాలు ఎంత ముఖ్యమో.. బిడ్డకు పాలివ్వడం తల్లి ఆరోగ్యానికి కూడా అంతే ముఖ్యం. పాలలోని కొవ్వులు, ప్రొటీన్లు, నీరు, చక్కెర.. వంటి పోషకాలు పాపాయికి అందడం ద్వారా వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎదిగే కొద్దీ చిన్నారులకు తల్లిపాలు సరిపోవాలంటే తల్లుల్లో పాల ఉత్పత్తి మెండుగా ఉండాలి. అందుకు కొన్ని సహజసిద్ధమైన ఆహార పదార్థాలు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి...

Postpartum have to take healthy food for mother milk

author img

By

Published : Aug 6, 2020, 1:14 PM IST

నట్స్..

ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు.. వంటి సంపూర్ణ పోషకాలతో కూడిన నట్స్‌ని పాలిచ్చే తల్లులు ఆహారంగా తీసుకోవచ్చు. ఇవి పాల ఉత్పత్తిని పెంచుతాయి. వీటిలో వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు.. వంటివి ముఖ్యమైనవి. కాబట్టి రోజూ నాలుగైదు బాదంపప్పుల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇవి అందరికీ పడకపోవచ్చు. కొందరిలో ఈ నట్స్ అలర్జీలకు కారణం కావచ్చు. కాబట్టి వీటిని రోజూ తీసుకునే వాళ్లు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

ఓట్‌మీల్..

తల్లుల్లో పాలు పుష్కలంగా ఉత్పత్తి కావడానికి తోడ్పడే మరో అద్భుత ఆహారం ఓట్‌మీల్. ఇది పాలిచ్చే తల్లుల్లో ఎక్కువ మొత్తంలో, నాణ్యమైన పాలు ఉత్పత్తి చేసేందుకు దోహదం చేస్తుంది. కాన్పు తర్వాత చాలామంది తల్లుల్లో ఎదురయ్యే రక్తహీనత, ఒత్తిడి, ఆందోళన.. వంటివాటిని ఓట్‌మీల్ తగ్గిస్తుంది. అలాగే దీన్ని తయారుచేసుకోవడం ఎంత సులువో.. అంతే సులభంగా జీర్ణమవుతుంది కూడా! కాబట్టి తల్లుల్లో పాలు ఉత్పత్తి కావాలంటే రోజూ ఓ కప్పు ఓట్‌మీల్‌లో రుచికోసం కాస్త తేనె, కొన్ని నట్స్, కొద్దిగా కుంకుమ పువ్వు.. వంటివి వేసి బాలింతలకు అందించవచ్చు. అంతేకాదు.. ఓట్స్‌తో తయారుచేసిన బిస్కట్లు, కుకీస్.. వంటివి కూడా బయట మార్కెట్లో చాలా రకాలు లభిస్తున్నాయి. అయితే ఇలాంటివి వైద్యుల సలహా ప్రకారం మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

మెంతులు..

మెంతులు, మెంతి ఆకులు.. ఈ రెండూ ఆహారానికి మంచి రుచిని అందించడమే కాదు.. తల్లుల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి కావడానికి కూడా దోహదం చేస్తాయి. ఇందుకు వీటిలో ఉండే క్యాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఐరన్.. వంటివే కారణం. అంతేకాదు.. కాన్పు తర్వాత మహిళల్లో ఎదురయ్యే సాధారణ సమస్యల్ని దూరం చేయడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. లేదంటే రోజూ కప్పు నీటిలో చెంచా మెంతుల్ని వేసి.. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే మరిగించాలి. ఆ తర్వాత వడకట్టుకొని పరగడుపునే ఈ మిశ్రమాన్ని తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె..

వంటకాల్లో కొబ్బరినూనెను వాడడానికి చాలామంది ఇష్టపడరు. అయితే ఇది తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీఆమ్లాలు తల్లి శరీరంలో పాల ఉత్పత్తిని పెంచే హార్మోన్లను విడుదల చేస్తాయి. తద్వారా సకల పోషకాలతో కూడిన పాలు రొమ్ముల నుంచి ఉత్పత్తవుతాయి. అలాగే ఇది తల్లీబిడ్డలిద్దరిలో రోగనిరోధకశక్తి స్థాయిని పెంచడానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి కొబ్బరినూనెతో వంటకాల్ని తయారుచేయడం మంచిది. అలా ఇష్టం లేకపోతే ఈ నూనెను కొద్దిగా మొదటి ముద్దలో వేసుకొని తినడం అలవాటు చేసుకున్నా సరిపోతుంది.

ఇవి కూడా!

* బిడ్డకు జన్మనిచ్చిన మహిళల్లో పాలు అధికంగా ఉత్పత్తి కావడానికి వెల్లుల్లి కూడా బాగా తోడ్పడుతుంది. అందుకే మన అమ్మమ్మలు, నాయనమ్మలు.. వెల్లుల్లితో తయారుచేసిన కారాన్ని బాలింతలకు ఆహారంగా ఇస్తుంటారు. అలాగే తులసి ఆకులు కూడా తల్లుల్లో అధిక మొత్తంలో పాలను ఉత్పత్తి చేస్తాయి.
* తల్లుల్లో పాల ఉత్పత్తికైనా, పిల్లల నాడీ వ్యవస్థ ఆరోగ్యానికైనా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు అధికంగా లభించే చేపల్ని కూడా తల్లులు ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు.
* అలాగే పప్పుల్లో ఉండే ప్రొటీన్లు కూడా తల్లుల్లో పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. అయితే సిజేరియన్ అయిన వారు మాత్రం ఏయే పప్పుల్ని తీసుకోవాలో వైద్యుల్ని అడిగిన తర్వాతే నిర్ణయించుకోవడం ఉత్తమం.
* పాలిచ్చే తల్లులకు విటమిన్ ఎ చాలా అవసరం. ఎందుకంటే ఇది బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పిల్లల వూపిరితిత్తులు ఆరోగ్యంగా ఎదగడానికి ఎంతో ముఖ్యం.
* బీరకాయ, దొండకాయ.. వంటి కాయగూరలు కూడా తల్లుల్లో ఎక్కువ మొత్తంలో పాలను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలే!
* బ్రౌన్ రైస్‌లోని ఫైబర్, ఇతర పోషకాలు తల్లుల్లో పాల ఉత్పత్తిని రెట్టింపుచేయడానికి దోహదం చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. అలాగే ఇది తల్లి రక్తంలో చక్కెర స్థాయుల్ని కూడా అదుపులో ఉంచుతుందట!

బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి వారికి అందించాల్సిన ఆహార పదార్థాలేంటో తెలుసుకున్నారు కదా! అయితే ఇవి ఎంత సహజసిద్ధమైనప్పటికీ వీటిని తీసుకునే ముందు ఓసారి డాక్టర్ సలహా కూడా తీసుకుంటే అటు తల్లి, ఇటు బిడ్డ ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.